ప్రేమించిందని కుమార్తె హత్యకు కుట్ర | Parents Attempt to Murder on Daughter in Tamil Nadu | Sakshi
Sakshi News home page

ప్రేమించిందని కుమార్తె హత్యకు కుట్ర

Published Fri, Oct 11 2019 8:16 AM | Last Updated on Fri, Oct 11 2019 8:25 AM

Parents Attempt to Murder on Daughter in Tamil Nadu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చెన్నై, తిరువొత్తియూరు: ప్రేమించిందన్న కోపంతో కన్న కూతురి ప్రాణాలు తీసేందుంకు తల్లిదండ్రులు ప్రయత్నించిన ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. తేని జిల్లా చిన్నమనూర్‌ సమీపం ఊత్తుపట్టికి చెందిన రాజా (46). అతని భార్య కవిత (43). వీరికి 17 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె బోడిలో ఉన్న ప్రైవేటు కళాశాలలో బీఏ చదువుతోంది. ఈ క్రమంలో విద్యార్థిని తన అక్క తరపు బంధువు ఒకరిని ప్రేమిస్తున్నట్టు తెలిసింది. దీనికి తల్లి దండ్రులు వ్యతిరేకించారు.

బుధవారం హాస్టల్‌ నుంచి ఇంటికి వచ్చిన కుమార్తెను బైకులో మర్కయన్‌కోట ముల్‌లై పెరియార్‌ వంతెన వద్దకు తీసుకు వెళ్లారు. అక్కడ కుమార్తెను చదువుకుంటున్న సమయంలో ప్రేమ వ్యవహారాలు ఎందుకంటూ నచ్చజెప్పారు. అయినా వినకపోవడంతో రాజా కుమార్తెపై దాడి చేసి ముల్‌లై పెరియార్‌ నదిలో తోసి అక్కడి నుంచి పారిపోయారు. నీటిలో పడిన ఆమె కాపాడాలంటూ కేకలు వేయడంతో ఆ మార్గంలో వెళ్తున్న ఆటో డ్రైవర్లు ఆమెను రక్షించారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న చిన్నమనూర్‌ పోలీసు కేసు నమోదు చేసి విద్యార్థిని తల్లిదండ్రులు రాజా, కవితను గురువారం అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement