Formation of government
-
సీఎం అభ్యర్థి, కేబినెట్ పదవులపై చర్చ
-
రెండో రోజూ మార్కెట్ ర్యాలీ
ముంబై: అనిశి్చతికి తెరదించుతూ మూడోసారి బీజేపీ కూటమి అధికారాన్ని చేపట్టనుండటంతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల దౌడు తీశాయి. సెన్సెక్స్ 692 పాయింట్లు జంప్‌చేసింది. 75,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి 75,075 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 201 పాయింట్లు ఎగసి 22,821 వద్ద నిలిచింది. తొలుత ఒక దశలో గరిష్టంగా సెన్సెక్స్ 75,298కు చేరగా.. నిఫ్టీ 22,910ను తాకింది. వెరసి సెన్సెక్స్ 915 పాయింట్లు, నిఫ్టీ 290 పాయింట్లు చొప్పున దూసుకెళ్లాయి. దీంతో బీజేపీకి మెజారిటీ లభించకపోవడంతో మంగళవారం నమోదైన రూ. 31 లక్షల కోట్ల మార్కెట్ విలువ నష్టంలో చాలావరకూ రికవరైంది. గత రెండు రోజుల్లో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 21 లక్షల కోట్లకుపైగా బలపడింది. ఫలి తంగా బీఎస్ఈ మార్కెట్ క్యాప్ దాదాపు రూ. 416 లక్షల కోట్లకు(4.98 ట్రిలియన్ డాలర్లు) చేరింది. నేటి ఆర్బీఐ పాలసీ నిర్ణయాలపై దృష్టినేడు(శుక్రవారం) ఆర్బీఐ పాలసీ సమీక్ష నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో ఇకపై ఇన్వెస్టర్ల దృష్టి వడ్డీ రేట్లవైపు మళ్లనున్నట్లు మార్కెట్ నిపుణులు వివరించారు. కాగా.. రియలీ్ట, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్స్, ఐటీ, ఆయిల్, మెటల్ రంగాలు 5–1.5 శాతం మధ్య లాభపడ్డాయి. మరోవైపు హిందాల్కో, హీరోమోటో కార్ప్, ఏషియన్ పెయింట్స్, ఎంఅండ్ఎం, నెస్లే, ఇండస్ఇండ్, సిప్లా, బ్రిటానియా 2.4–1% మధ్య నీరసించాయి.కాగా, బీఎస్ఈలో ట్రేడైన షేర్లలో 2,981 లాభపడితే.. కేవలం 878 నష్టపోయాయి. నగదు విభాగంలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మరోసారి అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చారు. రూ. 6,868 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. దేశీ ఫండ్స్ మాత్రం రూ. 3,718 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. గత 2 రోజుల్లో ఎఫ్‌పీఐలు రూ. 18,000 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసు కున్నారు.బీహెచ్ఈఎల్ 9% జంప్ అదానీ పవర్ రూ. 3,500 కోట్ల భారీ ఆర్డర్ నేపథ్యంలో బీహెచ్ఈఎల్ షేరు తాజాగా 9 శాతం జంప్‌చేసింది. రూ. 278 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 15% దూసుకెళ్లి రూ. 292ను అధిగమించింది. మార్కెట్ విలువ రూ. 7,974 కోట్లు బలపడి రూ. 96,854 కోట్లకు చేరింది. అదానీ షేర్లు జూమ్ వరుసగా రెండో రోజు అదానీ గ్రూప్ కౌంటర్లకు డిమాండ్ నెలకొంది. గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీలలో అదానీ పోర్ట్స్ స్వల్ప వెనకడుగు వేయగా.. ఎనర్జీ సొల్యూషన్స్, టోటల్ గ్యాస్, ఎన్డీటీవీ, పవర్, విల్మర్, ఏసీసీ, ఎంటర్ప్రైజెస్, గ్రీన్ ఎనర్జీ, అంబుజా 5– 2 శాతం మధ్య ఎగశాయి. గ్రూప్ మార్కెట్ విలువ రూ. 17 లక్షల కోట్లను అధి గమించింది. -
Pakistan Elections 2024: సంకీర్ణం దిశగానే పాక్...
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏ పారీ్టకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడం తెలిసిందే. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సారథ్యంలోని పీఎంఎల్ (ఎన్) 75 సీట్లతో ఏకైక అతిపెద్ద పారీ్టగా నిలిచింది. బిలావల్ భుట్టో సారథ్యంలోని పీపీపీకి 54, ముత్తాహిదా ఖ్వామి మూవ్మెంట్ పాకిస్తాన్ (ఎంక్యూఎం–పీ)కి 17, ఇతరులకు 12 సీట్లొచ్చాయి. 101 స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు గెలిచారు. ప్రభుత్వ ఏర్పాటు యత్నాల్లో నవాజ్ ముందంజలో ఉన్నారు.ఇతర పార్టీలతో చర్చల బాధ్యతను సోదరుడు షహబాజ్ షరీఫ్‌కు అప్పగించారు. ఆయన ఆదివారం ఎంక్యూఎం–పీతో ఆదివారం చర్చలు జరిపారు. అనంతరం కలిసి పని చేయాలని అంగీకారానికి వచి్చనట్లు సమాచారం. నవాజ్ షరీఫ్ పార్టీతోనే తమకు పొత్తు సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నామని ఎంక్యూఎం–పీ నాయకుడు హైదర్ రిజ్వీ చెప్పారు. పీపీపీ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీతో కూడా షెహబాజ్ షరీఫ్ ఇప్పటికే చర్చలు జరిపారు. కానీ ప్రధానమంత్రి పదవిని తన కుమారుడు బిలావల్ భుట్టోకే కట్టబెట్టాలని జర్దారీ షరత్ విధించారు. అందుకు పీఎంఎల్–ఎన్ అంగీకరించడం లేదు. పాకిస్తాన్లో పారీ్టల మధ్య పొత్తులు, ప్రభుత్వ ఏర్పాటుపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. నవాజ్ షరీఫ్‌కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ కూడా మద్దతు పలుకుతున్నారు. పాక్ జాతీయ అసెంబ్లీలో 266 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అభ్యర్థి మరణంతో ఒక చోట పోలింగ్ వాయిదా పడింది. రిగ్గింగ్ ఆరోపణలతో కొన్ని స్థానాల్లో తుది ఫలితాలను ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 133 సీట్లు అవసరం. సత్తా చాటిన ఇమ్రాన్ మద్దతుదారులు అవినీతి ఆరోపణలతో జైలుపాలైనా పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ఈ ఎన్నికల్లో సత్తా చాటారు. ఆయన పార్టీ అధికారికంగా పోటీలో లేదు. దాంతో ఆయన మద్దతుదారులు స్వతంత్ర అభ్యర్థులుగానే పోటీ చేశారు. వారికి ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తు కూడా కేటాయించలేదు. అయినా జాతీయ అసెంబ్లీలో ఏకంగా 101 స్థానాలను గెలుచుకుని సత్తా చాటారు. ఈ ఫలితాలు తమకు నైతిక విజయమంటూ ఇమ్రాన్ జైలునుంచే ప్రకటన విడుదల చేశారు. -
జార్ఖండ్‌లో ఉత్కంఠకు తెర
రాంచీ: జార్ఖండ్‌లో ఉత్కంఠకు తెరపడింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేసి 24 గంటలు గడిచిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని జేఎంఎం శాసనసభాపక్ష నేత చంపయ్ సోరెన్‌ను జార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ గురువారం రాత్రి ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీలో 10 రోజుల్లోగా బలనిరూపణ చేసుకోవాలని ఆదేశించారు. జార్ఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా చంపయ్ సోరెన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై తొలుత సందిగ్ధత నెలకొంది. గవర్నర్ నుంచి పిలుపు రాకపోవడంతో జేఎంఎం–కాంగ్రెస్–ఆర్జేడీ కూటమి నేతలు ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చంపయ్ సోరెన్ మరోసారి స్పష్టం చేశారు. ఆయన గురువారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్‌ను కలిశారు. తమకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహా్వనించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన వెంట జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) ఎమ్మెల్యేలు ఉన్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం చంపయ్ సోరెన్ మీడియాతో మాట్లాడారు. కొత్త ప్రభుత్వాన్ని కొలువుదీర్చే విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ చెప్పారని వెల్లడించారు. గవర్నర్‌ను చంపయ్ సోరెన్ కలవడానికి కంటే ముందు జేఎంఎం–కాంగ్రెస్–ఆర్జేడీ కూటమి ఓ వీడియోను విడుదల చేసింది. చంపయ్‌కి మద్దతిస్తున్న 43 మంది ఎమ్మెల్యేలు ఈ వీడియోలో కనిపించారు. మరోవైపు, బీజేపీ బారి నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంపై దృష్టి పెట్టారు. 43 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పాలిత తెలంగాణ రాజధాని హైదరబాద్‌కు గురువారం రెండు ప్రత్యేక విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. వారిని గచ్చిబౌలీలోని ఎల్లా హోటల్‌కు చేర్చాలని నిర్ణయించారు. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా చివరి నిమిషంలో రాంచీ నుంచి ప్రత్యేక విమానాల టేకాఫ్‌కు ఎయిర్‌పోర్టు అధికారుల నుంచి అనుమతి లభించలేదు. రెండు గంటలపాటు విమానాల్లోనే కూర్చుండిపోయిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు చేసేది లేక సర్క్యూట్ హౌజ్‌కు తిరిగివచ్చారు. వీరిలో హేమంత్ సోరెన్ సోదరుడు, ఎమ్మెల్యే బసంత్ సోరెన్ కూడా ఉన్నారు. నూతన ప్రభుత్వ ఏర్పాటులకు ఎట్టకేలకు గవర్నర్ నుంచి ఆహా్వనం రావడంతో ఊహాగానాలకు తెరపడింది. రాంచీ జైలుకు హేమంత్ సోరెన్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను అధికారులు రాంచీలోని హొత్వార్ జైలుకు తరలించారు. ఈడీ అధికారులు ఆయనను బుధవారం 7 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గురువారం రాంచీలోని ‘ప్రత్యేక మనీ లాండరింగ్ నిరోధక చట్టం కోర్టు’లో సోరెన్‌ను ప్రవేశపెట్టారు. తదుపరి విచారణ నిమిత్తం 10 రోజులపాటు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. రాంచీలో 8.5 ఎకరాల భూములు అక్రమంగా సోరెన్ ఆ«దీనంలో ఉన్నాయని, అందుకే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దర్యాప్తు ప్రారంభించామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై న్యాయస్థానం తమ తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేసింది. సోరెన్‌ను ఒకరోజుపాటు జ్యుడీíÙయల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో అధికారులు ఆయనను జైలుకు తరలించారు. గురువారం రాత్రంతా సోరెన్ జైలులో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకోర్టులో సోరెన్ పిటిషన్ తన అరెస్టు అక్రమమంటూ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం çశుక్రవారం విచారణ చేపట్టనుంది. -
కొత్త పొద్దు పొడుస్తుంది: శివరాజ్‌సింగ్ చౌహాన్
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందని, రాత్రి చీకట్లు తొలగి కొత్త సూర్యోదయం అవుతుందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ చెప్పారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, అన్యాయంపై ధర్మయుద్ధంలో టీఆర్ఎస్ను ఓడించి బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఈ సంఘర్షణ పోరాటాన్ని ప్రకటించడానికే తాను ఇక్కడకు వచ్చానన్నారు. ఇటీవల అరెస్టయి బెయిల్‌పై బయటకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అభినందన కార్యక్రమం శుక్రవారం పార్టీ కార్యాలయం వద్ద జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన శివరాజ్‌సింగ్ మాట్లాడారు. ప్రశ్నించే వారిని జైల్లో పెడుతున్నారు సీఎం కేసీఆర్ భయకంపితులై ఉన్నారని, ఇంతగా భయపడే పిరికి సీఎంను తానెక్కడా చూడలేదని చౌహాన్ పేర్కొన్నారు. ‘ప్రజలు, ఉద్యోగులు, ప్రతిపక్షాలు, ఇతర వర్గాల ప్రజలు ఏవైనా సమస్యలు లేవనెత్తినప్పుడు ప్రభుత్వాలు సమాధానాలివ్వడం సంప్రదాయం. భయపడే వారే ప్రశ్నించే వారిని జైల్లో పెడతారు. అదే తెలంగాణలో జరుగుతోంది..’అని అన్నారు. ఇక్కడ సమస్యలపై ఉద్యమిస్తే భయపడి అక్రమంగా, దౌర్జన్యంగా అరెస్టు చేసి జైల్లో వేస్తున్నారని విమర్శించారు. శ్రీకృష్ణుడు కూడా జైల్లోనే జన్మించి లోకకంఠకుడైన కంసుడిని అంతమొందించాడని, అదేవిధంగా ఇక్కడా కేసీఆర్ పాలన అంతమౌతుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను ప్రజలే జైలుకు పంపిస్తారు బీజేపీ అంటే తినే బిర్యానీ కాదని, రాష్ట్రంలో కేసీఆర్ పాలనను అంతమొందించే వరకు పార్టీ విశ్రమించే ప్రసక్తే లేదని శివరాజ్‌సింగ్ స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాలు, కేజీ టు పీజీ తదితర హామీల అమలు ఏమైందని ప్రశ్నించారు. వీటన్నింటిపై సమాధానాలు చెప్పకపోతే ప్రజలే కేసీఆర్‌ను జైలుకు పంపిస్తారన్నారు. ‘కేసీఆర్.. తెలంగాణ గడ్డపైకి వచ్చాను. నీ పాపాలు, రాక్షస పాలనను అంతమొందించడానికి, ఇక్కడ బీజేపీ చేస్తున్న పోరాటానికి మద్దతివ్వడానికే వచ్చాను..’అని అన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందని ఆరోపించారు. -
Afghanistan Crisis: అఫ్గాన్ సుప్రీం లీడర్‌గా అఖుంద్జాదా
పెషావర్/కాబూల్: అఫ్గానిస్తాన్‌ను అక్రమించిన రెండు వారాల తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లు సిద్ధమవుతున్నారు. శుక్రవారం ప్రార్థనల తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. దేశ అత్యున్నత నాయకుడిగా(సుప్రీం లీడర్) తాలిబన్ మత గురువు ముల్లా హైబతుల్లా అఖుంద్జాదా(60)ను ఎంపిక చేశారు. ఆయన బాధ్యతలు చేపట్టడం ఇక లాంఛనమే. ఈ విషయాన్ని తాలిబన్ సమాచార, సాంస్కృతిక కమిషన్ సీనియర్ ప్రతినిధి ముఫ్తీ ఇనాముల్లా సమాంఘనీ స్వయంగా వెల్లడించారు. అఫ్గాన్ ప్రభుత్వ అధినేత అఖుంద్జాదా అవుతారని, ఈ విషయంలో మరో ప్రశ్నకు తావే లేదని తేల్చిచెప్పారు. నూతన సర్కారు ఏర్పాటుపై సంప్రదింపులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. మంత్రివర్గం(కేబినెట్) కూర్పుపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వంలో ప్రావిన్స్‌లకు గవర్నర్లు, జిల్లాలకు జిల్లా గవర్నర్లు ఇన్చార్జులుగా ఉంటారని తెలిపారు. అక్కడ పరిపాలన వారి నేతృత్వంలో కొనసాగుతుందని అన్నారు. ప్రావిన్స్‌లు, జిల్లాలకు గవర్నర్లను, పోలీసు చీఫ్‌లను, పోలీసు కమాండర్లను తాలిబన్లు ఇప్పటికే నియమించినట్లు సమాచారం. నూతన ప్రభుత్వ వ్యవస్థ పేరును, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని ఇంకా ఖరారు చేయలేదని ఇనాముల్లా వివరించారు. ప్రభుత్వంలో అన్ని వర్గాలకు భాగస్వామ్యం అఫ్గాన్ కొత్త ప్రభుత్వ వ్యవస్థలో మహిళలకు, అన్ని గిరిజన తెగల సభ్యులకు ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు ఖతార్ రాజధాని దోహాలోని తాలిబన్ రాజకీయ కార్యాలయ ఉప నాయకుడు షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్ గురువారం ప్రకటించారు. దేశంలోని అన్ని వర్గాలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం దక్కుతుందని అన్నారు. తాలిబన్లకు గట్టి పట్టున్న కాందహార్ నగరం నుంచే ముల్లా హైబతుల్లా అఖుంద్జాదా ప్రభుత్వ అధినేతగా దేశ పరిపాలనను పర్యవేక్షిస్తారని తెలిపారు. భారత్, అమెరికా, యూరోపియన్ యూనియన్‌తో తాము సన్నిహిత సంబంధాలనే కోరుకుంటున్నామని వివరించారు. సంబంధ బాంధవ్యాలను బలోపేతం చేసుకొనే దిశగా ఆయా దేశాలతో తాలిబన్ ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొన్నారు. కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునీకరించడానికి దాదాపు 30 మిలియన్ డాలర్లు అవసరమని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఈ ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలు పునఃప్రారంభం అయ్యాక నిర్దేశిత ప్రయాణ ధ్రువపత్రాలు ఉన్నవాళ్లు విదేశాలకు వెళ్లొచ్చని సూచించారు. సుప్రీం లీడర్‌దే పెత్తనం అఫ్గానిస్తాన్‌లో ఇరాన్ తరహా ప్రభుత్వం, పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు చేయాలని తాలిబన్లు నిర్ణయించినట్లు తెలిసింది. ఇరాన్లో సుప్రీం లీడర్‌దే పెత్తనం. దేశంలో ఇదే అత్యున్నత రాజకీయ, మతపరమైన, సైనికపరమైన పదవి. అధ్యక్షుడి కంటే సుప్రీం లీడర్‌కే ఎక్కువ అధికారాలు ఉంటాయి. సైనిక, ప్రభుత్వ, న్యాయ విభాగం అధినేతల నియామకంలో సుప్రీం లీడర్ మాటే చెల్లుబాటు అవుతుంది. అఫ్గానిస్తాన్‌లో సుప్రీం లీడర్ కింద అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రిని నియమించనున్నట్లు సమాచారం. సుప్రీం లీడర్‌కు లోబడి అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి పరిపాలన సాగిస్తారు. -
బీజేపీకి చుక్కలు చూపిస్తున్న శివసేన
ముంబై : హరియాణాలో జేజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న బీజేపీకి.. మహారాష్ట్రలో మాత్రం శివసేన చుక్కలు చూపిస్తోంది. బీజేపీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆధ్వర్యంలో శివసేనతో కలిసి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ సోమవారం నాడు రెండు పార్టీలు వేర్వేరుగా గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారిని కలవడానికి నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా శివసేన పార్టీ నాయకుడు దివాకర్ రౌత్ ఉదయం 10. 30 గంటల ప్రాంతంలో గవర్నర్‌ను కలిశారు. సేన నేతలతో కలిసి రాజ్‌భవన్‌కు వచ్చిన దివాకర్... పార్టీ తరపున గవర్నర్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపామని, తమ మధ్య రాజకీయాలపై ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ఈ భేటీ తర్వాత బీజేపీ నాయకులు, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా గవర్నర్‌ను కలిసి చర్చించే అవకాశం ఉంది. దీపావళి సందర్భంగా గవర్నర్‌ను కేవలం మర్యాద పూర్వకంగా కలుస్తున్నట్లు రెండు పార్టీలు చెప్తుండడం కొసమెరుపు. కాగా అక్టోబర్ 21న జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహ కూటమికి మెజారిటీ సాధించినప్పటికీ, శివసేన అధినాయకత్వం ముఖ్యమంత్రి పదవికి 50:50 ఫార్ములా డిమాండ్‌ను తేవడంతో.. బీజేపీ అధినాయకత్వం ఈ విషయంపై మల్లగుల్లాలు పడుతోంది. ఎన్నికలు ముందు చెప్పినట్లుగానే ప్రభుత్వ ఏర్పాటులో 50-50 ఫార్ములా అనుసరించాలని, మంత్రి పదవులు సైతం సమానంగా ఇవ్వాలని శివసేన వాదిస్తోంది. దీంతో బీజేపీ అధినాయకత్వం నేడు శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేతో సమావేశమై ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ భాగస్వామి అయిన ఆర్పీఐ అధినేత రామ్‌దాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 50:50 ఫార్ములా పై ఆయన మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల పాటు ఆదిత్య ఠాక్రే డిప్యూటీ సీఎంగా ఉండే ఆఫర్‌కు శివసేన సమ్మతం తెలపాలన్నారు. ప్రజాభిప్రాయం మేరకు రెండు పార్టీలు కలిసి పనిచేయాలని కోరారు. రెండు పార్టీల మధ్య కొనసాగుతున్న వివాదాలకు త్వరలోనే ముగింపు పలికి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికలు ముందు చెప్పినట్లుగానే ప్రభుత్వ ఏర్పాటులో 50-50 ఫార్ములా అనుసరించాలని, మంత్రి పదవులు సైతం సమానంగా ఇవ్వాలని శివసేన వాదిస్తోంది. అలా కానీ పక్షంలో రిమోట్ తమ దగ్గర ఉందని, అలాగే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నట్లు చెబుతోంది. -
ప్రాంతీయ పార్టీలు బీజేపీకి మద్దతివ్వవు
న్యూఢిల్లీ/సిమ్లా: లోక్‌సభ ఎన్నికల్లో లౌకికవాద పార్టీలు గరిష్టస్థాయిలో సీట్లు గెలుచుకుంటాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతిపక్ష పార్టీలన్నీ కలసివస్తాయనే సంకేతాలిచ్చారు. తెలుగుదేశం పార్టీ(టీడీపీ), సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ), తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) వంటి ప్రాంతీయ పార్టీలు బీజేపీకి మద్దతు ఇవ్వవన్నారు. రాహుల్ శుక్రవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీకి ప్రజలిచ్చిన అవకాశాన్ని ఆయన వృథా చేశారన్నారు. గాంధీజీ భావజాలానికి, మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌లు పూర్తిగా విరుద్ధమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం (ఈసీ) పూర్తి పక్షపాతంతో వ్యవహరిస్తోందనీ, మోదీ ప్రచార సభలను దృష్టిలో పెట్టుకునే, ఆయనకు ఇబ్బంది కలగకుండా ఆదేశాలు ఇస్తోందన్నారు. ఈ నెల 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ప్రతిపక్షాల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయని ప్రశ్నించగా జవాబు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. అయితే తాము మోదీలా కాకుండా, సీనియర్ నాయకుల అనుభవాన్ని వాడుకుంటామని, మాజీ ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ తదితరుల సలహాలు తీసుకుంటామని తెలిపారు. మోదీ తప్పించుకోకుండా ఒక పద్ధతి ప్రకారం అన్ని ద్వారాలనూ మూసేయడమే తమ పార్టీ వ్యూహమని రాహుల్ చెప్పారు. ఇప్పటికే 90 శాతం ద్వారాలను తాము మూసివేయగా, మరో 10 శాతం ద్వారాలను మోదీ తనంతట తానే మూసేశారని వ్యాఖ్యానించారు. అంతకుముందు రాహుల్ మీడియాతో మాట్లాడుతూ మోదీ తొలిసారిగా విలేకరుల సమావేశానికి హాజరవుతుండటం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందనీ, అయితే కొందరు జర్నలిస్టులను ఆ భేటీకి రానివ్వడం లేదని తెలిసిందన్నారు. అవినీతిపై చర్చకు రండి.. రాహుల్ శుక్రవారం సిమ్లాలోని సోలన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అవినీతిపై తనతో చర్చకు రావాలని మోదీకి సవాల్ విసిరారు. ‘నాకు 15 నిమిషాలు ఇవ్వండి. నేను నాలుగు ప్రశ్నలడుగుతాను. సమాధానం చెప్పడానికి మోదీ మూడు, నాలుగు గంటల సమయం తీసుకోవచ్చు. ఆ చర్చ తర్వాత మోదీ తన ముఖాన్ని దేశ ప్రజలకు చూపించలేరు’ అని రాహుల్ అన్నారు. వాళ్లు గాడ్సే ప్రేమికులు.. గాంధీజీని హత్య చేసిన గాడ్సేపై బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటాన్ని రాహుల్ ప్రస్తావిస్తూ ‘బీజేపీ, ఆరెస్సెస్ వాళ్లు దేవుడి ప్రేమికులు (గాడ్–కే–లవర్స్) కాదు, గాడ్సే ప్రేమికులు (గాడ్–సే–లవర్స్)’ అని వ్యంగ్యంగా అన్నారు. భోపాల్ బీజేపీ అభ్యర్ధి ప్రజ్ఞాఠాకూర్ గురువారం మాట్లాడుతూ గాడ్సే దేశభక్తుడని పేర్కొనడం, తీవ్ర విమర్శలు రావడంతో కొద్దిసేపటి తర్వాత ఆమె క్షమాపణలు చెప్పడం తెలిసిందే. -
'ఇది టీ కప్పులో తుఫాను'
ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ అకాల మరణంతో ఏర్పడిన రాజకీయ వ్యాకులత నుంచి జమ్ముకశ్మీర్ ఇంకా బయటపడలేదు. మొన్నటివరకు పీడీపీ- బీజేపీ సంకీర్ ప్రభుత్వం కొనసాగగా.. మొహమూద్ మరణం, ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీను ముఖ్యమంత్రిని చేసేందుకు పీడీపీ ఏకపక్ష ప్రయత్నాలు.. దోస్తీపై బీజేపీని పునరాలోచనలో పడేశాయి. దీంతో కొత్త పొత్తులు ఉద్భవిస్తాయనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో తెరపైకి వచ్చిందే బీజేపీ- నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) కూటమి. ఎన్సీ అధినేత, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా శనివారం మీడియాతో మాట్లాడుతూ 'ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలంటూ బీజేపీ ప్రతినిధులెవరైనా వస్తే తప్పక ఆహ్వానిస్తామని, పార్టీ వర్కింగ్ కమిటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం' అన్నారు. గతంలోనూ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ బీజేపీతో కలిసి సంకీర్ణంలో కొనసాగిన దరిమిలా ఫారూఖ్ ప్రకటన రాజకీయవర్గాల్లో మరింత ఆసక్తిని రేపింది. కాగా, 'ఇదంతా టీ కప్పులో తుఫాను' అని కొట్టిపారేశారు ఫారూఖ్ తనయుడు, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. ఈ మేరకు ఆదివారం తెల్లవారుజామున ట్వీట్లు చేశారు. ఊహాజనిత ప్రశ్నలకు తాను సమాధానం చెప్పబోనని, బీజేపీ- ఎన్సీల కలయికా అలాంటిదేనని ఒమర్ పేర్కొన్నారు. ఇతర పార్టీలవాళ్లొచ్చి మాట్లాడతామంటే వారిని ఆహ్వానించడం పార్టీ అధినేతగా ఫారూఖ్ విధి. అందుకే ఆయనలా మాట్లాడారేతప్ప బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ఉద్దేశం ఎన్సీకి లేదు అని తేల్చిచెప్పారు. మొత్తం 87 సభ్యులు గల జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో పీడీపీకి 27మంది, బీజేపీకి 25 మంది నేషనల్ కాన్ఫెన్స్ కు 15 మంది సభ్యుల బలం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు 44 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో గవర్నర్ పాలన కొనసాగుతోంది. -
త్వరలోనే నిర్ణయం
ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై సుప్రీంకోర్టుకు తెలియజేసిన కేంద్ర ప్రభుత్వం సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న అనిశ్చితి త్వరలోనే తొలగిపోనుంది. ఇందుకు సంబంధించి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు శుక్రవారం తెలియజేసింది. ఢిల్లీలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ తమకు సమర్పించిన నివేదికను పరిశీలిస్తున్నామని అదనపు సొలిసిటర్ జనరల్ రంజిత్‌కుమార్ ...ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్దత్తూ నేతృత్వంలోని ధర్మాసనానికి తెలియజేశారు. దీంతో ఢిల్లీలో రాష్ట్రపతి పాలనను సవాలు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టమవుతుంద న్న ఆశతో శుక్రవారం నాటి సుప్రీంకోర్టు కార్యకలాపాలను గమనించిన వారికి కేసు విచారణ వాయిదాపడడం నిరాశ మిగిల్చింది. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా ? లేక ఎన్నికలు జరిపించాలా? అనే అంశంపై కేంద్రం తీసుకునే నిర్ణయం... హర్యానా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుందని, ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లయితే ఢిల్లీలో ఎన్నికలు జరపించవచ్చని రాజకీయ పండితులు అంచనా వేస్తున్న దృష్ట్యా ప్రభుత్వ వైఖరిని తెలపడానికి లెఫ్టినెంట్ గవర్నర్ మరికొంత సమయం కోరవచ్చనే ఊహాగానాలు ముందుగానే వినిపించాయి. ప్రభుత్వం శుక్రవారం కోర్టును మరికొంత సమయం కోరడం ఈ ఊహాగానాలను బలపరిచింది. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకుగల అవకాశాలను అన్వేషించేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ లెప్టినెంట్ గవర్నర్ రాసిన లేఖ ఇంకా రాష్ట్రపతి పరిశీలన కోసం ఎదురుచూస్తోందని, దానిపై త్వరలో నిర్ణయం వెలువడవచ్చని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. ఈ విషయంపై ప్రభుత్వం తరపున గతంలో న్యాయస్థానం ఎదుట హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ వ్యక్తిగత సమస్యల కారణంగా కూడా కేసు విచారణను న్యాయస్థానం ఈ నెల 28కి వాయిదా వేసిందని అమన్ అనే న్యాయవాది తెలిపారు. ఇదిలాఉంచితే ఢిల్లీలో ఫిబ్రవరి 17 నుంచి రాష్ట్రపతిపాలన కొనసాగుతోంది. సుప్తచేతనావస్థలో నున్న అసెంబ్లీని రద్దు చేసి వెంటనే ఎన్నికలు జరిపించాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని, ఈ విషయమై లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతికి లేఖ రాశారని, సెప్టెంబర్ తొమ్మిదో తేదీన ప్రభుత్వం ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతున్న ధర్మాసనానికి తెలిపింది. ఈ ప్రకియ ఫలితాన్ని అక్టోబర్ 10న తనకు తెలియజేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేనట్లయితే పార్టీల మార్పిడికి ప్రోత్సాహం లభిస్తుందని హెచ్చరించింది. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, బీజేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజుల పాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభలోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికార కార్యక్రమాలు జరుగుతున్నాయి.