srbc
-
కుక్కను రక్షించబోయి.. ఎస్సార్బీసీలో పడి యువకుడు గల్లంతు
అవుకు: శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ (ఎస్సార్బీసీ)లో పడిన పెంపుడు కుక్కను రక్షించబోయి ఓ యువకుడు నీళ్లలో కొట్టుకోపోయాడు. రామవరం గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. రామవరం గ్రామానికి చెందిన నాగరాజు, నారాయణమ్మ కుమారుడు మాసుబాకల నరేష్ (18).. ఇంటర్ పూర్తి చేశాడు. ఇంటి వద్ద ఖాళీగా ఉండటంతో మంగళవారం గేదెలను మేపటానికి వెళ్లాడు. వెంట ఉన్న కుక్క గ్రామ శివారులోని ఎస్సార్బీసీలో పడిపోయింది. దానిని రక్షించటానికి వెళ్లిన ఆయువకుడు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయాడు. అటుగా వెళ్తున్న ఓ బాలుడు గుర్తించి గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించడంతో వారు క్రేన్ సహాయంతో ఈతగాళ్లను కాలువలోకి దించి రాత్రి వరకు గాలించారు. అయినా, యువకుడి ఆచూకీ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కాలువలో కొట్టుకుపోయి ఉంటాడని స్థానికలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు నీటిలో గల్లంతు కావడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. -
ఆధునికీకరిస్తే గండికి నీరు దండి
గండికోట ప్రాజెక్టులో 26 టీఎంసీల నీటిని నిల్వ చేయాలంటే ప్రధాన కాలువను ఆధునికీకరించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ పనులను తక్షణం చేపట్టకపోతే లక్ష్యం మేరకు నీరు చేరడం కష్టమని భావిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో కాలువ పనులలో సింహభాగం పూర్తయినా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కనీసం పది శాతం పనుల పూర్తికి కూడా టీడీపీ ప్రభుత్వం నిధులు విదిలించలేదు. తాజాగా గండి ప్రాజెక్టుపై దృష్టి పెట్టిన జగన్ ప్రభుత్వం కాలువ ఆధునికీకరణకు చేపట్టాల్సిన చర్యలను పరిశీలిస్తోంది. తర్వాత నిధుల విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. సాక్షి ప్రతినిధి కడప : గండికోటలో అనుకున్న మేర నీరు నిల్వ ఉంచడానికి ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించడానికి సర్కారు సిద్ధమవుతోంది. ఎగువన కర్నూలు జిల్లాలోని ఎస్ఆర్బీసీ (ఫ్లడ్ ఫ్లో కెనాల్) పరిధిలో కాలువ ఆధునికీకరణ పనులను పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉంది. 20 వేల క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన ప్రధాన కాలువ స్థాయి ప్రస్తుతం పది వేల క్యూసెక్కులకు పడిపోయిందంటే పరిస్థితి అర్ధమవుతుంది. 20 వేల క్యూసెక్కుల నీరు దిగువకు రావాలంటే ఎగువన పెండింగ్‌లో ఉన్న పనులను అత్యవసరంగా పూర్తి చేయాల్. అప్పుడే వరదసమయాన గండికోట ప్రాజెక్టులో అనుకున్న మేర నీరు నిలిపే అవకాశముంటుందని నీటిపారుదల అధికారులు చెబుతున్నారు. అధికారుల నివేదిక మేరకు త్వరలోనే పెండింగ్ పనులు పూర్తికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలిసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో రూ.3వేల కోట్లు వెచ్చించి 80శాతం పనులను పూర్తి చేయించారు. గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ప్రభుత్వం మిగిలిన పనులను పూర్తి చేయలేకపోయింది. పెండింగ్ పనులు ఇలా.... ►ప్రధాన కాలువ పరిధిలో బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి గోరకల్లు వరకూ, అక్కడి నుంచి అవుకు టన్నెల్ వరకూ కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ►బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ నుంచి గోరకల్లు వరకు ప్రధాన కాలువలో కొన్ని స్ట్రక్చర్స్ వైండింగ్ పనులను చేపట్టాలి. ►కాలువ లైనిం గ్పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ►కేసీ కెనాల్ కాలువ క్రాసింగ్‌ల వద్ద స్ట్రక్చర్స్‌ను నిర్మించాలి. ఎస్ఆర్బీసీ ప్రధాన కాలువ ఆధునికీకరణ జరగక సగం నీరు కూడా దిగువకు రావడం లేదు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 40 రోజులు మాత్రమే వరద ప్రవాహం వచ్చే కాలమని లెక్క కట్టారు. ప్రస్తుతం వరద కాలువ కాల పరిధి 20 నుంచి 30 రోజులకు తగ్గిపోయింది. రోజుకు 20 వేల క్యూసెక్కుల నీరు దిగువకు చేరితే 20 రోజుల్లో గండికోటలో 26 టీఎంసీల నీటిని నిలిపే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం పది వేల క్యూసెక్కులకు మించి నీరొచ్చే పరిస్థితి లేదు. 26 టీఎంసీల నీరు గండికోటకు చేరేందుకు నెల రోజులు పట్టే అవకాశం ఉంది. వరద కాలువ తగ్గిపోయిన నేపథ్యంలో 20 నుండి 26 టీఎంసీల నీటిని నిలపాలంటే కచ్చితంగా ఎస్ఆర్బీసీ కాలువ నుంచి 20 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు తీసుకు రావాల్సి ఉంది. అందుకే తక్షణమే ఎస్ఆర్బీసీ పరిధిలో పెండింగ్ పనులను పూర్తి చేయాల్సిన అవసరముందని గుర్తించారు. ఆధునికీకరణ పనులు ఇలా.. ప్రధాన కాలువ గోరకల్లు వరకు రూ.99 కోట్ల విలువైన పనులు చేపట్టాల్సి ఉంది. 26వ ప్యాకేజీలో రూ.85 కోట్ల పనులు జరగాల్సి ఉంది. అవుకు టన్నెల్స్ పూడికతీతతోపాటు మిగిలి పనులు పూర్తికి మరో రూ. 60కోట్లు అవసరం. మొత్తంగా రూ. 244 కోట్లు అవసరమని భావిస్తున్నారు. కరువుతో అల్లాడుతున్న మన జిల్లా రైతాంగం బాధలు తొలగించేందుకు సిద్దమైన ప్రభుత్వం గండికోటపై దృష్టి పెట్టింది. ఈ ఏడాది 20 టీఎంసీలు, వచ్చే ఏడాది 26 టీఎంసీల నీటిని నిల్వ చేసి సాగుకు అందించాలని కంకణం కట్టుకుందిది. వరద సమయంలో సకాలంలో జిల్లాకు నీరు తీసుకువచ్చేందుకు ఎస్ఆర్బీసీ ప్రధాన కాలువలో పెడింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ పనులుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అధికారులు అందించినట్లు సమాచారం. -
ఎస్సార్బీసీ ప్రధాన కాలువకు గండి.
-
కట్టలు తెగిన నిర్లక్ష్యం
బనగానపల్లె/కోవెలకుంట్ల: తెలుగుదేశం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ (ఎస్సార్బీసీ)ని వరుస గండ్లు వెంటాడుతున్నాయి. కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాల్లోని 1.92 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రధాన కాల్వ గత ఆరేడేళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతోంది. ఆదివారం తెల్లవారు జామున బనగానపల్లె సమీపంలో ఎస్సార్బీసీ ప్రధాన కాల్వకు భారీ గండి పడటంతో పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు రావడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. రెండేళ్ల క్రితం ఇదే కాలువకు భారీ గండి పడి పంట పొలాలు నీట మునిగి నష్టం సంభవించింది. అదే ఏడాది అవుకు సమీపంలో మరో గండి పంట పొలాలను ముంచెత్తింది.అప్పుడు తాత్కాలిక మర మ్మతులతో సర్కార్ చేతులు దులుపుకున్న ఫలితంగా ఆదివారం భారీ గండి పడి బనగానపల్లె వాసులను భయాందోళనకు గురిచేసింది. ఎస్సార్బీసీని పటిష్టం చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన సర్కార్ నిద్రమత్తులో తూగుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందన్న విమర్శలు తాజా గండి నేపథ్యంలో వెల్లువెత్తుతున్నాయి. గండికి ప్రధాన కారణాలు గత ఏడాది అధికారులు అనాలోచితంగా ప్రవాహస్థాయికి మించి కాల్వకు నీటిని విడుదల చేశారు. అప్పటి నుంచి ఏడాదిగా కాల్వ పటిష్టతను పట్టించుకున్న దాఖలాలు లేవు. నీరు–చెట్టు పథకం కింద కాల్వలోకి జేసీబీలను దించి పనులు చేయించే సమయంలో కాల్వ దెబ్బతినడం, కట్టపై నిత్యం భారీ వాహనాలు తిరగడం, అధికారుల పర్యవేక్షణ కొరవడటం వల్ల మళ్లీ గండి పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. కాల్వ పటిష్టతను పరిశీలించిన తర్వాత నీటిని విడుదల చేయాల్సిన అధికారులు అదేదీ పట్టించుకోకుండా సామర్థ్యానికి మించి ఒకేసారి నీటిని విడుదల చేయడంతో గండి పడి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ముందస్తు సమాచారం లేకుండానే.. శుక్రవారం వరకు ఎస్సార్బీసీ ప్రధాన కాల్వ ద్వారా నీటిని విడుదల చేయని అధికారులు శనివారం ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఒకేసారి సుమారు 1,500 క్యూసెక్కులు విడుదల చేయడంపై కొందరు ఇంజనీరింగ్ అధికారులే తప్పుబడు తున్నారు. ప్రధాన కాల్వ దెబ్బతిన్నందున దశలవారీగా నీటిని విడుదల చేయాల్సిన అధికారులు ఇలా ఒకేసారి విడుదల చేయడంతో గండ్లు పడే ప్రాంతాలను అధికారులు గుర్తించలేకపోయారు. కట్టుబట్టలతో రోడ్లపైకి ... ఎస్సార్బీసీకి గండి పడి నీరంతా బనగానపల్లె పట్టణంలోని వివిధ కాలనీల్లోకి చేరింది. పెండేకంటి నగర్, ఆర్టీసీ బస్టాండ్ ఏరియా, ఈద్గానగర్, ఎరుకలికాలనీ.. తదితర ప్రాంతాలను నీరు ముంచెత్తింది. ఎరుకలి కాలనీలోని ఇళ్లలో రెండు అడుగుల లోతు నీరు ప్రవహించి బియ్యం, కందిపప్పు, వంట సామగ్రి తడిచిపోయింది. ఆర్టీసీ బస్టాండ్, పెట్రోల్‌బంకు, పవర్ హౌస్ ప్రాంతానికి విస్తరించడంతో ఈ ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఆర్టీసీ వాహనాల రాకపోకలు నిలిచిపోగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోకి భారీగా నీరు చేరడంతో ప్రహరీకి గండి కొట్టారు. దీంతో ఈద్గానగర్ జలదిగ్బంధమైంది. ఇళ్లలోకి నీరు చేరడంతో కాలనీవాసులు కట్టుబట్టలతో రోడ్డుపైకి చేరారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్లపై గడపాల్సి వచ్చిందని, అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో.. పండుగ పూట చిన్నపిల్లలు, వృద్ధులు ఆకలితో అలమటించాల్సి వచ్చిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎస్సార్బీసీ ప్రధాన కాలువకు గండి..
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా బనగానపల్లె శివారులోని ఎస్సార్బీసీ ప్రధాన కాలువకు గండిపడింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చొచ్చుకెళ్తోంది. దాదాపు 30 మీటర్ల మేర గండి పడడంతో... పెండేకంటినగర్ పూర్తిగా జలమయం అయ్యింది. దీంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. గండిని పూడ్చేందుకు పోలీసులు, రైతులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు గండిపడిన ప్రాంతానికి సమీపంలోనే.. మూడేళ్ల కిందట కూడా భారీ గండి పడిందని రైతులు అంటున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా... అధికారుల పట్టించుకోవడం లేదని, దీంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ నేత, బనగానపల్లె నియోజకవర్గ పార్టీ ఇంచార్జి కాటసాని రామిరెడ్డి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని గండిని పరిశీలించారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మూడేళ్ల కిందట కూడా 60 మీటర్ల మేర గండి పడిందని, కానీ ఎవరూ పట్టించుకోలేదని కాటసాని ఆరోపించారు. మళ్లీ మళ్లీ గండ్లు పడుతుండడం అధికారుల వైఫల్యంగా కన్పిస్తుందని అన్నారు. ఇప్పటికైనా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సార్బీసీ ప్రధాన కాలువకు గండి పడి గంటలు గడుస్తున్నా.. ఇప్పటికీ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతకంతకూ కాలువ నుంచి నీరు లోతట్టు ప్రాంతాల్లోకి చొచ్చుకెళుతుండటంతో స్థానికులు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. -
ఎస్సార్బీసీ ప్రధాన కాలువకు గండి
-
ఎండుతున్న ఆశలు!
- ఎస్ఆర్బీసీలో నిలిచిన నీరు - ఆందోళనలో రైతులు - స్పందించని అధికారులు బనగానపల్లె : ఆయకట్టు రైతుల ఆశలు నీరుగారాయి. మార్చి వరకు నీరు వస్తుందని ఎస్ఆర్బీసీ(శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్) కింద రబీ సీజన్లో పంటలు సాగు చేసిన అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పది రోజుల క్రితం నీటి విడుదల నిలిపివేయడంతో పంటలు ఎండిపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే దిగుబడులు లభించబోవని.. అప్పులే మిగులుతాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సార్బీసీ కింద కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాలలో 1.92లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం ఆశాజనకంగా ఉండడంతో మార్చి చివరి వరకు ఆయకట్టుకు నీరు వస్తుందని భావించి రబీలో సుమారుగా 6 వేల హెక్టార్లలో వరి పంట సాగు చేశారు. మరో 4వేల హెక్టార్లలో ఆరుతడి పంటలైన ఆముదం, మొక్కజొన్న, నువ్వులు, ఆవాలు.. ఇతర పంటలు సాగు చేశారు. సంబంధిత అధికారులు కూడా నీటివిడుదల మార్చి వరకు ఉంటుందని అనధికారికంగా పేర్కొనడంతో భరోసాతో ఉన్నారు. అయితే విద్యుత్ ఉత్పత్తి పేరున జనవరి నెలలో శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని నాగార్జున సాగర్‌కు విడుదలచేసి సీమ ప్రాంతానికి ప్రభుత్వం అన్యాయం చేసినట్లు ఆయకట్టు రైతులు వాపోతున్నారు. ఎస్ఆర్బీసీ ద్వారా నీటి విడుదల నిలిపివేయడంతో భూగర్భ జలాలు అడుగంటి పరోక్షంగా వ్యవసాయ బోర్ల ఆధారంగా సాగులో ఉన్న పంటలు కూడా ఎండిపోతున్నాయి. ముందస్తు సమాచారంలేదు.. ముందస్తు సమాచారం లేకుండా పది రోజుల క్రితమే నీటిని ఎస్ఆర్బీసీ ప్రధాన కాలువకు నిలిపివేశారు. నీటి విడుదల నిలిపివేసే సమాచారాన్ని జనవరి ప్రారంభంలోనే చెప్పి ఉంటే పంటలను సాగుచేసే వారం కాదని ప్రస్తుత పంట నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. నంద్యాల మండలంలో.. మండల పరిధిలోని పోలూరు, మునగాల, రాయమాల్పురం, పులిమద్ది, ఊడుమాల్పురం గ్రామ రైతులు.. ఎస్సార్బీసీ నీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ గ్రామాల్లో సుమారు 2500 ఎకరాల్లో మిరప పంట సాగు చేశారు. ఎకరాకు రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టారు. ఒకతడి నీరు పొలానికి పారితే పంట పూర్తిగా చేతికి వస్తుంది. అయితే ఎస్ఆర్బీసీకి నీరు బంద్ కావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎకరా నీరు పారించుకోవడానికి అద్దె పైపులు, ఆయిల్ ఇంజన్ల ఖర్చు రూ.2వేలు వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చాకిరేవుకెళ్తూ...తిరిగిరాని లోకానికి
–ఆటో బోల్తాపడి యువతి మృతి సంజామల: చాకిరేవుకెళ్తూ ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. గుళ్తదుర్తి రహదారిలో రైల్వేబ్రిడ్జి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సంజామలకు చెందిన చాకలి శ్రీను, సావిత్రి దంపతులు బట్టలు ఉతికేందుకు గ్రామ సమీపంలోని గుళ్లదుర్తి రహదారిలో ఉన్న ఎస్సార్బీసీ కాలువ వద్దకు ఆటోలో బయలు దేరారు. అయితే రైల్వేబ్రిడ్జి సమీపంలో ఆటో అదుపుతప్పి రోడ్డుపక్కనున్న పొలాల్లో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సావిత్రి (30) తలకు బలమైన గాయాలవ్వడంతో అక్కడికక్కడే మృతిచెందింది. భర్త శ్రీనుతో పాటు డ్రైవరుకు ప్రమాదం తప్పింది. సమీపంలోనే బట్టలుతుకుతున్న రజకులు, పొలాల్లో వ్యవసాయ పనులు చేస్తున్న రైతు కూలీలు సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి భర్త శ్రీనుతో పాటు కుమారుడు, కుమార్తె సంతానం. -
నీటి విడుదల నిలిపివేత
అవుకు: స్థానిక రిజర్వాయర్ నుంచి వైఎస్సార్ కడప జిల్లాకు వెళుతున్న నీటిని ఆదివారం నిలిపివేశారు. గతేడాది నవంబర్ నుంచి మూడు నెలల పాటు నీటిని వదలినిట్లు ఎస్సార్బీసీ ఈఈ పాపారావు తెలిపారు. శ్రీశైలం నుంచి నీటి విడుదల వేయడంతో ప్రస్తుతం గోరుకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్‌కు 700 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉందన్నారు. సంగపట్నం ప్రధాన కాలువకు 200 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో ఉందని తెలపారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 1.80 టీంఎసీల నీరు నిల్వ ఉందని ఈఈ పేర్కొన్నారు. వారం రోజుల్లో గోరకుల్లు నుంచి నీటి విడుదల నిలిపివేస్తారని తెలిపారు. -
బానకచెర్ల క్రాస్ రెగ్యులేటరు నుంచి నీరు విడుదల
పాములపాడు: మండలంలోని బానకచెర్ల క్రాస్ రెగ్యులేటరు నుంచి ఆదివారం 1125 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో ఎస్ఆర్బీసీకి 1050 క్యూసెక్కులు, కేసీసీ 75 క్యూసెక్కులు విడుదల చేసినట్లు డీఈ శివరాంప్రసాద్ తెలిపారు. వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటి విడుదల నిలిపివేశామన్నారు. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరు నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు డీఈ వెల్లడించారు. -
ఎస్ఆర్బీసీకి 1,700 క్యూసెక్కులు విడుదల
బానకచెర్ల (పాములపాడు) : మండలంలోని బానకచెర్ల క్రాస్ రెగ్యులేటరు నుంచి ఆదివారం ఎస్ఆర్బీసీకి 1,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు డీఈ శివరాంప్రసాద్ తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరు నుంచి 2,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందన్నారు. ఇందులో తెలుగుగంగకు 300, కేసీసీకి 400 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నట్లు చెప్పారు. -
ఏం.. తమాషాగా ఉందా!
- ఎస్ఆర్బీసీ ప్యాకేజీ పనుల పురోగతి చాలా పూర్ - పనులు పూర్తి చేసేందుకు కచ్చితమైన సమయం చెప్పట్లేదు - కర్ణాటకపై ఒత్తిడి చేసి నీరు తెచ్చినా మీతో పనులు చేయించలేకపోతున్నా - నెలాఖరులోగా హంద్రీనీవా డిస్ట్రిబ్యూటరీలు పూర్తి కావాలి - ఇంజినీర్లపై కలెక్టర్ ఆగ్రహం కర్నూలు సిటీ: ‘ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టుల పనులు పూర్తి చేయలేకపోతున్నారు.. నీళ్లు లేక రైతులు నష్టపోతున్నారు..ఏం.. తమాషాగా ఉందా, ఇంకెన్నాళ్లు పనులు చేస్తారు’ అంటూ జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ జల వనరుల శాఖ ఇంజినీర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తాత్కాలిక పనులు చేసి నీరు ఇస్తామంటే కుదరదు.. ఎప్పటి లోగా పనులు పూర్తి చేస్తారో కచ్చితమైన సమాధానం ఎందుకు చెప్పలేక పోతున్నారు’ అంటూ కలెక్టర్ మండి పడ్డారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సాగు నీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఆయన జల వనరుల శాఖ ఇంజినీర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 15 తేదీలోగా పెండింగ్ పనులు చేయాలన్నారు. ఎస్ఆర్బీసీ 25వ ప్యాకేజీలో ఇంకా 87 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 6.39 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వక పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వచ్చే వారం 24, 25, 26, 27 ప్యాకేజీల కాంట్రాక్టర్లతో కలిసి వస్తే కచ్చితమైన సమాచారం వస్తుందన్నారు. గోరుకల్లు రిజర్వాయర్ పనులు వచ్చే వారంలోపు ఓ కొలిక్కి రావాలని ఈఈకి సూచించారు. సిద్ధాపురం లిఫ్ట్ పనులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేసినా ఎందుకు పనులు చేయడం లేదని ప్రశ్నించారు. ముచ్చుమర్రి పనుల్లో ఇంజినీర్లు ఫెయిల్ ‘ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కింద కేసీ నీరు ఇచ్చేందుకు రూ. కోట్లు ఖర్చు పెట్టి తాత్కాలిక విద్యుత్ సదుపాయం కల్పించినా పనులు పూర్తి కాలేదు. ఎఫర్ట్ పెట్టామంటూ అందరూ కథలు చెబుతున్నారా’ అంటూ హంద్రీనీవా ఇన్చార్్జ ఎస్ఈ నారాయణ స్వామిని ప్రశ్నించారు. మూడు వారాలుగా మోటారు సమస్యను చెబుతున్నారే ఎందుకు పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది కూడా గురురాఘవేంద్ర కింద ఉన్న ఎత్తిపోతల పథకాలను ముందుగా కాకుండా సీజన్ చివరిలో మొదలు పెట్టేలోగా నీరు నిలిచిపోయిందన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఒత్తిడి చేసి నీరు తీసుకు రాగలిగామని, మీతో పనులు చేయించలేక పోతున్నానని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హంద్రీనీవాకు మీ వల్లే నీరు అందడం లేదు: హంద్రీనీవా కాలువ కింద ఉన్న డిస్ట్రిబ్యూటరీ పనులు సకాలంలో పనులు పూర్తి చేయకపోవంతో జిల్లాకు హంద్రీనీవా ద్వారా నీరు అందడం లేదన్నారు. ఈ నెల 31లోపు కచ్చితంగా పనులు పూర్తి చేయాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఈనెల 31లోపు పూర్తి చేసి, జనవరి 1వ తేదీన కచ్చితంగా నీరు ఇవ్వాలన్నారు. తాను అనుకుంటే కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టగలనని కలెక్టర్ హెచ్చరించారు. సర్వే రిపోర్ట్ లేకుండా ఎలా అంచనా వేశారు జిల్లాలోని వాగులన్నింటిలో జంగిల్ క్లియరెన్స్ చేసేందుకు అంచనాలు వేయమంటే ఎలాంటి సర్వే చేయకుండానే ఎలా అంచనాలు వేశారని ఎస్ఈ చంద్రశేఖర్ రావును ప్రశ్నించారు. ఇలా చేస్తే ఏటా జంగిల్ క్లియరెన్స్‌లు చేసేందుకే సరిపోతుందని, పనులు చేశాక విజిలెన్స్ వాళ్లు తనిఖీ చేస్తే ఎవరిని బాధ్యులు చేస్తారని ప్రశ్నించారు. జిల్లాలో రెగ్యులర్ ఏఈఈలు ఉన్న మండలాల్లో మాత్రమే సర్వే చేసి, ఎన్ని వాగులు అయితే చేయగలరో మీరే నిర్ణయించుకోని ఫీల్డ్కి పోయి కొలతలు వేసి అంచనాలు వేయాలని సూచించారు. వచ్చే వారం పక్కా సమాచారంతో రావాలన్నారు. సమావేశంలో ఎస్ఈలు చంద్రశేఖర్ రావు, సూర్యకూమార్, నారాయణస్వామి, ఈఈలు విశ్వనాథం, రెడ్డిశేఖర్‌రెడ్డి, రెడ్డిశంకర్, శ్రీనివాసులు, బాలచంద్రారెడ్డి, ప్రసాద్‌రెడ్డి, పురుషోత్తం, సుబ్బరాయుడు, డీఈఈ, చిన్న నీటి పారుదల శాఖ ఏఈఈలు తదితరులు పాల్గొన్నారు. -
డిసెంబర్ చివరి నాటీకి గాలేరు-నగరి పూర్తి
- గోరుకల్లుపై రెండు రోజుల్లో నిర్ణయం - సాగునీటి తర్వాత చూద్దామంటూ దాటవేత - సాగునీటి ప్రాజెక్టులపై సీఈలతో సీఎం సమీక్ష కర్నూలు సిటీ: రాయల సీమ జిల్లాలకు ప్రధానమైన గాలేరు-నగరి సుజల స్రవంతి పథకం పనులు వచ్చే నెల చివరి నాటికి కచ్చితంగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు జల వనరుల శాఖ సీఈని ఆదేశించారు. సోమవారం విజయవాడలో సాగునీటి ప్రాజెక్టుల పనులపై సీఎం సమీక్షించారు. రాయలసీమలోని కడప, చిత్తూరు, నెల్లురు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు ఈ ఏడాది కచ్చితంగా కాల్వలో నీరు పారించాలన్నారు. పనుల్లో ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకరావాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పనులు చేయని కాంట్రాక్టర్లతో మాట్లాడి వేగవంతం చేయాలన్నారు. ఎస్ఆర్బీసీ విస్తరణ పనులు డిసెంబరు 15 లోగా పూర్తి చేయాలన్నారు. ప్రధాన కాల్వలో కనీసం 5 వేల క్యుసెక్కుల నీరు పారేలా పనులు చేయించాలని సీఎం ఇంజినీర్లకు సూచించారు. గోరుకల్లు పరిస్థితి ఎంటని, ఎందుకు లీకేజీలే అవుతున్నాయని సీఎం ఆరా తీశారు. నివారణ చర్యలు చేపట్టేందుకు లోడెడ్ బర్మ్‌కు రూ. 45 కోట్లతో అంచనాలు వేశామని, దీనిపై రెండు రోజుల్లో ప్రిన్సిపాల్ సెక్రటరీ, సీఈ, మంత్రితో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. టీబీ డ్యాం నీటి గురించి జిల్లా ఇంజినీర్లు పంపిన నివేదికలపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుదని పేర్కంటూ సీఎం దాటవేసినట్లు తెలిసింది. వచ్చే నెల చివరి నాటికి గండికోటకు కచ్చితంగా 5 వేల క్యుసెక్కుల నీరు వెళ్లేలా పనులు చేయించాలన్నారు. అలాగే ఆవుకు సొరంగం పనుల గురించి సీఎం సీఈని అడిగి తెలుసుకున్నారు. -
33 టీయంసీల నీరు అవసరం
కర్నూలు సిటీ: ఖరీఫ్‌లో సాగు చేసిన ఆయకట్టుకు, అలాగే తాగునీటికి 33.85 టీయంసీల నీరు కావాలని జల వనరుల శాఖ ఇంజినీర్లు ఆ శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు దృష్టికి తీసుకపోయారు. శుక్రవారం విజయవాడ నుంచి జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆ శాఖ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎస్ఆర్బీసీ కింద ప్రస్తుతం ఉన్న 92 వేల ఎకరాల ఖరీఫ్ పంటలకు, రబీలో 30 వేల ఎకరాలకు 5.8 టీయంసీల నీరు అవసరమని సంబంధిత అధికారులు తెలియజేశారు. తెలుగుగంగ కాలువ కింద ఖరీఫ్ పంటలకు, తాగు, రబీలోని ఆయకట్టుకు 13 టీయంసీలు, హంద్రీనీవా కింద జిల్లాలోని ఖరీఫ్‌లో సాగు అయిన ఆయకట్టు, తాగు నీటిని కేవలం 0.5 టీయంసీలు అవసరమని చెప్పారు. తుంగభద్ర దిగువ కాలువ కింద ప్రస్తుతం సాగులో ఉన్న ఆయకట్టు బయట పడేందుకు 4.5 టీయంసీలు కావాలని అడిగారు. పక్కా వివరాలతో కూడిన నివేదికలు మరో వారం రోజుల్లో అందజేయాలని మంత్రి ఇంజినీర్లకు సూచించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో సీఈ నారాయణ రెడ్డి, ఎస్ఈలు చంద్రశేఖర్‌రావు, నారాయణస్వామి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఈఈలు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఆర్బీసీలో గుర్తు తెలియని మృతదేహం
బనగానపల్లె రూరల్: రవ్వల కొండ సమీపంలోని ఎస్ఆర్బీసీ ప్రధాన కాలువలో గుర్తు తెలియని మృతదేహం బుధవారం కనిపించింది. నీటి ప్రవహంలో కొట్టుకొచ్చి ముళ్లకంపల వద్ద అగింది. మృతిని వయసు 35–40 సంవత్సరాలు ఉంటుంది. నలుపు రంగు ప్యాంట్, తెలుపు, నలుపు, బిస్కెట్ రంగు కలిగిన చొక్కొతో పాటు బనియన్ ధరించి ఉన్నాడు. రెండు మూడు రోజుల క్రితమే మృతి చెంది ఉంటారన్నారన అనుమానం పోలీసులు వ్యక్తం చేశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని బనగానపల్లె ఎస్ఐ సీఎం రాకేష్ తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఎస్సార్బీసీ కాల్వలో వ్యక్తి మృతదేహం
గడివేముల: కొర్రపోలూరు సమీపంలోని ఎస్సార్బీసీ కాల్వలో శనివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి స్థానికులు బయటకు తీశారు. మృతుడి వయస్సు 30 సంవత్సరాలు ఉంటుంది. వీఆర్వో ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామాంజనేయరెడ్డి తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మతదేహాన్ని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు. -
ఎస్ఆర్బీసీ ఇంజినీర్లపై కలెక్టర్ అగ్రహం
– వాస్తవాలు దాచొద్దని హితవు – గోరుకల్లు రిజర్వాయర్ లీకేజీపై కలెక్టర్ ఆరా – ఆవుకులో 4 టీఎంసీలు నిల్వ చేయాలని ఆదేశం కర్నూలు(సిటి): శ్రీశైలం కుడి కాలువ పనులు పూర్తి చేసి, ఈ ఏడాది ఆవుకు రిజర్వాయర్‌లో 4 టీఎంసీల నీరు నిల్వ చేస్తామని చెప్పి ఎందుకు మాట మార్చుతున్నారని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఎస్ఆర్బీసీ ఇంజినీర్లపై అగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలపై జల వనరుల శాఖ ఇంజినీర్లతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా అద్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్‌రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మణిగాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఆర్బీసీ కాల్వపై సీఎం, మంత్రి పర్యటించిన సమయంలో గోరుకల్లులో 7 టీఎంసీలు, ఆవుకు జలశయంలో 4 టీఎంసీలు నిల్వ చేస్తామని చెప్పారు. ఆ రోజు చెప్పినట్టు ఇప్పుడెందుకు చేయలేకపోతున్నారు.. తమాషాగా ఉందా మీకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవుకులో 4 టీఎంసీలు నిల్వ చేస్తే టన్నెల్లోకి నీరు వెళ్లుతుందని, తాత్కలికంగా గోడ నిర్మించి నీటిని నింపుతామని సంబంధిత ఇంజినీర్లు చెప్పారు. మీరు ఏమైనా చేయండి ఆయకట్టు రైతులకు మాత్రం ఖచ్చితంగా నీరు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. లేకపోతే సంబంధిత ఇంజినీర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోరుకల్లు లీకేజీపై దష్టిసారించాలని ఇంజనీర్లకు సూచించారు. కేసీ కాలువ వెంట అధికారులు పర్యటించి, అక్రమంగా కాల్వపై వేసుకున్న పైపులను, మోటార్లను తొలగించాలని ఎస్ఈని ఆదేశించారు. వెలుగోడు రిజర్వాయర్‌ను వారం రోజుల్లో నింపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎస్ఈ చంద్రశేఖర్ రావు, ఎస్ఆర్బీసీ–1,2 ఎస్ఈ సూర్యకుమార్, డీఆర్ఈ గంగాధర్‌గౌడు, ఈఈలు తదితరులు పాల్గొన్నారు. -
నెరవేరిన రెండు దశాబ్దాల కల
– గోరుకల్లు జలాశయానికి చేరిన నీరు – ఎస్సార్బీసీకి 900 క్యూసెక్కులు – రిజర్వాయర్‌కు 6 క్యూసెక్కులు – 12 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా చూడాలన్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పాణ్యం: ఎట్టకేలకు గోరుకల్లు జలాశయంలోకి శుక్రవారం మొట్టమొదటి సారిగా నీరు చేరింది. ఈ జలాశయానికి 1991లో శంకుస్థాపన చేయగా.. దాదాపుగా రెండు దశబ్దాల పాటు పనులు జరుగుతూనే ఉన్నాయి. పలుమార్లు మంత్రులు, ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా.. పనులు నత్తనడకన సాగుతూ అనుకున్న సమయానికి నీరు ఇవ్వలేక పోయారు. ఈ ప్రాజెక్టు నిండితే 1.92 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. శ్రీశైలం డ్యాంకు వరద నీరు రావడంతో బనకచర్ల నుంచి ఎస్సార్బీసీ(శ్రీశైలం రైట్‌బ్యాంక్ కెనాల్)కు 1500 క్యూస్కెకుల నీరు విడుదల చేస్తున్నారు. ఈ నీటిలో 600 క్యూసెక్కులను శుక్రవారం గోరుకల్లు రిజర్వాయర్‌కు తరలించారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్యెల్యే గౌరు చరితారెడ్డి జలాశయం వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. జలాశయంలోకి వెళ్తున్న నీటిని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ఎన్నో పర్యాయాలు మంత్రికి వినతిపత్రాల ద్వారా విన్నవించామన్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 12 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 5 టీఎంసీలు నిల్వ ఉంచేందుకు సిద్ధం చేసినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎస్సార్బీసీ కాలువకు 900 క్యూసెక్కులు నీరు వదులుతున్నామన్నారు. ఎస్సార్బీసీకి అదనంగా 1000 క్యూసెక్కుల నీరు రావాల్సి ఉందన్నారు. ప్రాజెక్టులో 12 టీఎంసీల నీరు నిల్వ ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. విశ్రాంత సీఈ చిట్టిబాబు, ఎస్ఈ రామచంద్రయ్య, ఈఈలు సుబ్బరాయుడు, రమేష్, డీఈ ఎల్పీ రెడ్డితో పాటు అ«ధికారులు పాల్గొన్నారు. నష్టపరిహారం త్వరగా అందించండి గోరుకల్లు జలాశయానికి భూములను ఇచ్చినౖ రెతులకు ఇంకా రూ. 7కోట్ల పరిహారం అందాల్సి ఉందని రైతులు..ఎమ్యెల్యే దష్టికి తెచ్చారు. అక్కడే ఉన్న ఎస్ఈతో ఆమె మాట్లాడారు. త్వరగా పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. సమస్యను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లనున్నట్లు ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి చెప్పారు. గ్రామానికి నీరు విడుదల చేయాలి తమ గ్రామానికి నీరు విడుదల చేయాలని కొండజుటూరు గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించి ఇబ్బందులను వివరించారు. కాలువకు ఉన్న చిన్న గేట్లను ఎత్తి రైతులను అదుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పాలం చంద్రశేఖర్‌రెడ్డి, గడివేముల మండల కన్వీనర్ సత్యనారాయణరెడ్డి, నాయకులు వెంగళరెడ్డి, ఇమాం, భోగేష్, బాలస్వామి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. -
అధికారుల ఇళ్లపై ఏసీబీ దాడులు
కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం మెరుపు దాడులకు దిగారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో పలు అధికారుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. కర్నూలు జిల్లాలో ఓ ప్రభుత్వాద్యోగి ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నాయి. నంద్యాల ఎస్ఆర్బీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషుబాబు ఇంటిపై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో సోదాలు చేస్తున్నారు. ఈ దాడుల్లో భారీగా ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తుంది. విశాఖపట్నం: కేపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ(సీఆర్డీఏ) టౌన్ ప్లానింగ్ అధికారి రెహ్మాన్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం మెరుపు దాడులుకు దిగారు. విశాఖలోని ఆయన ఇంటితో పాటు విజయవాడ, కర్నూలులోని బంధువుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న అభియోగంతో ఏసీబీ దాడులు చేసింది. గతంలో రెహ్మాన్ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ సిటీ ప్లానర్‌గా పని చేశాడు. ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి. కోట్లలో ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తుంది. -
ఆయకట్టు..కనికట్టు
అభివృద్ధి పేరిట ప్రభుత్వం హడావుడి చేయడం.. అందుకు తగినట్లుగా అధికారులు అంకెల గారడీ చేయడం పరిపాటిగా మారింది. వాస్తవ విషయానికొస్తే.. కాగితాల్లో చూపిన లెక్కలేవీ కార్యరూపం దాల్చని పరిస్థితి. ఇదేమంటే ప్రభుత్వం ఏమి చేస్తారంటే నివేదిక రూపంలో పంపామని.. అమలు తమ చేతుల్లో లేదని అధికారులు చేతులెత్తేస్తున్నారు. జిల్లాలో అదనపు ఆయకట్టు అభివృద్ధి ఈ కోవకే చెందుతుంది. కర్నూలు సిటీ: కరువు నేలపై కన్నీళ్లు పారించయినా ఈ ఏడాది అదనపు ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలకు పోయింది. ఆ మేరకు జల వనరుల శాఖ అధికారులు జిల్లా వాస్తవ పరిస్థితి తెలిసీ.. రెండంకెల అభివృద్ధి పేరిట సాగునీటి ప్రాజెక్టుల కింద అదనపు ఆయకట్టు అభివృద్ధికి గత జూన్‌లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ ఏడాది జిల్లాలోని వివిధ కాలువ కింద 1.92 లక్షల ఎకరాల ఆయకట్టు అభివృద్ధి చేస్తామని అందులో వెల్లడించారు. ఇందులో ఎస్ఆర్బీసీ కింద 1,703 ఎకరాలు, తెలుగుగంగ కింద 39,160, హంద్రీనీవా కింద 73వేలు, గురురాఘవేంద్ర కింద 37వేలు, సిద్ధాపురం ఎత్తిపోతల కింద 21,300, చిన్ననీటి పారుదల శాఖ పరిధిలోని చెరువుల కింద 20వేల ఎకరాలను అదనంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అయితే జిల్లాలో వివిధ కాల్వల కింద మొత్తం 7,79,136 ఎకరాల స్థిరీకరించిన ఆయకట్టు ఉంది. ఇందులో గత ఏడాది వివిధ కారణాలతో 4.28 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించారు. మిగిలిన ఆయకట్టును అభివృద్ధి చేసేందుకు చేపట్టిన ఆయా ప్రాజెక్టుల పనులు సక్రమంగా చేపట్టకపోవడమే అందుకు కారణమైంది. అలాంటప్పుడు అదనపు ఆయకట్టు అభివృద్ధి ఎలా సాధ్యమనేది ప్రశ్నార్థకమైంది. ఈనెల 13న నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశం(ఐఏబీ)లోనూ అదనపు ఆయకట్టు ఊసే కరువైంది. ప్రభుత్వానికి ప్రతిపాదించిన విధంగా అదనపు ఆయకట్టు ప్రస్తావనే లేకుండా సమావేశం సాగింది. సగం ఆయకట్టుకే గతి లేదు.. తుంగభద్ర దిగువ కాల్వ కింద ఖరీఫ్, రబీ సీజన్లలో స్థిరీకరించిన ఆయకట్టు 1,51,134 ఎకరాలు. ఇందులో రెండు సీజన్లకు కలిపి 60వేల ఎకరాలకు మించి నీరివ్వలేకపోతున్నారు. కాల్వను పూర్తి స్థాయిలో ఆధునీకరించకపోవడం, కన్నడిగుల జలచౌర్యాన్ని నిలువరించలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. కేసీ కాల్వ కింద జిల్లాలో 1,84,209 ఎకరాలకు గాను 1.50 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందుతోంది. కెనాల్ డిస్ట్రిబ్యూటరీలకు మరమ్మతులు చేయకపోవడం వల్ల చివరి ఆయకట్టుకు సక్రమంగా నీరు సరఫరా కావడం లేదు. శ్రీశైలం కుడి గట్టు కాలువ కింద 1వ బ్లాక్ నుంచి 16 బ్లాకుల వరకు 1,53,936 ఎకరాల ఆయకట్టు ఉం డగా.. గతేడాది ఖరీఫ్‌లో 1వ బ్లాకు నుంచి 11 బ్లాకు వరకు 81879 ఎకరాలు, 12 నుంచి 16 వరకున్న బ్లాకులకు 33,150 ఎకరాల ఆయకట్టు సాగయింది. ప్రస్తుతం ఈ కాల్వ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పెండింగ్ పనులు పూర్తయితే తప్ప.. పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీరందని పరిస్థితి. తెలుగుగంగా కాల్వ కింద మొత్తం 1,14,500 ఎకరాలు స్థిరీకరించిన ఆయకట్టు ఉంది. ఇందులో 75,340 ఎకరాల ఆయకట్టు మాత్రమే యేటా సాగవుతోంది. కెనాల్‌కు డిస్ట్రిబ్యూటరీ ఉన్నా.. పిల్ల కాలువలు లేకపోవడంతో 39,160 ఎకరాలకు నీరు కరువైంది. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం కింద జిల్లాలో 80వేల ఎకరాల ఆయకట్టు ఉంది. డిస్ట్రిబ్యూటరీలు, సబ్ కెనాల్స్, పిల్ల కాలువలు లేకపోవడం, ఇందుకు అవసరమైన భూములను సేకరించకపోవడంతో గతేడాది ప్రతిపాదించిన 14,500 ఎకరాలను ఈ ఏడాది కూడా ప్రతిపాదించడంతో సరిపెట్టారు. గురురాఘవేంద్ర ప్రాజెక్టు కింద 50వేల ఎకరాలు సాగవ్వాల్సి ఉండగా.. ప్రాజెక్టు కింద చేపట్టిన ఎత్తిపోతల పథకాల పనులు పూర్తి కాకపోవడంతో 13వేల ఎకరాలకే పరిమితమవుతోంది. చిన్న నీటిపారుదల శాఖ పరిధిలోని చెరువుల కింద 84వేల ఎకరాలు గాను, 40 వేలకు మించి సాగు కావడం లేదు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీరు-చెట్టు వల్ల 16వేల ఎకరాలు అదనంగా ఆయకట్టును అభివృద్ధి చేయాలని అధికారులు ప్రతిపాదించారు. వర్షాలు కురిస్తేనే అదనపు ఆయకట్టు వర్షాలు సమృద్ధిగా కురిసి జలశయాలు నిండితేనే అదనపు ఆయకట్టు అభివృద్ధి చెందుతుంది. ఒక్క కాల్వల ద్వారానే కాకుండా చెక్‌డ్యాంలు, ఫారంపాండ్స్, చెరవుల ద్వారా భూగర్భ జలాలు పెరిగితే ఆయకట్టు మెరుగవుతుంది. గురురాఘవేంద్ర ప్రాజెక్టు కింద చేపట్టిన మూడు ఎత్తిపోతల పథకాల ద్వారా మాత్రమే అదనపు ఆయకట్టు అబివృద్ధి చెందే అవకాశం ఉంది. అదనపు ఆయకట్టు అభివృద్ధికి పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. - చిట్టిబాబు, చీఫ్ ఇంజనీర్ -
బిల్లులు చెల్లించాల్సిందే!
కర్నూలు(అర్బన్) : సాగునీటి శాఖలో కాంట్రాక్టర్ల ఒత్తిళ్లకు ఇంజనీర్లు విలవిలలాడుతున్నారు. నిర్ణీత ప్రమాణాల మేరకు పనులు నాణ్యతగా చేయకపోయినప్పటికీ బిల్లులు చెల్లించాల్సిందేనంటూ కాంట్రాక్టర్లు ఒత్తిళ్లు చేస్తున్నారు. మరమ్మతులు, ఆధునికీకరణ, పునరుద్ధరణ (ట్రిపుల్ ఆర్) పథకం కింద 8 చెరువుల్లో చేపట్టిన పనులకు బిల్లులు ఇవ్వాలంటూ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు చేస్తున్నారు. ఈ బిల్లుల జారీ ఫైలు కలెక్టరేట్లో చక్కర్లు కొడుతున్నా బిల్లులకు మాత్రం మోక్షం లభించడం లేదు. ఈ నేపథ్యంలోనే సాగునీటిశాఖ ఎస్ఈ నాగేశ్వరరావు దీర్ఘకాలిక సెలవులో వెళ్లడం చర్చనీయాంశమవుతోంది. కాంట్రాక్టర్ల ఒత్తిళ్లు తట్టుకోలేకే సెలవులో వెళుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే, సొంత పనులకే సెలవులో వెళుతున్నానని ఎస్ఈ అంటున్నారు. తాత్కాలికంగా ఇంచార్జీ ఎస్ఈగా ఎస్ఆర్బీసీ ఎస్ఈ శ్రీనివాసరావు నియమితులయ్యారు. మొత్తం మీద తాజా పరిణామాలు సాగునీటి శాఖలో కలకలం రేపుతున్నాయి. రూ. 70 లక్షల బిల్లుల కోసం ఒత్తిళ్లు! జిల్లాలోని 8 చెరువుల్లో ట్రిపుల్ ఆర్ పథకం కింద కాంట్రాక్టర్లు పనులు చేపట్టారు. ఈ పనులకు సంబంధించి రూ.70 లక్షలను కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి వుంది. అయితే ఈ పనులకు సంబంధించి బిల్లులను మంజూరు చేయాల్సిన జిల్లా కలెక్టర్ పలు పనులను పరిశీలించి అసంతృప్తిని వ్యక్తం చేయడమే గాక, బిల్లుల ఫైల్‌ను తిప్పి పంపించేసినట్లు తెలుస్తోంది. అయితే కాంట్రాక్టర్లు మాత్రం బిల్లులను చెల్లించాలని ఎస్ఈపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచినట్లు సమాచారం. అంతేగాక ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సిన పనుల విషయంలో కూడా ఎస్ఈపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే తగినంత మంది సిబ్బంది లేని కారణంగానే పనుల్లో పురోగతి కనిపించడం లేదనే విషయాన్ని ఎస్ఈ కలెక్టర్ దృష్టికి తీసుకుపోలేక పోవడం వల్లే మాట పడాల్సి వచ్చిందని నీటి పారుదల శాఖ ఉద్యోగులే చెప్పుకోవడం గమనార్హం. ఈ పోస్టు కోసం పైరవీలు షూరూ...! మరోవైపు జిల్లా నీటి పారుదలశాఖకు ఎస్ఈగా వచ్చేందుకు పక్క జిల్లాలో విధులు నిర్వహిస్తున్న మరో ఎస్ఈ తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి గ్రీన్ సిగ్నల్ కోసం ఆయన ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. కారణాలు ఏవైనా వ్యక్తిగత పనుల నిమిత్తం ఎస్ఈ ఆర్ నాగేశ్వరరావు ఈ నెల 3వ తేదీ నుంచి మార్చి 21 వరకు సెలవు పెట్టారు. ఎస్ఈ నాగేశ్వరరావు సెలవుపై వెళ్లిన దృష్ట్యా నంద్యాల ఎస్ఆర్బీసీ సర్కిల్-1 ఎస్ఈ శ్రీనివాసరావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తు నీటి పారుదలశాఖ (పరిపాలన) ఈఎన్సీ రవికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇంచార్జి ఎస్ఈ శ్రీనివాసరావు ఈ నెల 4వ తేదీన రానున్నారు.