సాక్షి, విజయవాడ: టీడీపీ నేత, రౌడీషీటర్ రెహమాన్ అరెస్ట్ అయ్యాడు. అయితే, ల్యాండ్ సెటిల్‌మెంట్ విషయంలో బెదిరింపులకు పాల్పడిన రెహమాన్‌తో పాటు మరో రౌడీ షీటర్ రాజాను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
వివరాల ప్రకారం.. టీడీపీ నేత రెహమాన్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కాగా, గతంలోనే రెహమాన్, రాజాపై పోలీసులు రౌడీ షీట్స్ ఓపెన్ చేశారు. ఇక, పెనమలూరు నియోజకవర్గ టీడీపీలో రెహమాన్ కీలకంగా ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌తో రెహమాన్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. మరోవైపు.. ఇటీవల నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో కూడా రెహమాన్ యాక్టివ్‌గా పనిచేశారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల పుంగనూరులో ఎల్లో బ్యాచ్ రౌడీమూకలు దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి(చల్లా బాబు) సహా 67 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ కేసులో నిందితులకు పుంగనూరు కోర్టు రిమాండ్ విధించింది. పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డితో పాటు.. 66 మంది నిందితులను కోర్టు ఆదేశాలతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. భారీ బందోబస్తు మధ్య నిందితులను రిమాండ్‌కు తరలించారు.
ఇది కూడా చదవండి: జనసేన నేతపై చీటింగ్ కేసు
Comments
Please login to add a commentAdd a comment