
'నవాజ్ షరీఫ్ పై హత్యాయత్నం కేసు పెడతా'
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని తెహ్రీకే ఇన్సాఫ్ నేత ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేశారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని తెహ్రీకే ఇన్సాఫ్ నేత ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేశారు. అమాయకుల ప్రాణాలు పోవడానికి కారకుడైన నవాజ్ షరీఫ్ పై హత్యాతయ్నం కేసు పెట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. అమాయ ప్రజలపై పోలీసుల చర్యను ఆయన ఖండించారు. నవాజ్ షరీఫ్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.
శనివారం రాత్రి ఆందోళనకారులు నవాజ్ షరీఫ్ ఇంటి ముట్టడికి యత్నించడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో పాటు లాఠీచార్జి, కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో నిరసనలో పాల్గొంటున్న ఓ మహిళ మరణించింది. అనేక మంది గాయపడ్డారు.