ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గులాబి పార్టీ ఎమ్మెల్యేలకు టికెట్ల దడ మొదలైంది. కొందిరికి టికెట్లపై పెట్టుకున్న ఆశలు అవిరవుతున్నాయి. జనంలో పలుకుబడి లేమి, అవినీతి ఆరోపణలున్న ఎమ్మెల్యేలకు బైబై చెబుతోంది గులాబీ దళం. అవినీతి ఆరోపణలే ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖనాయక్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కొంపలు ముంచాయా? లైంగిక వేధింపులు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు టిక్కెట్ ను దూరం చేసిందా? లాస్ట్ ఛాన్స్ ఇవ్వండని ఎమ్మెల్యేలు పార్టీ పెద్దలు కోరుతున్నా కరుణించడం లేదా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలకు టికెట్ల గుబులుపై ప్రత్యేక కథనం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడి ఎమ్మెల్యేలపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి . అదేవిధంగా ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు బీఅర్ఎస్ షాక్ ఇస్తోంది. రాబోయే ఎన్నికలలో గెలిచే సత్తా ఉన్న ఎమ్మెల్యేల జాబితాను పార్టీ ఇప్పటికే సిద్దం చేసింది. ఈ జాబితా లో ఉన్న పేర్లను త్వరలో ప్రకటించనున్నారు. జాబితాలో నిర్మల్ నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాద్ నుండి ఎమ్మెల్యే జోగురామన్న, సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప, అసిపాబాద్ అత్రం సక్కు, చెన్నూర్ నుంచి విప్ సుమన్, మంచిర్యాల నుంచి దివాకర్ రావు, ముథోల్ నుంచి విఠల్ రెడ్డి పేర్లున్నట్లు తెలుస్తోంది. కాని జాబితాలో ఎమ్మెల్యే రేఖనాయక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పేర్లు లేవని సమాచారం.
జిల్లాలో ఈ ముగ్గురికి సీఎం కేసీఆర్ షాక్ ఇస్తున్నారని సమాచారం. దాంతో ఎమ్మెల్యే రేఖ నాయక్, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, దుర్గం చిన్నయ్య టిక్కెట్ రాదని కలవరపాటుకు గురవుతున్నారు. వీరి స్థానంలో ఖానాపూర్ లో జాన్సన్ నాయక్ , బోథ్ నుంచి మాజీ ఎంపీ నగేష్ టిక్కెట్ ఖారారైందని పార్టీలో ప్రచారం ఉంది. అదేవిధంగా బెల్లంపల్లిని సీటుని పోత్తులో సీపీఐకి కేటాయిస్తారని పార్టీలో చర్చజరుగుతోంది. ఒకవేళ పోత్తు లేకుంటే ఎంపీ నేతకాని వెంకటేష్ , మంచిర్యాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేనుగుంట ప్రవీణ్ పేరు ఖారారు చేస్తుందని సమాచారం.
ఎమ్మెల్యే రేఖా నాయక్ పై తీవ్రమైన అవినీతి అరోపణలు ఉన్నాయి. ప్రధానంగా డబుల్ బెడ్ రూమ్, దళిత బందు, సర్కార్ పనుల కేటాయింపులలో వాటాలు వసూలు చేశారని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పై అంతులేని ఆరోపణలు ఉన్నాయి. బిఆర్ ఎస్ పార్టీ నాయకులే ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు దళితబందు, దళిత బస్తీ, డబుల్ బెడ్ రూమ్ పథకాలలో వాటాలు వసూలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ కు ఫిర్యాదులు అందాయి.
వీటికితోడు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని అపవాదు ఉంది. దీనితో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వ్యతిరేకతతోపాటు పార్టీలో అసంతృప్తి ఉంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇలాంటి అంశాలతో టిక్కెట్ ఇచ్చినా గెలిచే అవకాశాలు లేవని సర్వేలలో తెలిందట. ఎమ్మెల్యే రేఖనాయక్ పై కూడా ఇదేవిధమైన వ్యతిరేకత ఉంది. టిక్కెట్ గెలిచే పరిస్థితి లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై అవినీతి ఆరోపణలు , శేజల్ పై లైంగిక వేధింపులతో ప్రజల్లో పరువు కోల్పోయారు. అందుకే టికెట్టు ఇవ్వడంలేదట.
ముచ్చట మూడోసారి పోటీ చేయాలని ముగ్గురు ఎమ్మెల్యేలు భావించారు. కానీ ఆశలు ఆవిరి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, హరీష్ రావు ద్వారా టిక్కెట్ దక్కించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. లాస్ట్ ఒక్కసారి చివరి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. ఈ ఎమ్మెల్యేల ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.
ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు హ్యాండిచ్చారా?.. కారు దిగాలనుకున్న ఆ నేతలు రూట్ మార్చారా?
Comments
Please login to add a commentAdd a comment