
సాక్షి, చెన్నై: నామక్కల్ జిల్లాలో వివాహేతర ప్రియుడిని చీరతో గొంతు బిగించి హత్య చేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. నామక్కల్ జిల్లా పరమత్తి వేలూరు సమీపంలో తిడుమల్ ఆవారాంగాడు ప్రాంతానికి చెందిన సెల్వరాజు (50), అతని భార్య కళామణి. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సెల్వరాజ్ తన రెండు కార్లను అద్దెకు నడుపుతుండేవాడు. ఈ క్రమంలో సెల్వరాజు పరమత వేలూరు సమీపంలోని పాలక్కరై ప్రాంతంలో ఉన్న సుధ (45) ఇంటిలో మృతి చెందినట్లు కళామణికి సమాచారం అందింది. బంధువులతో కలిసి ఘటన స్థలానికి వెళ్లి చూడగా సెల్వరాజు అనుమానాస్పదస్థితిలో మృతి చెంది ఉన్నాడు.
దీనిపై కలామణి నల్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు సెల్వరాజు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవ పరీక్ష కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెల్వరాజ్, సుధ మద్య ఐదేళ్లుగా వివాహేతర సంబంధం నడుస్తోంది. ఇటీవల సుధకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడినట్లు తెలయడంతో సెల్వరాజ్ ఆమెను నిలదీశాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెల్వరాజును హత్య చేయడానికి సుధ నిర్ణయించుకుంది. గురువారం రాత్రి తన ఇంటికి వచ్చిన సెల్వరాజుకు ఎక్కువగా మద్యం తాగించి, చీరతో గొంతు బిగించి హత్య చేసింది. పోలీసులు నిందితురాలని అరెస్ట్ చేసి పరమట్టి కోర్టులో హాజరుపరచి సేలం మహిళా జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment