ఫ్లెక్సీ వివాదానికి హత్యాయత్నం కేసా | court tells police to change section on ex mla in flexi banner issue | Sakshi
Sakshi News home page

ఫ్లెక్సీ వివాదానికి హత్యాయత్నం కేసా

Published Sat, Oct 22 2016 3:22 PM | Last Updated on Thu, Jul 11 2019 8:35 PM

ఫ్లెక్సీ వివాదానికి హత్యాయత్నం కేసా - Sakshi

ఫ్లెక్సీ వివాదానికి హత్యాయత్నం కేసా

ఫ్లెక్సీల వివాదంలో తాడేపల్లిగూడెం పోలీసులు చూపిన అత్యుత్సాహంపై కోర్టు మొట్టికాయలు వేసింది.

ఫ్లెక్సీల వివాదంలో తాడేపల్లిగూడెం పోలీసులు చూపిన అత్యుత్సాహంపై కోర్టు మొట్టికాయలు వేసింది. ఈనెల 19వ తేదీ మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్‌సీపీ నాయకుడు కొట్టు సత్యనారాయణ పుట్టినరోజు. ఆ సందర్భంగా కొందరు అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేయగా, స్థానిక మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఆయన అనుచరులు వాటిని తీయించేశారు. ఆ సందర్భంగా జరిగిన చిన్నపాటి గొడవపై పోలీసులు కేసు నమోదుచేశారు. 
 
కొట్టుపై సెక్షన్ 307 (హత్యాయత్నం) కేసు నమోదుచేసి ఆయనను అరెస్టుచేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. చిన్నపాటి ఫ్లెక్సీ వివాదానికి 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన వైనాన్ని కొట్టు సత్యనారాయణ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో పోలీసుల తీరును తప్పుబట్టిన కోర్టు.. సెక్షన్ 307ను 324గా మార్చాలని ఆదేశించింది. న్యాయమూర్తి ఆదేశాలతో సెక్షన్ 307ను 324గా పోలీసులు మార్చారు. అనంతరం కొట్టు సత్యనారాయణకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement