10వ తరగతిలో సత్తాచాటిన సూర్య కూతురు, మార్కుల జాబితా వైరల్‌ | Hero Suriya Daughter Diya Got Merit in 10th Class, Marks List Goes Viral | Sakshi
Sakshi News home page

Suriya: పదో తరగతి ఫలితాల్లో సత్తాచాటిన సూర్య కూతురు, ఆ సబ్జెక్ట్‌లో వందకు వంద

Published Fri, Jun 24 2022 11:50 AM | Last Updated on Fri, Jun 24 2022 12:26 PM

Hero Suriya Daughter Diya Got Merit in 10th Class, Marks List Goes Viral - Sakshi

తమిళ స్టార్‌ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైవిధ్యమైన పాత్రలు, కథలను ఎంచుకుంటూ అగ్ర నటుడిగా గుర్తింపు పొందాడు. కోలీవుడ్‌ స్టార్‌ హీరో అయిన సూర్యకు తెలుగులోనూ మంచి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇదిలా ఉంటే సూర్య హీరోగా ఎంత బిజీ ఉన్న కుటుంబానికి మాత్రం ప్రత్యేకంగా సమయాన్ని కెటాయిస్తాడు. తన ఇద్దరు పిల్లలు దియా, దేవ్‌లతో కలిసి విరామ సమయాన్ని ఎంజాయ్‌ చేస్తాడు.

చదవండి: అన్‌స్టాపబుల్‌: రెండో సీజన్‌ తొలి గెస్ట్‌ ఆ స్టార్‌ హీరోనట!

ఇదిలా ఉంటే ఇప్పుడు సూర్య కూతురు దియా సాధించిన ఘనత గురించి ఇటూ తమిళ రాష్ట్రంతో పాటు తెలుగు రాష్ట్రాలు చర్చించుకుంటున్నాయి. అయితే దియా చదువులో ఫస్ట్‌ అని, క్లాస్‌ ఫస్ట్‌ వస్తుందని సూర్య పలు ఇంటర్య్వూలో చెబుతూ ఉంటాడు. తాజాగా ఆమె పదోవ తరగతి పూర్తి చేసింది. ఇటీవల తమిళనాడు పదో తరగతి పరీక్ష ఫిలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో దియా అత్యథిక మార్కులు సాధించి ప్రతిభను కనబరించింది. అన్ని సబ్జెక్టుల్లోనూ తొంభైకి పైగా మార్కులతో మెరిట్‌ జాబితాలో నిలిచింది.

చదవండి: ఇండస్ట్రీలో అవకాశాలు లేవు అంటున్నారు: మంత్రి తలసాని

ముఖ్యంగా ఎంతో కష్టమైన సబ్జెక్ట్‌ గణితంలో ఆమె వందకు వందశాతం మార్కులు సాధించి అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇక కూతురు సాధించిన ఘనతను చూసి సూర్య-జ్యోతికలు మురిసిపోతున్నారు. కాగా ప్రస్తుతం దియా మార్కుల జాబితా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అన్ని సబ్జెక్ట్స్‌లో దియా సాధించిన మార్కులు ఇలా ఉన్నాయి. తమిళం, సోషల్‌ సైన్స్‌లో 95 మార్కులు, సైన్స్‌లో-98, ఇంగ్లిష్‌లో-99, మ్యాథ్స్‌లో-100 మార్కులు తెచ్చుకుంది దియా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement