
టాలీవుడ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కామెడీ షో జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతోమంది ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా లేడీ గెటప్స్‌లో ఆడియన్స్‌ను అలరిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో వినోద్, కొమరం, శాంతి స్వరూప్, మోహన్, తన్మయ్, సాయితేజ, పవన్, అప్పారావు చాలామందే ఉన్నారు. ప్రస్తుతం ఈ కామెడీ షో లేడీ గెటప్స్‌లో అలరిస్తున్న మోహన్ ఓ ఇంటివాడయ్యారు.
తాజాగా మోహన్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఈ వేడుకలో జబర్దస్త్ నటులు రాకెట్ రాఘవ, అధిరే అభి, గడ్డం నవీన్, అప్పారావు సహా పలువురు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను జబర్దస్ కమెడియన్ నవీన్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం మోహన్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment