tention
-
మణిపూర్‌లో మళ్లీ కాల్పులు.. పోలీసు హెడ్‌క్వార్టర్‌పై మూకదాడి
ఇంఫాల్: మణిపూర్‌లో దుండగులు రెచ్చిపోతున్నారు. గంటల వ్యవధిలోనే వేర్వేరు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మోరే జిల్లాలో పోలీసు పోస్టుపై దుండగులు కాల్పులు జరిపిన కొన్ని గంటల్లోనే తౌబాల్ జిల్లాలో పోలీసు హెడ్‌క్వార్టర్‌పై దాడి చేశారు. ఇక్కడ జరిగిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. తౌబల్ ఖంగాబోక్ ప్రాంతంలోని 3వ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ కాంప్లెక్స్‌ను దుండగులు మొదట లక్ష్యంగా చేసుకున్నారు. తెల్లవారు జామున పోలీసు కేంద్రంపై ఒక్కసారిగా మూకదాడికి దిగారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు దాడిని తిప్పికొట్టారు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. మణిపూర్‌లో మెయితీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు ప్రారంభమైన నాటి నుంచి హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో దాదాపు 175 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘర్ణణ వాతావరణం కాస్త సద్దుమణిగినప్పటికీ కాల్పుల ఘటనలు చెదురుమదురుగా జరుగుతూనే ఉన్నాయి. నిన్న మోరేలో జరిగిన దాడి నేపథ్యంలో సీఎం బీరేన్ సింగ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హజరయ్యారు. Today (17.01.2024), an irate mob targeted the 3rd Indian Reserve Battalion (3IRB) in Khangabok, Thoubal District. Security forces repelled them using the minimum necessary force. Further, the mob attempted to breach Thoubal Police Headquarters, prompting the security forces to — Manipur Police (@manipur_police) January 17, 2024 -
సుధీర్ రెడ్డిపై పోస్టర్ల కలకలం
హైదరాబాద్: ఎల్బీనగర్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. సుధీర్ రెడ్డిపై రౌడీషీట్ తెరవాలని నియోజకవర్గం మొత్తం రాత్రికి రాత్రే పోస్టర్లు వెలిశాయి. దినపత్రికలలో సైతం పాంప్లెంట్లు పెట్టి ఇంటింటికి పంపించారు గుర్తుతెలియని వ్యక్తులు. పోస్టర్లలో ప్రముఖ వ్యక్తులపై దాడులకు పాల్పడ్డాడని పేర్కొంటూ అగంతకులు కొంతమంది ఫోటోలని కూడా వేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చెంపపేట్ డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి పేరుతో ఒక ఫోన్ నెంబర్ వేసి దుండగులు పోస్టర్లు అతికించారు. పోస్టర్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నాయకులు. మరొకసారి మా నాయకునిపై ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇదీ చదవండి: బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి.. క్లారిటీ ఇచ్చిన వివేక్ -
ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ షాక్..?.. అవే కొంప ముంచాయా?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గులాబి పార్టీ ఎమ్మెల్యేలకు టికెట్ల దడ మొదలైంది. కొందిరికి టికెట్లపై పెట్టుకున్న ఆశలు అవిరవుతున్నాయి. జనంలో పలుకుబడి లేమి, అవినీతి ఆరోపణలున్న ఎమ్మెల్యేలకు బైబై చెబుతోంది గులాబీ దళం. అవినీతి ఆరోపణలే ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖనాయక్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కొంపలు ముంచాయా? లైంగిక వేధింపులు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు టిక్కెట్ ను దూరం చేసిందా? లాస్ట్ ఛాన్స్ ఇవ్వండని ఎమ్మెల్యేలు పార్టీ పెద్దలు కోరుతున్నా కరుణించడం లేదా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలకు టికెట్ల గుబులుపై ప్రత్యేక కథనం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడి ఎమ్మెల్యేలపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి . అదేవిధంగా ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు బీఅర్ఎస్ షాక్ ఇస్తోంది. రాబోయే ఎన్నికలలో గెలిచే సత్తా ఉన్న ఎమ్మెల్యేల జాబితాను పార్టీ ఇప్పటికే సిద్దం చేసింది. ఈ జాబితా లో ఉన్న పేర్లను త్వరలో ప్రకటించనున్నారు. జాబితాలో నిర్మల్ నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాద్ నుండి ఎమ్మెల్యే జోగురామన్న, సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప, అసిపాబాద్ అత్రం సక్కు, చెన్నూర్ నుంచి విప్ సుమన్, మంచిర్యాల నుంచి దివాకర్ రావు, ముథోల్ నుంచి విఠల్ రెడ్డి పేర్లున్నట్లు తెలుస్తోంది. కాని జాబితాలో ఎమ్మెల్యే రేఖనాయక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పేర్లు లేవని సమాచారం. జిల్లాలో ఈ ముగ్గురికి సీఎం కేసీఆర్ షాక్ ఇస్తున్నారని సమాచారం. దాంతో ఎమ్మెల్యే రేఖ నాయక్, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, దుర్గం చిన్నయ్య టిక్కెట్ రాదని కలవరపాటుకు గురవుతున్నారు. వీరి స్థానంలో ఖానాపూర్ లో జాన్సన్ నాయక్ , బోథ్ నుంచి మాజీ ఎంపీ నగేష్ టిక్కెట్ ఖారారైందని పార్టీలో ప్రచారం ఉంది. అదేవిధంగా బెల్లంపల్లిని సీటుని పోత్తులో సీపీఐకి కేటాయిస్తారని పార్టీలో చర్చజరుగుతోంది. ఒకవేళ పోత్తు లేకుంటే ఎంపీ నేతకాని వెంకటేష్ , మంచిర్యాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేనుగుంట ప్రవీణ్ పేరు ఖారారు చేస్తుందని సమాచారం. ఎమ్మెల్యే రేఖా నాయక్ పై తీవ్రమైన అవినీతి అరోపణలు ఉన్నాయి. ప్రధానంగా డబుల్ బెడ్ రూమ్, దళిత బందు, సర్కార్ పనుల కేటాయింపులలో వాటాలు వసూలు చేశారని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పై అంతులేని ఆరోపణలు ఉన్నాయి. బిఆర్ ఎస్ పార్టీ నాయకులే ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు దళితబందు, దళిత బస్తీ, డబుల్ బెడ్ రూమ్ పథకాలలో వాటాలు వసూలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ కు ఫిర్యాదులు అందాయి. వీటికితోడు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని అపవాదు ఉంది. దీనితో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వ్యతిరేకతతోపాటు పార్టీలో అసంతృప్తి ఉంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇలాంటి అంశాలతో టిక్కెట్ ఇచ్చినా గెలిచే అవకాశాలు లేవని సర్వేలలో తెలిందట. ఎమ్మెల్యే రేఖనాయక్ పై కూడా ఇదేవిధమైన వ్యతిరేకత ఉంది. టిక్కెట్ గెలిచే పరిస్థితి లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై అవినీతి ఆరోపణలు , శేజల్ పై లైంగిక వేధింపులతో ప్రజల్లో పరువు కోల్పోయారు. అందుకే టికెట్టు ఇవ్వడంలేదట. ముచ్చట మూడోసారి పోటీ చేయాలని ముగ్గురు ఎమ్మెల్యేలు భావించారు. కానీ ఆశలు ఆవిరి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, హరీష్ రావు ద్వారా టిక్కెట్ దక్కించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. లాస్ట్ ఒక్కసారి చివరి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. ఈ ఎమ్మెల్యేల ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి. ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు హ్యాండిచ్చారా?.. కారు దిగాలనుకున్న ఆ నేతలు రూట్ మార్చారా? -
జనగామ జిల్లాలోని బీఆర్ఎస్ లో సీట్ల లొల్లి
-
సిద్దిపేట జిల్లా గుర్జకుంటలో ఉద్రిక్తత
-
ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ అంత్యక్రియల్లో ఉద్రిక్తత
-
ఖమ్మం జిల్లాలో డెంగ్యూ డెంజర్ బెల్స్
-
విజయనగరం జిల్లాలో టైగర్ టెన్షన్
-
నర్సీపట్నంలో బయటపడ్డ అయ్యన్న బాగోతం
-
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత
-
తెలంగాణ రాజ్ భవన్ వద్ద భారీ బందోబస్తు
-
కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉద్రిక్తత
-
నిజామాబాద్ జిల్లా హున్సాలో ఉద్రిక్తత
-
టెన్షన్ పెట్టిస్తున్న డెంగ్యూ ఫీవర్
-
కోదండరామ్ ఇంటి వద్ద ఉద్రిక్తత
-
కాకినాడలో సెజ్ ఉద్రిక్తత
-
టెన్షన్ పడుతున్న అధికార టీడీపీ
-
దళితులను వేధిస్తోన్న గ్రామ పెత్తందారులు
-
‘స్పాట్’లో ఉద్రిక్తత
- పదోతరగతి మూల్యాంకనం బహిష్కరణకు ఉపాధ్యాయ సంఘాల యత్నం - ‘స్పాట్’ సెంటర్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు - నాయకుల అరెస్ట్, విడుదల అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాక్టో, ఫ్యాప్టో మంగళవారం చేపట్టిన పదో తరగతి మూల్యాంకనం బహిష్కరణ ఉద్రిక్తతకు దారి తీసింది. బహిష్కరణకు ముందుగానే పిలుపునివ్వడంతో అనంతపురంలోని ‘స్పాట్’ కేంద్రమైన కేఎస్ఆర్ బాలికోన్నత పాఠశాల వద్ద మంగళవారం ఉదయం ఏడు గంటలకే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాధారణ పోలీసులతో పాటు పదుల సంఖ్యలో స్పెషల్ పార్టీ పోలీసులను మోహరించారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఇటువైపు ఎవరూ రావొద్దంటూ ఆంక్షలు విధించారు. అయితే.. ఎనిమిది గంటల సమయంలో వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.ఓబుళపతి, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌రెడ్డి తదితరులు కేఎస్ఆర్ పాఠశాల గేటు వద్దకు చేరుకున్నారు. విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన వారిని అడ్డుకున్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికే మూల్యాంకనం బహిష్కరిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో వచ్చిన వారిలో ఎక్కువ మంది విధుల్లో పాల్గొనకుండా వెనుదిరిగారు. ఉపాధ్యాయ నాయకులను పోలీసులు అడ్డగించారు. బలవంతంగా జీపులో టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ మూల్యాంకన కేంద్రం వద్ద కర్ఫ్యూ వాతావరణాన్ని తలిపించేలా బందోబస్తు ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టారు. తామేమీ సంఘ విద్రోహశక్తులం కామని, సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుండగా.. ఎస్‌ఎల్‌టీఏ, టీఎన్‌యూఎస్ నాయకులు తాము విధుల్లో పాల్గొంటామని, పేపర్లు దిద్దేందుకు ఇవ్వాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అయితే అప్పటికే 90 శాతానికి పైగా టీచర్లు ‘స్పాట్’లో పాల్గొనకుండా వెళ్లిపోయారు. ఈ హైడ్రామా మధ్యాహ్నం 12 గంటల దాకా నడిచింది. చివరకు అందుబాటులో ఉన్న కొందరు ఉపాధ్యాయులకు పేపర్లు దిద్దే అవకాశం ఇచ్చారు. ఆ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు భద్రత కొనసాగించారు. -
మోదీ విజయంతో పొరుగు దేశాలకు కంగారు
-
టీడీపీ ఆశావాహుల్లో టెన్షన్..టెన్షన్..
-
పోలవరం నిర్వాసిత గ్రామం ఖాళీపై ఉద్రిక్తత
-
స్వైన్ ఫ్లూ సైరన్!
అనంతపురం : జిల్లాలోనూ స్వైన్ ఫ్లూ సైరన్ మోగింది. మూడు నెలల క్రితమే ఇద్దరు మృత్యువాత పడ్డారు. అయితే.. ఈ విషయాన్ని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు గోప్యంగా ఉంచుతూ వచ్చారు. కేసు లు వెలుగులోకి వచ్చాకైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారా అంటే అదీ లేదు. తీరా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ చాపకింద నీరులా విస్తరిస్తుంటే హడావుడి చేయడానికి జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. -
వంశధార పనుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు
-
వంశధార ఫేజ్-2 పనుల్లో ఉద్రిక్తత
-
రసవత్తరంగా మారిన ఎస్పీ రాజకీయం
-
మల్కాన్‌గిరి ఎస్పీ ఆఫీసు ఎదుట ఉద్రిక్తత
-
నాసిక్‌లో తగ్గని ఆందోళనలు
-
మహారాష్ట్రలో పొలిటికల్ టెన్షన్
-
అనంత మున్సిపల్ ఆఫీసు వద్ద ఉద్రిక్తత
-
తనిఖీ..వణుకు
lరాష్ట్ర పరిశీలకుల రాకతో సర్కారు బడుల్లో అప్రమత్తం lరికార్డులు సర్దుకునే పని ముమ్మరం ఖమ్మం: పాఠశాలల్లో క్షేత్రస్థాయి సమగ్ర వివరాల కోసం రాష్ట్ర బృందం జిల్లాలో తనిఖీలకు సిద్ధం కావడంతో..బాధ్యుల్లో బెంగ మొదలైంది. బడిలో బోధనెలా ఉంది..? అసలు సౌకర్యాలేమున్నాయి..? పిల్లల విద్యా సామర్థ్యమెంత..? ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణ కరువైందా..?ఉపాధ్యాయుల లోపముందా..? ఇలా రకరకాలుగా వివరాలు నమోదు చేయనుండడంతో ఎక్కడేతప్పు దొరుకుతుందోననే భయంతో కొందరు వణుకుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కేజీబీవీల్లో ఇక..ఎక్కడైనా తనిఖీ జరగొచ్చు..వాస్తవాలు వెలుగుచూడొచ్చు. రాష్ట్ర ప్రత్యేక బృందం ప్రస్తుతం జిల్లాకు చేరుకుంది. ఈ అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కేజీబీవీల్లో ముమ్మర తనిఖీలు చేయనున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుశాతం, భౌతిక వనరుల వినియోగం, బోధన పద్ధతులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం మొదలైన అంశాలను పరిశీలించనున్నారు. రికార్డులు సక్రమంగా నిర్వహించని కొందరు ప్రధానోపాధాయులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచడంపై దృష్టి పెట్టారు. తనిఖీలు నిష్పక్షపాతంగా సాగుతాయా..? లేక తూతూమంత్రంగా జరిపి చేతులు దులుపుకుంటారా..? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా టెట్ అర్హత, మౌలిక వసతులు, పాఠశాల నిర్వహణ కమిటీ మొదలైన అంశాలు ప్రస్తావించే అవకాశం ఉన్నందున పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ఆందోâýæన చెందుతోంది. బోధన..‘భోజనం’పై దృష్టి lఉపాధ్యాయుల సంఖ్య, మంజూరైన పోస్టులు, పనిచేస్తున్నవారు, హాజరైన వారు, గైర్హాజరును పరిగణనలోకి తీసుకుంటారు. lప్రైవేట్ పాఠశాలల్లో టెట్ అర్హత సాధించిన వారు లేకుంటే చర్యలుండే అవకాశాలున్నాయి. lవిద్యార్థుల సంఖ్య, గైర్హాజరు, అందుతున్న మధ్యాహ్న భోజనం నాణ్యతపై తనిఖీలు ఉండనున్నాయి. lవిద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు అందాయా..? పంపిణీ, స్టాక్, రిజిష్టరులో పొందు పరిచారా అనేవి నమోదు చేయనున్నారు. సిలబస్..సామర్థ్యం కచ్ఛితం lపాఠశాల సంచాలకుల నుంచి చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం(3ఆర్) అమలును గుర్తించనున్నారు. lచదవడం, రాయడం, గణితంలో చతుర్విధ ప్రక్రియలు చేయలేని వారి గుర్తింపు, వారికి ఎలా బోధించారనేవి ప్రశ్నించనున్నారు. lప్రణాళిక ప్రకారం సిలబస్ పూర్తి, పరీక్షల నిర్వహణ, సమీక్షలు, మినిట్స్, నిరంతర సమగ్ర మూల్యంకనం(సీసీఈ) అమలు తీరును పరిశీలించనున్నారు. lప్రాజెక్టుల తయారీ, సీసీఈ బోధన, ర్యాచరణ, పాఠ్యప్రణాళిక తయారీ, స్వీయ ప్రతిస్పందన లోపాలను గుర్తిస్తారు. నిధులు..విధులపై గురి lవచ్చిన నిధులెన్ని..? ఖర్చు వివరాలు..? హెచ్ఎం ఉపాధ్యాయులతో సమావేశాలు తెలుసుకుంటారు. lతీర్మానాల వివరాలు, కొనుగోలు చేసిన వస్తువులు, కొనుగోలు సామాగ్రిని పరిశీలిస్తారు. lప్రధానోపాధ్యాయుడి నాయకత్వ లక్షణాల పరిశీలన ఉంటుంది. lసహచర ఉపాధ్యాయులతో సమన్వయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. lప్రహరీలు, అదనపు గదులు, టాయిలెట్లు, తాగునీరు, గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్, దృశ్య, శ్రవణ బోధనపరికరాల కొరతపై వివరాలు సేకరించనున్నారు. -
మంత్రి ప్రత్తిపాటికి పదవి ’టెన్షన్’
-
గోడలపై 'గో ఇండియా గో బ్యాక్' నినాదం!
శ్రీనగర్ః భద్రతా దళాల కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వాని మృతిపై కశ్మీర్ లో కల్లోలం ఇంకా ఆగలేదు. బుర్హానీ మరణంపై అప్పట్నుంచీ ఏదో రకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా స్థానికుల ఇళ్ళు, గోడలపై హురియత్ నాయకుడి రాతలు మరోసారి అగ్నికి అజ్యం పోశాయి. కరడుగట్టిన హురియత్ నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ 'గో ఇండియా గో' నినాదాలు ఇప్పుడు కశ్మీర్ లో మరోసారి కలకలం రేపుతున్నాయి. స్థానికుల ఇళ్ళు, గోడలపై ఆయన రాసిన రాతలు ఆందోళనకారులను మరింత రెచ్చగొడుతున్నాయి. భారతదేశానికి వ్యతిరేకంగా, పాకిస్తాన్ కు అనుకూలంగా తన మనోభావాలను గిలానీ ఎంతోకాలంగా వ్యక్త పరుస్తూనే ఉన్నాడు. గతంలో అనేక సందర్భాల్లో గిలానీ బహిరంగంగా శత్రు.. పొరుగు దేశం కశ్మీర్ అనుసంధానంపై సూచిస్తూనే ఉన్నాడు. బుర్హాన్ వాని ఎన్ కౌంటర్ అనంతరం ప్రజల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేయడంతోపాటు... లోయలో బంద్ కొనసాగేందుకు తనవంతు సాయం అందించాడు. అటువంటి ఘటనలతో సుమారు 25 రోజులపాటు కశ్మీర్ లోయలో కర్ఫ్యూ, కొనసాగింది. ఇప్పుడు తాజాగా గోడలపై 'గో ఇండియా గో' నినాదాలు రాస్తూ మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో జమ్మూ, కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పందించారు. కశ్మీర్ లోయలో ఉద్రిక్తతను సృష్టిస్తున్న వేర్పాటువాదులను తీవ్రంగా మందలించారు. వేర్పాటు వాదులు కశ్మీర్ ను సిరియాగా మార్చాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు, యువతకు విద్య అవసరాన్ని తెలియజేయాల్సింది పోయి.. పీపుల్స్ డెమొక్రెటిక్ పార్టీ విస్మరిస్తోందని ఆరోపించారు. సోమవారం ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ప్రజలను పలకరించిన ఆమె.. సమస్యను అధిగమించాలంటే ప్రజల సామూహిక కృషి ఎంతో అవసరమన్నారు. బుర్హాన్ వాని మరణించిన అనంతరం జూలై 9 నుంచీ అధికారికంగా విధించిన కర్ఫ్యూ కు తోడు.. వేర్పాటువాదుల ఆందోళనలతో స్థానిక జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. -
శ్రీకాకుళంలో ఉద్రిక్తత
-
అమరచింతలో కలకలం
ఆత్మకూర్(నర్వ) : అమరచింతలోని శివాజీనగర్‌లో సోమవారం రాత్రి క్షద్రపూజలు నిర్వహించి రక్తాన్ని పరిసరాల్లో చల్లారనే పుకార్లు మంగళవారం తెల్లవారుజామున వినిపించా యి. దీంతో గ్రామస్తులు శివాజీనగర్‌లోని ఆ ప్రదేశానికి తరలివచ్చారు. ఎస్ఐ సీహెచ్ రాజు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. శివాజీనగర్‌లో జన్ను నాగరాజు ఇంట్లో అద్దెకు ఉంటున్న గాజుల ఖాజా పై అనుమానంతో విచారించారు. ఖాజా తన భార్య అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ఇంట్లో దిష్టి తీసే పనులకు తన బావమరుదులను పిలిపించుకున్నట్లు తెలిపారు. అయితే కోసిన కోళ్ల రక్తంతో పాటు కోడి తలకాయలు, పేగులను కుండలో ఉడకబెట్టి కుంకుమ, పసుపును చల్లి దిష్టితీసిన అనంతరం వాటిని దూరప్రాంతానికి విసిరివేయడానికి వెళ్తుండగా పొరపాటున చేయి జారి కుండ పలిగిపోయిందని ఎస్ఐకి తెలిపాడు. రాత్రివేళ ఆ ప్రదేశాన్ని నీటితో కడిగామని తెలిపాడు. అయితే కాలనీవాసులు మాత్రం క్షుద్ర పూజలు జరిపి గుప్తనిధులను తీయడానికి ప్రయత్నించి ఉంటారని అనుమానం వ్యక్తం చేయగా ఖాజా ఇంటికి వచ్చిన నఫీజ్ పాష, మక్సూద్ అహ్మద్, సులేమాన్‌ను పోలీస్‌స్టేçÙన్కు తరలించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజానిజాలు వెల్లడించి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. -
ఓయూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వద్ద ఉద్రిక్తత
-
టెన్షన్...టెన్షన్...టెన్షన్!
టెన్షన్...టెన్షన్..టెన్షన్.. దేశమంతటా ఒకటే ఉత్కంఠ. మన రాష్ట్రంలో మరీను. ఇక గంటలలోనే దేశమంతటా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సార్వత్రిక ఎన్నికలకు ఈవీఎంలు ఉపయోగించినందున ఫలితాలు త్వరితగతిన వెల్లడవుతాయి. ఉదయం 11 గంటలకే కొందరు విజేతలు తెలిసిపోతారు. అంతేకాకుండా ఎక్కడ ఏ వ్యక్తి లీడింగ్‌లో ఉన్నారో, దేశంలో, రాష్ట్రంలో ఏ పార్టీ లీడింగ్‌లో ఉందో కూడా తెలిసిపోతుంది. దాంతో ఉత్కంఠకు తెరపడుతుంది. దేశవ్యాప్తంగా 9 విడతలలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 543 లోక్‌సభ స్థానాలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఓట్లను రేపు లెక్కిస్తారు. మొదటి విడత ఎన్నికలు ఏప్రిల్ 7న జరుగగా, చివరి విడత పోలింగ్ ఈ నెల 12న జరిగింది. తెలంగాణాలోని 119 శాసనసభ స్థానాలకు,17 లోక్‌సభ నియోజక వర్గాలకు ఏప్రిల్ 30న ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లోని 175 శాసనసభ, 25 లోక్‌సభ నియోజక వర్గాలకు మే 7న ఎన్నికలు జరిగాయి. మన రాష్ట్రంలో తెలంగాణ, ఏపిలలో రెండు విడతలుగా పోలింగ్ జరిగినా, ఓట్ల లెక్కింపు మాత్రం రెండు ప్రాంతాలలోనూ రేపు ఉదయమే మొదలు పెడతారు. ఇప్పటికే వివిధ ఎగ్జిట్ పోల్స్ ద్వారా దేశంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ, తెలంగాణలో టిఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వస్తుందని ఎక్కువ మంది పరిశీలకులు ఒక అంచనాకు వచ్చారు. ఎంత అంచనా ఉన్నా ఫలితాలు తెలిసేవరకు ఆ టెన్షన్ అలా కొనసాగుతూనే ఉంటుంది. బెట్టింగులు కాసినవారి టెన్షన్ అయితే చెప్పడం కష్టం. దేశవ్యాప్తంగానే కాకుండా, విదేశాలలో కూడా ఇక్కడి ఎన్నికల ఫలితాలపై బెట్టింగుల వ్యవహారం నడిచింది. ఇంకా నడుస్తూనే ఉంది. కొంత మంది అతి తక్కువ ఓట్ల మెజార్టీతోనైనా గట్టెక్కుతామనే ఆశతో ఉండేవారు ఉంటారు. అటువంటి వారు మరీ ఎక్కవ ఉత్కంఠకు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో పరిస్థితి మరీ ఉత్కంఠను రేపుతోంది. వైఎస్ఆర్ సిపి తొలిసారిగా సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసింది. ఇటు తెలంగాణలో కాంగ్రెస్, టిఆర్ఎస్ మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది. నిన్న మొన్న వెల్లడైన స్థానిక సంస్థల ఫలితాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అటు ఆంధ్ర ప్రదేశ్‌లో వైఎస్ఆర్ సిపి, టిడిపి మధ్య జరిగిన పోరులో వైఎస్ఆర్ సిపి ముందుందని అందరూ భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో టిడిపి ముందుండటంతో ఆ పార్టీ విజయంపై ఆశలు పెట్టుకుంది. అయితే మునిసిపాలిటీల ఫలితాలతో పోల్చితే మరుసటి రోజు వెల్లడైన జడ్పిటిసి, ఎంపిటిసి ఫలితాలలో వైఎస్ఆర్ సిపి మెరుగైన ఫలితాలను సాధించింది. అలాగే ఓటింగ్ శాతం కూడా ఆ పార్టీకి పెరింగింది. దాంతో ముందు నుంచి మంచి ఊపుమీదున్న టిడిపి డీలా పడిపోయింది. పలు ఎగ్జిట్ పోల్స్ కూడా వైఎస్ఆర్ సిపియే అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలుపుతున్నాయి. ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని అంచనాలు వేసినా, ఎన్ని లెక్కలు చూపినా, ఎగ్జిట్ పోల్స్ ఏం తెలిపినా అందరి ఉత్కంఠకు రేపు మధ్యాహ్నమే తెరపడేది. అప్పటి వరకు ఈ టెన్షన్ తప్పదు. మొదటి విడత పోలింగ్ జరిగిన వారు నెలా 14 రోజులుగా ఈ టెన్షన్ అనుభవిస్తున్నారు. -
చిత్తూరులో ఉద్రిక్తత
చిత్తూరు: చిత్తూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సీకే బాబు ఇంటిలో అధికారులు తనిఖీలు చేశారు. ఎన్నికల పరిశీలకుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకే తనిఖీలు నిర్వహించామని అధికారులు అధికారులు చెప్పారు. తనిఖీలు నిర్వహించినట్లు తనకు సర్టిఫికెట్ ఇవ్వాలని సీకే బాబు డిమాండ్ చేశారు. తనిఖీల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో సికె బాబు ఇంటికి చేరుకున్నారు. దాంతో చిత్తూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ఏపి భవన్ వద్ద ఉద్రిక్తత
న్యూఢిల్లీ: ఏపి భవన్ వద్ద తెలంగాణ, సీమాంధ్రవాదులు పోటీపోటీగా ఆందోళనలు, ధర్నాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ సమైక్యవాదులు ఆందోళన చేస్తున్నారు. బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని తెలంగాణవాదులు ధర్నా చేస్తున్నారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. విభజన వ్యవహారం చివరి దశకు చేరుకోవడంతో అటు పార్లమెంటులోనూ, ఇటు బయట ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును రేపు లోక్‌సభలో ప్రవేశపెడుతున్న నేపధ్యంలో ఈ ఆందోళనకు ఇంకా ఉధృతమయ్యే అవకాశం ఉంది. -
అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: శాసనసభ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలంగాణ బిల్లు ఈరోజు శాసనసభలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. తెలంగాణ ముసాయిదా బిల్లును బీఏసీలో చర్చించకుండా, సభ అనుమతి లేకుండా చర్చకు అనుమతించడాన్ని ఆ పార్టీ వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా శాసనసభలో నిరసన కొనసాగించాలని ఆ పార్టీ నిర్ణయించింది. రాత్రంతా అసెంబ్లీ ప్రాంగణంలోనే ఉండాలని ఆ పార్టీ శాసనసభ్యులు నిర్ణయించుకొని అక్కడే ఉన్నారు. ఇదిలా ఉండగా, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కూడా అసెంబ్లీ ప్రాంగణంలోనే ఉన్నారు. దాంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ ప్రాంగణంలోకి పోలీసులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేల అరెస్టుకు సన్మాహాలు చేస్తున్నారు. స్పీకర్ అనుమతితో ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.