ఎస్సై సహజీవనం చేయడంతో పాటు హత్యాయత్నం చేశాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది.
గుంటూరు: ఐదేళ్లుగా తనతో సహజీవనం చేస్తున్న ఎస్సై వదిలించుకునేందుకు హత్యాయత్నం చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
అడిగొప్పులకు చెందిన సదరు మహిళ తన భర్త వేధిస్తున్నాడంటూ దుర్గి ఎస్సై కృష్ణయ్యను ఆశ్రయించింది. అయితే, ఆమెపై కన్నేసిన ఎస్సై...భర్తను వదిలేస్తే తాను చూసుకుంటానని నమ్మబలికాడు. అతడి మాటలను నమ్మిన మహిళ.. గత ఐదేళ్లుగా ఎస్సైతో సహజీవనం చేస్తోంది. ప్రస్తుతం తాడికొండ ఎస్సైగా ఉన్న కృష్ణయ్య ఆమెను వదిలించుకునేందుకు ఇటీవల చంపేందుకు యత్నించాడంటూ శనివారం బాధితురాలు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు.