నెరవేరిన రెండు దశాబ్దాల కల | water for gorukallu | Sakshi
Sakshi News home page

నెరవేరిన రెండు దశాబ్దాల కల

Published Fri, Aug 12 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

నెరవేరిన రెండు దశాబ్దాల కల

నెరవేరిన రెండు దశాబ్దాల కల

– గోరుకల్లు జలాశయానికి చేరిన నీరు
– ఎస్సార్‌బీసీకి 900 క్యూసెక్కులు
– రిజర్వాయర్‌కు 6 క్యూసెక్కులు
– 12 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా చూడాలన్న  పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి
 
 
పాణ్యం: ఎట్టకేలకు గోరుకల్లు జలాశయంలోకి శుక్రవారం మొట్టమొదటి సారిగా నీరు చేరింది. ఈ జలాశయానికి 1991లో శంకుస్థాపన చేయగా.. దాదాపుగా రెండు దశబ్దాల పాటు పనులు జరుగుతూనే ఉన్నాయి. పలుమార్లు మంత్రులు, ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా.. పనులు నత్తనడకన సాగుతూ అనుకున్న సమయానికి నీరు ఇవ్వలేక పోయారు. ఈ ప్రాజెక్టు నిండితే 1.92 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. శ్రీశైలం డ్యాంకు వరద నీరు రావడంతో బనకచర్ల నుంచి ఎస్సార్‌బీసీ(శ్రీశైలం రైట్‌బ్యాంక్‌ కెనాల్‌)కు  1500 క్యూస్కెకుల నీరు విడుదల చేస్తున్నారు. ఈ నీటిలో 600 క్యూసెక్కులను శుక్రవారం గోరుకల్లు రిజర్వాయర్‌కు తరలించారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్యెల్యే గౌరు చరితారెడ్డి జలాశయం వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. జలాశయంలోకి వెళ్తున్న నీటిని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ఎన్నో పర్యాయాలు మంత్రికి వినతిపత్రాల ద్వారా విన్నవించామన్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 12 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 5 టీఎంసీలు నిల్వ ఉంచేందుకు సిద్ధం చేసినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎస్సార్‌బీసీ కాలువకు 900 క్యూసెక్కులు నీరు వదులుతున్నామన్నారు. ఎస్సార్బీసీకి అదనంగా 1000 క్యూసెక్కుల నీరు రావాల్సి ఉందన్నారు.  ప్రాజెక్టులో 12 టీఎంసీల నీరు నిల్వ ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించారు.  విశ్రాంత సీఈ చిట్టిబాబు, ఎస్‌ఈ రామచంద్రయ్య, ఈఈలు సుబ్బరాయుడు, రమేష్, డీఈ ఎల్‌పీ రెడ్డితో పాటు అ«ధికారులు పాల్గొన్నారు.
నష్టపరిహారం త్వరగా అందించండి
గోరుకల్లు జలాశయానికి భూములను ఇచ్చినౖ రెతులకు ఇంకా రూ. 7కోట్ల పరిహారం అందాల్సి ఉందని రైతులు..ఎమ్యెల్యే దష్టికి తెచ్చారు. అక్కడే ఉన్న ఎస్‌ఈతో ఆమె మాట్లాడారు. త్వరగా పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. సమస్యను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లనున్నట్లు ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి చెప్పారు. 
గ్రామానికి నీరు విడుదల చేయాలి
తమ గ్రామానికి నీరు విడుదల చేయాలని కొండజుటూరు గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించి ఇబ్బందులను వివరించారు. కాలువకు ఉన్న చిన్న గేట్లను ఎత్తి రైతులను అదుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ పాలం చంద్రశేఖర్‌రెడ్డి, గడివేముల మండల కన్వీనర్‌ సత్యనారాయణరెడ్డి, నాయకులు వెంగళరెడ్డి, ఇమాం, భోగేష్, బాలస్వామి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement