ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పారీ్టకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడం తెలిసిందే. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పీఎంఎల్ (ఎన్) 75 సీట్లతో ఏకైక అతిపెద్ద పారీ్టగా నిలిచింది. బిలావల్ భుట్టో సారథ్యంలోని పీపీపీకి 54, ముత్తాహిదా ఖ్వామి మూవ్‌మెంట్ పాకిస్తాన్ (ఎంక్యూఎం–పీ)కి 17, ఇతరులకు 12 సీట్లొచ్చాయి.
101 స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు గెలిచారు. ప్రభుత్వ ఏర్పాటు యత్నాల్లో నవాజ్ ముందంజలో ఉన్నారు.ఇతర పార్టీలతో చర్చల బాధ్యతను సోదరుడు షహబాజ్ షరీఫ్‌కు అప్పగించారు. ఆయన ఆదివారం ఎంక్యూఎం–పీతో ఆదివారం చర్చలు జరిపారు. అనంతరం కలిసి పని చేయాలని అంగీకారానికి వచి్చనట్లు సమాచారం. నవాజ్ షరీఫ్ పార్టీతోనే తమకు పొత్తు సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నామని ఎంక్యూఎం–పీ నాయకుడు హైదర్ రిజ్వీ చెప్పారు.
పీపీపీ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీతో కూడా షెహబాజ్ షరీఫ్ ఇప్పటికే చర్చలు జరిపారు. కానీ ప్రధానమంత్రి పదవిని తన కుమారుడు బిలావల్ భుట్టోకే కట్టబెట్టాలని జర్దారీ షరత్ విధించారు. అందుకు పీఎంఎల్–ఎన్ అంగీకరించడం లేదు. పాకిస్తాన్‌లో పారీ్టల మధ్య పొత్తులు, ప్రభుత్వ ఏర్పాటుపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. నవాజ్ షరీఫ్‌కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ కూడా మద్దతు పలుకుతున్నారు. పాక్ జాతీయ అసెంబ్లీలో 266 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అభ్యర్థి మరణంతో ఒక చోట పోలింగ్ వాయిదా పడింది. రిగ్గింగ్ ఆరోపణలతో కొన్ని స్థానాల్లో తుది ఫలితాలను ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 133 సీట్లు అవసరం.
సత్తా చాటిన ఇమ్రాన్ మద్దతుదారులు
అవినీతి ఆరోపణలతో జైలుపాలైనా పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ఈ ఎన్నికల్లో సత్తా చాటారు. ఆయన పార్టీ అధికారికంగా పోటీలో లేదు. దాంతో ఆయన మద్దతుదారులు స్వతంత్ర అభ్యర్థులుగానే పోటీ చేశారు. వారికి ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తు కూడా కేటాయించలేదు. అయినా జాతీయ అసెంబ్లీలో ఏకంగా 101 స్థానాలను గెలుచుకుని సత్తా చాటారు. ఈ ఫలితాలు తమకు నైతిక విజయమంటూ ఇమ్రాన్ జైలునుంచే ప్రకటన విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment