ఎస్‌ఆర్‌బీసీలో గుర్తు తెలియని మృతదేహం
రవ్వల కొండ సమీపంలోని ఎస్‌ఆర్‌బీసీ ప్రధాన కాలువలో గుర్తు తెలియని మృతదేహం బుధవారం కనిపించింది.
బనగానపల్లె రూరల్: రవ్వల కొండ సమీపంలోని ఎస్‌ఆర్‌బీసీ ప్రధాన కాలువలో గుర్తు తెలియని మృతదేహం బుధవారం కనిపించింది. నీటి ప్రవహంలో కొట్టుకొచ్చి ముళ్లకంపల వద్ద అగింది. మృతిని వయసు 35–40 సంవత్సరాలు ఉంటుంది. నలుపు రంగు ప్యాంట్, తెలుపు, నలుపు, బిస్కెట్ రంగు కలిగిన చొక్కొతో పాటు బనియన్ ధరించి ఉన్నాడు. రెండు మూడు రోజుల క్రితమే మృతి చెంది ఉంటారన్నారన అనుమానం పోలీసులు వ్యక్తం చేశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని బనగానపల్లె ఎస్‌ఐ సీఎం రాకేష్ తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.