
ప్రతీకాత్మక చిత్రం
తిరువొత్తియూరు(బెంగళూరు): చెన్నై అంబత్తూరు పూంబుహార్ నగర్‌కు చెందిన ఓ యువతి భర్తను వదిలి 13 సంవత్సరాల కుమార్తెతో నివాసం ఉంటోంది. ఈమె కూతురు అంబత్తూరులోని ఓ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో బాలిక తల్లికి అంబత్తూరు అంబేడ్కర్ వీధికి చెందిన బిస్వజిత్తు(30)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో బిస్వజిత్తు ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఏడాదిగా కాలంగా ఆమె తల్లి లేని సమయం చూసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు అంబత్తూరు మహిళా పోలీసులు కేసు నమోదు చేసి బిస్వజిత్తును ఫోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు.
మరో ఘటనలో..
సామూహిక లైంగిక దాడి కేసులో నిందితుల అరెస్టు
తిరువొత్తియూరు: కడలూరు జిల్లాలో సోమవారం రాత్రి ప్రియుడి ముందే ప్రియురాలిపై సామూహిక లైంగిక దాడి చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కడలూరు సెంమండలం బస్ నిలయంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా నిలబడి ఓ యువతి ఏడుస్తుండడంతో ఇన్‌చార్జ్ డీఎస్పీ ఆరోగ్యరాజు చూసి ప్రశ్నించారు. విచారణలో కమ్మియం పేటకు చెందిన ఆమె తన ప్రియుడితో అదే ప్రాంతంలో మాట్లాడుతున్న సమయంలో అక్కడికి వచ్చిన ముగ్గురు యువకులు ప్రియుడిని కొట్టి.. తనపై సామూహిక లైంగిక దాడి చేశారని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులైన కడలూరుకుప్పం పేటకు చెందిన సతీష్ (19), కిషోర్ (19), పుదుపాలయంకు చెందిన ఆరిఫ్ (18)ను ఫోక్సో చట్టం కింద అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment