
వాట్సాప్‌లో హల్‌చల్ చేస్తున్న వీడియో (ఇన్‌సెట్‌లో ఆర్తీ)
అన్నానగర్: కోవై సమీపంలో కదులుతున్నకారు నుండి భార్యని తోసివేసి హత్య చేయటానికి యత్నించిన భర్త వీడియో వాట్సాప్‌లో హల్‌చల్ చేస్తోంది. కోవై సమీపంలోని తుడియలూరు తొప్పంపట్టి గణపతి గార్డెన్ ప్రాంతానికి చెందిన ఆర్తీ(38). ఆమె భర్త అరుణ్‌జో అమల్‌రాజ్ ఒక ప్రైవేటు ఉద్యోగి. వీరికి 2008లో వివాహం జరిగి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అనంతరం భార్యభర్తల మధ్య అభిప్రాయబేధాలు ఏర్పడి 2014వ సంవత్సరంలో ఆర్తి పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. అనంతరం అరుణ్‌జో అమల్‌రాజ్ భార్యతో రాజీపడి భార్య, పిల్లలను ఇంటికి పిలుచుకుని వచ్చాడు. తర్వాత వారు కుటుంబంతో గత మే నెల 9వ తేదీ ఊటీ పర్యటనకు కారులో బయలుదేరారు. అప్పుడు దంపతుల మధ్య హఠాత్తుగా వాగ్వాదం ఏర్పడింది. దీంతో ఆవేశంలో అరుణ్‌జో అమల్‌రాజ్ ఆర్తీని కారు నుంచి తోసివేసి హత్య చేయటానికి ప్రయత్నించాడు. ఈ వీడియో వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. సంఘటన గురించి తుడియలూరు పోలీసుస్టేషన్‌లో ఆర్తీ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment