జబర్దస్త్‌ మా కన్నతల్లి | Jabarthasth is our mother | Sakshi
Sakshi News home page

జబర్దస్త్‌ మా కన్నతల్లి

Published Wed, Apr 25 2018 11:48 AM | Last Updated on Wed, Apr 25 2018 11:48 AM

Jabarthasth is our mother - Sakshi

రాపేటి అప్పారావు

హాస్య రసామృతంలో తేలియాడిస్తారు. అలసిన మనసులను సేదదీరుస్తారు. ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఆ ఇద్దరు జబర్దస్త్‌ రాపేటి అప్పారావు, అద్దంకి శేషు. వీరిద్దరు సహా పలువురు జబర్దస్త్‌ నటులు సీఎంఆర్‌ వద్ద జరిగిన ప్రైవేటు కార్యక్రమానికి మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా సాక్షితో వారు పంచుకున్న ముచ్చట్లివి. 

షకలక శంకర్‌ నా దేవుడు

 విజయనగరం టౌన్‌ : నేనీ స్థాయిలో ఉన్నానంటే అది షకలక శంకర్‌ పుణ్యమే. విశాఖ అక్కయ్యపాలెంలో ఆటోమెబైల్స్‌ వ్యాపారం చేసుకునేవాడిని. లెంక సత్యానందం మా గురువు. థియేటర్‌ ఆర్ట్స్‌ చదివేటప్పుడు ఆయన మాకు తరగతులు చెప్పేవారు. ఆయన చెప్పే ప్రతి మాట నా జీవితంలో పాతుకుపోయాయి. రోజా, నాగబాబులు ఎంతో అభిమానంతో మమ్మల్ని చూస్తారు. జబర్దస్త్‌కి ముందు 50.. ఆ ర్వాత 150కి పైగా సినిమాలు చేశాను.

శ్రీ ఆంజనేయం, చందమామ, మహాత్మ, గోవిందుడు అందరివాడేలే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నేనింతే తదితర చిత్రాలకు ఆడిషన్స్‌ ద్వారా ఎంపికయ్యాను. చిన్నికృష్ణ దర్శకత్వంలో వీడుతేడా సినిమాలో అవకాశం ఇచ్చారు. హైదరాబాద్‌ వచ్చేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను.  సీనియర్‌ ఆర్టిస్ట్‌ బొమ్మలాట చిట్టి సారిక నన్ను అయిదేళ్ల పాటు ఆదరించారు.  సినీరంగంలోకి రావాలనుకున్నవారు డిగ్రీ చేసి, కళను పూర్తిగా నేర్చుకోవాలి.

కుటుంబ సభ్యుల ఆమోదం పొందాలి. అంకితభావంతో కష్టపడాలి. నటి శ్రీరెడ్డి ఆశయం చాలా గొప్పది. కానీ ఆమె ఎంచుకున్న మార్గం సరైంది కాదనేది నా అభిప్రాయం. చిన్న సినిమాలు విడుదల కాకుండా ఉండిపోతున్నాయి. కనీసం రోజుకు రెండైనా ప్రదర్శించాలి.         – రాపేటి అప్పారావు

గ్లిజరిన్‌ లేకుండా నటించా

జబర్దస్త్‌ కార్యక్రమంతో సినీ పరిశ్రమలో ప్రవేశించాను. సీక్రెట్‌ కెమెరా.. ముందుగా వెళ్తున్న వారిని బకరా చేస్తూ, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కార్యక్రమాల ద్వారా మంచి పేరు వచ్చింది. సుప్రీం సినిమాతో నా జీవితం మారిపోయింది. దాని తర్వాత 20 సినిమాలు చేశాను. వరుణ్‌ తేజ్‌ సినిమా మిస్టర్‌లో నా ప్రతి డైలాగ్‌ పేలింది. కుమారి 21 ఎఫ్‌కి సూర్యప్రతాప్‌ అనే దర్శకుడు నా గురించి రిఫరెన్స్‌ ఇచ్చారు. దర్శకుడు సుకుమార్‌ నిర్వహించిన ఆడిషన్స్‌లో గ్లిజరిన్‌ పెట్టుకుని ఏడుపు సీన్‌ చేయాల్సి ఉంది.

అందుకు గ్లిజరిన్‌ వాడకుండానే చేసిన సీన్‌కి కెమెరామన్, కో–డైరెక్టర్‌ ఏడ్చారు. అంత అద్భుతంగా ఆ సీన్‌ వచ్చింది. రంగస్థలం సినిమాకు ఆ విధంగానే నాకు అవకాశం వచ్చింది. నా అదృష్టం ఏమిటంటే ఒకదానికొకటి అద్భుతమైన పాత్రలు వస్తున్నాయి. ఇప్పటి వరకూ 40కి పైగా సినిమాలు చేశాను.  బెల్లంకొండ శ్రీనివాస్, హీరో గోపీచంద్‌ సినిమాలతో పాటు బృందావనమిది అందరిదీ వంటి చిత్రాలలో నటిస్తున్నాను. విజయనగరంతో చాలా పరిచయం ఉంది. ఆర్కెస్ట్రా ద్వారా పరిసర ప్రాంతాల్లో పనిచేశాను.     –  అద్దంకి శేషు కుమార్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

అద్దంకి శేషు కుమార్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement