-
lరాష్ట్ర పరిశీలకుల రాకతో సర్కారు బడుల్లో అప్రమత్తం
-
lరికార్డులు సర్దుకునే పని ముమ్మరం
ఖమ్మం:
పాఠశాలల్లో క్షేత్రస్థాయి సమగ్ర వివరాల కోసం రాష్ట్ర బృందం జిల్లాలో తనిఖీలకు సిద్ధం కావడంతో..బాధ్యుల్లో బెంగ మొదలైంది. బడిలో బోధనెలా ఉంది..? అసలు సౌకర్యాలేమున్నాయి..? పిల్లల విద్యా సామర్థ్యమెంత..? ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణ కరువైందా..?ఉపాధ్యాయుల లోపముందా..? ఇలా రకరకాలుగా వివరాలు నమోదు చేయనుండడంతో ఎక్కడేతప్పు దొరుకుతుందోననే భయంతో కొందరు వణుకుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కేజీబీవీల్లో ఇక..ఎక్కడైనా తనిఖీ జరగొచ్చు..వాస్తవాలు వెలుగుచూడొచ్చు. రాష్ట్ర ప్రత్యేక బృందం ప్రస్తుతం జిల్లాకు చేరుకుంది. ఈ అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కేజీబీవీల్లో ముమ్మర తనిఖీలు చేయనున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుశాతం, భౌతిక వనరుల వినియోగం, బోధన పద్ధతులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం మొదలైన అంశాలను పరిశీలించనున్నారు. రికార్డులు సక్రమంగా నిర్వహించని కొందరు ప్రధానోపాధాయులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచడంపై దృష్టి పెట్టారు. తనిఖీలు నిష్పక్షపాతంగా సాగుతాయా..? లేక తూతూమంత్రంగా జరిపి చేతులు దులుపుకుంటారా..? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా టెట్ అర్హత, మౌలిక వసతులు, పాఠశాల నిర్వహణ కమిటీ మొదలైన అంశాలు ప్రస్తావించే అవకాశం ఉన్నందున పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ఆందోâýæన చెందుతోంది.
బోధన..‘భోజనం’పై దృష్టి
lఉపాధ్యాయుల సంఖ్య, మంజూరైన పోస్టులు, పనిచేస్తున్నవారు, హాజరైన వారు, గైర్హాజరును పరిగణనలోకి తీసుకుంటారు.
lప్రైవేట్ పాఠశాలల్లో టెట్ అర్హత సాధించిన వారు లేకుంటే చర్యలుండే అవకాశాలున్నాయి.
lవిద్యార్థుల సంఖ్య, గైర్హాజరు, అందుతున్న మధ్యాహ్న భోజనం నాణ్యతపై తనిఖీలు ఉండనున్నాయి.
lవిద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు అందాయా..? పంపిణీ, స్టాక్, రిజిష్టరులో పొందు పరిచారా అనేవి నమోదు చేయనున్నారు.
సిలబస్..సామర్థ్యం కచ్ఛితం
lపాఠశాల సంచాలకుల నుంచి చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం(3ఆర్) అమలును గుర్తించనున్నారు.
lచదవడం, రాయడం, గణితంలో చతుర్విధ ప్రక్రియలు చేయలేని వారి గుర్తింపు, వారికి ఎలా బోధించారనేవి ప్రశ్నించనున్నారు.
lప్రణాళిక ప్రకారం సిలబస్ పూర్తి, పరీక్షల నిర్వహణ, సమీక్షలు, మినిట్స్, నిరంతర సమగ్ర మూల్యంకనం(సీసీఈ) అమలు తీరును పరిశీలించనున్నారు.
lప్రాజెక్టుల తయారీ, సీసీఈ బోధన, ర్యాచరణ, పాఠ్యప్రణాళిక తయారీ, స్వీయ ప్రతిస్పందన లోపాలను గుర్తిస్తారు.
నిధులు..విధులపై గురి
lవచ్చిన నిధులెన్ని..? ఖర్చు వివరాలు..? హెచ్‌ఎం ఉపాధ్యాయులతో సమావేశాలు తెలుసుకుంటారు.
lతీర్మానాల వివరాలు, కొనుగోలు చేసిన వస్తువులు, కొనుగోలు సామాగ్రిని పరిశీలిస్తారు.
lప్రధానోపాధ్యాయుడి నాయకత్వ లక్షణాల పరిశీలన ఉంటుంది.
lసహచర ఉపాధ్యాయులతో సమన్వయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
lప్రహరీలు, అదనపు గదులు, టాయిలెట్లు, తాగునీరు, గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్, దృశ్య, శ్రవణ బోధనపరికరాల కొరతపై వివరాలు సేకరించనున్నారు.