gorukallu
-
ఆదోనిలో ప్రబలిన అతిసారం
ఆదోని/అర్బన్: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని అరుంజ్యోతినగర్‌లో బుధవారం అతిసారం ప్రబలింది. 50 మందికిపైగా అస్వస్థతకు గురికాగా.. ఒక మహిళ రంగమ్మ (50) మృతి చెందింది. బాధితుల్లో 20 మంది పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొందరికి స్థానిక అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్యం చేస్తుండగా మరికొందరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు. బాధితుల్లో పదేళ్లలోపు వయసు కలిగినవారు 8 మంది ఉన్నారు. సమాచారం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తాగునీరు, పారిశుధ్యం మెరుగుదలకు చర్యలు చేపట్టాలని ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డిని ఆదేశించారు. ఆర్డీఓతో పాటు మునిసిపల్ కమిషనర్ ఆర్జీవీ కృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ రంగనాయక్, తహసీల్దారు రామకృష్ణ చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి పంపించినట్లు ఆస్పత్రి చీఫ్ డాక్టర్ లింగన్న వారికి తెలిపారు. అనంతరం ఆర్డీవో తదితరులు అరుంజ్యోతినగర్‌లో పర్యటించి.. ఓవర్ హెడ్ ట్యాంకులు, మురుగుకాలువలను శుభ్రం చేయించారు. వైద్య శిబిరం ఏర్పాటు చేసి మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచారు. తాగునీరు కలుషితం అవడంవల్లే అతిసారం ప్రబలిందని స్థానికులు తెలిపారు. తాగునీటి నమూనాలను పరీక్షలకు పంపినట్లు ఆర్డీవో చెప్పారు. మంగళవారం ఇక్కడ దేవర జరిగిందని, ఫుడ్ పాయిజనింగ్‌కు కూడా అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. గోరుకల్లులో మరొకరు మృతి పాణ్యం: కర్నూలు జిల్లాలోని పాణ్యం మండలం గోరుకల్లు గ్రామంలో అతిసారవ్యాధికి మరొకరు బలయ్యారు. దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. మంగళవారం గ్రామానికి చెందిన ఉప్పరి ఎరబోయిన ఉసేని (65), సుంకరి ఎల్ల కృష్ణ (35) చనిపోగా.. బుధవారం తమ్మడపల్లె మద్దమ్మ (75) నంద్యాల సమీపంలోని శాంతిరాం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. గ్రామంలో బుధవారం నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనాకుమారి, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పర్యటించారు. -
గోరుకల్లు భూములకు రూ.1.55 కోట్ల పరిహారం
కర్నూలు(అర్బన్): గోరుకల్లు రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.55 కోట్ల నష్టపరిహారాన్ని మంజూరు చేసింది. ఈ మేరకు మొదటి విడతగా రూ.1,13,47,466, రెండవ విడతగా రూ.42,30,076 మంజూరు చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
‘ఘోరు’కల్లు
- కుంగుతున్న కరకట్టలు - ఉధృతమవుతున్న లీకేజీలు - దిద్దుబాటు చర్యలు చేపట్టిన ఇంజినీర్లు కర్నూలు సిటీ: కృష్ణా జలాలతో రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన గోరుకల్లు రిజర్వాయర్‌కు లీకేజీల సమస్య పెను ముప్పుగా మారింది. కరకట్టలు కుంగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గాలేరుకు నీరు ఇచ్చేందుకు పనులను ప్యాకేజీలుగా విభజించారు. 24వ ప్యాకేజీ కింద శ్రీశైలం కుడి ప్రధాన కాలువను 44వేల క్యుసెక్కుల నీటి సామర్థ్యంతో విస్తరణ కోసం పనులు చేపట్టారు. పోతిరెడ్డిపాడు నుంచి చేపట్టిన విస్తరణ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. భానకచర్ల నుంచి 25, 26 ప్యాకేజీల కింద విస్తరణ పనులు జరుగుతున్నాయి. గాలేరు–నగరి సుజల స్రవంతిలో ఓసీ–50 ప్యాకేజీ కింద ఎస్ఆర్బీసీ కాల్వ 50.22 కి.మీ దగ్గర గోరుకల్లు రిజర్వాయర్ చేపట్టారు. ఈ రిజర్వాయర్ కోసం 1989లో పీవీ నరసింహారావు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ తరువాత సుమారు 15 ఏళ్ళపాటు ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు. తిరిగి వైఎస్ఆర్ హయాంలో 2005లో పనులు మొదలు పెట్టి పూర్తి చేశారు. లీకేజీకి కారణమెవరు..? గాలేరు–నగరి ప్రధాన కాలువకు నీరు గోరుకల్లు నుంచే వెళ్లాలి. రిజర్వాయర్ కరకట్ట పనుల్లో సున్నపు రాయి కలయికతో ఉన్న మట్టిని వినియోగిం చడం వల్లే› లీకేజీలు అవుతున్నట్లు ఇంజినీరింగ్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. లీకేజీలపై జల వనరుల శాఖ నిపుణులు ఈఎన్సీ, డిజైన్ విభాగం సీఈ, హైడ్రాలిస్టులతో సైతం తనిఖీలు చేయించారు. వారికి కూడా లీకేజీలపై అంతుపట్టక పోవడంతో రిజర్వాయర్ కరకట్టలకు లోడెడ్ బర్మ్‌కు నిపుణుల కమిటీ సూచించింది. ఈ మేరకు 45 కోట్లతో అంచనాలు వేసి ప్రభుత్వానికి పంపించారు. లీకేజీల వల్ల 2 టీఎంసీల నీరు కూడా నింపలేక పోయారు. కరకట్టల కింద భాగాన వస్తున్న లీకేజీల వల్ల ఈ నెల 23వ తేదీన రిజర్వాయర్ వెనుకటి భాగంలో రాక్టో డ్రైన్ కుంగిపోయింది. దీనిపై కొందరు గోరుకల్లు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి బివై.రామయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డిలు రిజర్వాయర్‌ను పరిశీలించారు. సీఈ నారాయణరెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఎలాంటి ప్రమాదం లేదు. –సుబ్బరాయుడు, ఈఈ ఎస్ఆర్బీసీ గోరుకలు రిజర్వాయర్ నుంచి గతంలో నుంచి కొంత నీరు లీకేజీలు అవుతున్నాయి. కొత్తది కాబట్టీ లీకేజీలు రావడం సహజం. గత నెలల కురిసిన వర్షాపు నీరు కరకట్ట మీది నుంచి కింద రావడంతో రాక్టోడ్రైన్ కుంగింది. అయితే ఎలాంటి ప్రమాదం లేదు. దీనిపై సీఈ ద్వారా ప్రభుత్వానికి నివేదిక అందజేశాం. కుంగిన చోట పనులు చేపట్టాం. -
ఊరంతా ఊట నీరే
- గోరుకల్లు గ్రామస్తుల ఆవేదన - పునరావాసం కోసం డిమాండ్ - తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయింపు - అడుగడుగునా పోలీస్ పహారా పాణ్యం : ‘రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేసింది మొదలు గ్రామంలో ఎటు చూసినా ఊటనీరు బయటకు వస్తోంది. కట్ట నుంచి నీరు లీకేజీ అవుతోంది. ఇంటి గోడలు నెమ్మెక్కి పేక మేడల్లా కూలిపోతున్నాయి. రెండు నెలలుగా ఈ పరిస్థితి ఉంది. ఇప్పటికే 20 ఇళ్లు కూలిపోయాయి. మరి కొన్నింటి గోడలు చీలికలు ఇచ్చి కుంగిపోతున్నాయి. ఎక్కడ చూసినా దుర్వాసన భరించలేకపోతున్నాం. సమస్య పరిష్కరించాలని కోరుతూ నాలుగు రోజులుగా నిరాహార దీక్షలు చేపట్టినా అధికారుల్లో స్పందన లేదు’ అంటూ మండల పరిధిలోని గోరుకల్లు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఇంటికి ఒకరు చొప్పున కదిలి రోడ్డెక్కారు. తొమ్మిది కిలోమీటర్ల మేర పాదయాత్రగా వచ్చిన సుమారు 500 మంది గ్రామస్తులు పాణ్యం తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించారు. సర్వం కొల్పోయిన గ్రామస్తులు గోరుకల్లు రిజర్వాయర్ కోసం గ్రామస్తుల నుంచి 2వేల ఎకరాల భూములను సేకరించిన అధికారులు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదు. ఇప్పటికే గ్రామానికి రెండు సార్లు వచ్చిన సీఎం చంద్రబాబు నెల రోజుల్లో పరిహారం అందిస్తామని ప్రకటనలు గుప్పించినా ఇప్పటి వరకు ఆ పరిస్థితి లేదు. గ్రామంలో 400పైగా ఇళ్లుండగా 3వేల వరకు జనాభా ఉంది. ఉన్న ఇళ్లు ఊటల దెబ్బకు కూలీపోతున్నాయి. ఊట నీరు ఇళ్లలో చేరి ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గతంలో లీక్ వ్యవహారంపై ప్రభుత్వం ఎక్స్పర్ట్ కమిటీనీ ఏర్పాటు చేసినా అందుకు సంబంధించిన విషయాలు గోప్యంగా ఉంచారు. రిజర్వాయర్ కట్ట నుంచి లీకేజీలను ఆపేందుకు రూ.45 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపిన అధికారులు ఆ ఊటలు మాత్రం రిజర్వాయర్‌కు చెందినవి కాదని చెబుతుండడం గమనార్హం. భారీగా పోలీసుల మోహరింపు.. గ్రామంలో నీటి ఊటల సమస్యపై గ్రామస్తులు ఆందోళన ప్రారంభించడం, విషయాన్ని ముందే తెలుసుకున్న పోలీసులు వారు హైవేపైకి రాకుండా కొండజుటూరు రోడ్డు వద్ద సిబ్బందిని మోహరించారు. ఐదురుగురు ఎస్ఐలు, 70మంది పోలీస్, స్పెషల్ పార్టీ సిబ్బంది బందోబస్తు చేపట్టారు. బారీకేడ్లను ఏర్పాటు చేసి గ్రామస్తులను దొంగు రస్తా మీదుగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు పంపించారు. కార్యాలయం వద్దకు చేరుకున్న గ్రామస్తులు ఒక్క సారిగా కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.పోలీస్‌లు తలుపులను మూయడంతో అక్కడే బఠాయించి నిరసన చేపట్టారు.సీపీఎం నాయకులు ఓబులపతి, ప్రభాకర్‌రెడ్డి , రామకృష్ణ, భాస్కర్, అలివేలు, ఉసేన్ గ్రామస్తులకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నారు. తహసీల్దార్ చంద్రావతికి వినతిపత్రం అందించారు. పరిహారం, పునరావాసానికి డిమాండ్.. కూలిపోయిన ఇళ్లు, కోల్పోయిన భూములను తక్షణమే పరిహారం ఇప్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సురక్షిత ప్రాంతంలో పునరావాసం కల్పించాలని కోరారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజి వర్తింపజేయాలని, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని కోరారు. గతంలో ఇందుకు మంత్రి హామీ ఇచ్చారని, అయితే ఇప్పటి వరకు అతీగతీ లేదని గ్రామస్తులు తెలిపారు. పదిరోజులు గడువు ఇవ్వండి.. చంద్రావతి, తహసీల్దార్ గ్రామస్తుల సమస్యపై ఇప్పటికే రెండుసార్లు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాం. ఆర్డీఓ సుధాకర్‌రెడ్డితో పాటు ప్రత్యేకంగా నాలుగు సార్లు గ్రామంలో పర్యటించాం. కూలిపోయిన ప్రతి ఇంటిని నమోదు చేసి ప్రభుత్వానికి పంపించాం. మరో పదిరోజులు సమయమిస్తే మా పరిధిలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. త్రిసభ్య కమిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం కలెక్టర్‌కు ఆదేశాలించ్చింది. ఆయన కమిటీని నియమిస్తే అందులో సభ్యులుగా ఉన్న ఇంజనీర్లు , రెవెన్యూ అ«ధికారులు త్వరలోనే గ్రామంలో పర్యటించి సమస్యకు కారణాలు తెలుసుకుంటారు. పరిష్కారంపై సూచనలు చేస్తారు. -
గోరుకల్లు కట్ట పరిశీలన
– లీకేజీలను పరిశీలించిన ఎక్స్‌ఫర్ట్ కమిటీ సభ్యులు – రిజర్వాయర్‌ను సందర్శించిన ఎక్స్పర్ట్ కమిటీ – సాయంత్రం వరకు పరిశీలన – నిర్మాణలోపాలపై ఆరా పాణ్యం: గోరుకల్లు రిజర్వాయర్ కట్టకు లీకేజీలు ఏర్పడి నీరు బయటకు పారుతుండడంతో శనివారం ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులు వచ్చి పరిశీలించారు. ప్రస్తుతం జలాశయంలో 1.94 టీఎంసీల నీరు నిల్వ ఉండగా కట్టకు నాలుగు చోట్ల నీటి ఊటలు బయటకు వస్తున్నాయి. అవుటర్ రెగ్యులేటర్ వద్ద రాతి కట్ట నుంచి రెండించుల నీరు లీకవుతోంది. సమీపంలోనే రెండు ఆయిల్ ఇంజిన్ల మేర నీరు బయటకు పోతోంది. దీన్ని దష్టిలో ఉంచుకుని విశ్రాంత ఇంజినీర్లు సుబ్బారావు, రైతు సత్యనారాయణ, సీఈ సీడీఓ గిరిధర్‌రెడ్డి, సీఈ నారాయణరెడ్డి, ఈఈ సుబ్బారాయుడుతో కూడిన ఎక్స్పర్ట్ కమిటీ శనివారం జలాశయాన్ని సందర్శించింది. లీకేజీ నీటిని బయటకు పంపేందుకు ప్రత్యేకంగా కాల్వ తీయించారు. కాంక్రీట్ పనులు, గుర్రాల వాగు వద్ద కట్టకు నీరు లీక్ అవుతున్నట్లు గుర్తించారు. రెండు పాయింట్ల వద్ద కట్టపై టెస్టింగ్ కోసం ప్రత్యేకంగా డ్రిల్లింగ్ చేయించారు. కట్ట కింది భాగంలో మట్టి బురదగా ఉండడంతో డ్రిల్లింగ్కు ఆటంకం ఏర్పడింది. అలాగే అవుట్ రెగ్యూలేటర్ వద్ద కట్ట నుంచి రాళ్లను తొలగించి పరిశీలించారు. హెలిప్యాడ్ పాయిండ్ వద్ద ప్రత్యేకంగా ప్రొక్లెయిన్‌తో గుంత తవ్వించగా మూడు అడుగుల లోతులోనే నీరు పడడంతో కమిటీ సభ్యులు ఆలోచనలో పడ్డారు. జలాశయానికి పూనాది వేసిన ఇంజినీర్లను రప్పించే చర్యలు చేపట్టారు. నిర్మాణంలో లోటుపాట్లపై కంపెనీ ప్రతినిధులను ఆరా తీస్తున్నారు. విషయాన్ని తేల్చేందుకు రెండు, మూడు రోజుల సమయం పడుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. పంపింగ్ నిలిపివేత.. ప్రస్తుతం 14.5 మీటర్ల వద్ద జలాశయంలో 1.94 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. 234.4 అడుగుల మేర నీరు వచ్చినట్లు చెబుతున్నారు. కట్టకు సంబంధించి నేల నుంచి దిగువకు 180అడుగుల లోతులో పునాదులు వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం కట్టకు ఏర్పడిన లీకేజీలను దష్టిలో ఉంచుకుని జలాశయంలోకి పంపింగ్ ప్రక్రియను నిలిపివేశారు. ఎస్సాఆర్బీసీ ప్రధాన కాల్వ నుంచి నీటిని దిగువకు వదుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 5 నుంచి 7 టీఎంసీల నీటిని నిల్వ ఉంచాల్సి ఉన్నా ప్రస్తుత పరిస్థితి దష్ట్యా అందుకు సాధ్యం కాదని అధికారులు తెలిపారు. సాయంత్రం వరకు అక్కడే ఉండి కట్ట పరిస్థితిని పరిశీలించారు. -
నెరవేరిన రెండు దశాబ్దాల కల
– గోరుకల్లు జలాశయానికి చేరిన నీరు – ఎస్సార్బీసీకి 900 క్యూసెక్కులు – రిజర్వాయర్‌కు 6 క్యూసెక్కులు – 12 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా చూడాలన్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి పాణ్యం: ఎట్టకేలకు గోరుకల్లు జలాశయంలోకి శుక్రవారం మొట్టమొదటి సారిగా నీరు చేరింది. ఈ జలాశయానికి 1991లో శంకుస్థాపన చేయగా.. దాదాపుగా రెండు దశబ్దాల పాటు పనులు జరుగుతూనే ఉన్నాయి. పలుమార్లు మంత్రులు, ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా.. పనులు నత్తనడకన సాగుతూ అనుకున్న సమయానికి నీరు ఇవ్వలేక పోయారు. ఈ ప్రాజెక్టు నిండితే 1.92 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. శ్రీశైలం డ్యాంకు వరద నీరు రావడంతో బనకచర్ల నుంచి ఎస్సార్బీసీ(శ్రీశైలం రైట్‌బ్యాంక్ కెనాల్)కు 1500 క్యూస్కెకుల నీరు విడుదల చేస్తున్నారు. ఈ నీటిలో 600 క్యూసెక్కులను శుక్రవారం గోరుకల్లు రిజర్వాయర్‌కు తరలించారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్యెల్యే గౌరు చరితారెడ్డి జలాశయం వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. జలాశయంలోకి వెళ్తున్న నీటిని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ఎన్నో పర్యాయాలు మంత్రికి వినతిపత్రాల ద్వారా విన్నవించామన్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 12 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 5 టీఎంసీలు నిల్వ ఉంచేందుకు సిద్ధం చేసినట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎస్సార్బీసీ కాలువకు 900 క్యూసెక్కులు నీరు వదులుతున్నామన్నారు. ఎస్సార్బీసీకి అదనంగా 1000 క్యూసెక్కుల నీరు రావాల్సి ఉందన్నారు. ప్రాజెక్టులో 12 టీఎంసీల నీరు నిల్వ ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. విశ్రాంత సీఈ చిట్టిబాబు, ఎస్ఈ రామచంద్రయ్య, ఈఈలు సుబ్బరాయుడు, రమేష్, డీఈ ఎల్పీ రెడ్డితో పాటు అ«ధికారులు పాల్గొన్నారు. నష్టపరిహారం త్వరగా అందించండి గోరుకల్లు జలాశయానికి భూములను ఇచ్చినౖ రెతులకు ఇంకా రూ. 7కోట్ల పరిహారం అందాల్సి ఉందని రైతులు..ఎమ్యెల్యే దష్టికి తెచ్చారు. అక్కడే ఉన్న ఎస్ఈతో ఆమె మాట్లాడారు. త్వరగా పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. సమస్యను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లనున్నట్లు ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి చెప్పారు. గ్రామానికి నీరు విడుదల చేయాలి తమ గ్రామానికి నీరు విడుదల చేయాలని కొండజుటూరు గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించి ఇబ్బందులను వివరించారు. కాలువకు ఉన్న చిన్న గేట్లను ఎత్తి రైతులను అదుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పాలం చంద్రశేఖర్‌రెడ్డి, గడివేముల మండల కన్వీనర్ సత్యనారాయణరెడ్డి, నాయకులు వెంగళరెడ్డి, ఇమాం, భోగేష్, బాలస్వామి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.