
హైదరాబాద్: ఏపీలో దుకాణం బంద్ అవుతుందని గ్రహించిన చంద్రబాబు తెలంగాణలో ఫోకస్ పెడుతున్నాడని, తెలంగాణ ప్రజలు ఆయన్ను నమ్మరని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హెచ్‌ఏ రెహ్మాన్ అన్నారు. గురువారం ఆయనిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఆంధ్రాలో ఏమి అభివృద్ధి చేశాడని.. తెలంగాణలో ఏం చేద్దామని వస్తున్నాడని ప్రశ్నించారు.
ఉమ్మడి రాష్ట్రంలో గోరంత అభివృద్ధికి కొండంత చూపించుకునే బాబు.. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని పదే పదే చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. హైటెక్ సిటీ నిర్మిస్తే అదే అభివృద్ధా అని మండిపడ్డారు. బాబుతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకోవడం ఆ పార్టీకే నష్టమన్నారు. కాంగ్రెస్ ఒంటరిగా పోటీచేస్తే విజయం వైపు ఉండేదని అభిప్రాయ పడ్డారు.