Published
Sun, Jan 29 2017 10:38 PM
| Last Updated on Tue, Sep 5 2017 2:25 AM
నీటి విడుదల నిలిపివేత
అవుకు: స్థానిక రిజర్వాయర్ నుంచి వైఎస్సార్ కడప జిల్లాకు వెళుతున్న నీటిని ఆదివారం నిలిపివేశారు. గతేడాది నవంబర్ నుంచి మూడు నెలల పాటు నీటిని వదలినిట్లు ఎస్సార్బీసీ ఈఈ పాపారావు తెలిపారు. శ్రీశైలం నుంచి నీటి విడుదల వేయడంతో ప్రస్తుతం గోరుకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్‌కు 700 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉందన్నారు. సంగపట్నం ప్రధాన కాలువకు 200 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో ఉందని తెలపారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 1.80 టీంఎసీల నీరు నిల్వ ఉందని ఈఈ పేర్కొన్నారు. వారం రోజుల్లో గోరకుల్లు నుంచి నీటి విడుదల నిలిపివేస్తారని తెలిపారు.