MLAs meeting
-
ఏం చేయాలన్నా డబ్బుల్లేవు
సాక్షి, అమరావతి : పనులు చేయడానికి డబ్బుల్లేవని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ముందుగా రోడ్ల గుంతలు పూడుద్దామని చెప్పారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఎన్డీఏ పక్ష ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వచ్చి నెల కాకుండానే అప్పుడే జగన్ విమర్శలు మొదలు పెట్టేశారన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం సరికాదని చెప్పారు. తప్పులు చేయడం, వాటిని పక్క వారిపై నెట్టేయడం జగన్‌కు అలవాటని అన్నారు.వివేకా హత్యను వేరే వాళ్ల మీదకు నెట్టే ప్రయత్నం చేశారని, వినుకొండలోనూ అదే జరుగుతోందని చెప్పారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యపై జగన్ ఏకంగా రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్నారని చెప్పారు. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ తగలబడటాన్ని అగ్నిప్రమాదంగా చెబుతున్నా, అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఘటన చూశాక పరిపాలన ఎంత పతనమైందో బయటపడిందన్నారు.శాంతిభద్రతల విషయంలో చాలా గట్టిగా ఉంటామని, ఏ పార్టీ వాళ్లనైనా సహించేది లేదని అన్నారు. తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిద్దామని, రాజకీయ కక్ష సాధింపులు వద్దని చెప్పారు. ఇసుక విషయంలో చిన్న విమర్శ కూడా రాకూడదని చెప్పారు. క్వారీల్లో ఇసుక తవ్వకం, రవాణా ఖర్చులు, సీనరేజ్ మాత్రమే వసూలు చేస్తామన్నారు. ప్రతి నెలా పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పాల్గొనాలని సూచించారు. పవన్‌కళ్యాణ్ కోరినట్లుగా డొక్కా సీతమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. చంద్రబాబు నిర్ణయాలకు సహకరిస్తాం : పవన్ జగన్‌కు ఇంకా తత్వం బోధ పడలేదని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యానించారు. గ్రూపు తగాదాకు రాజకీయ రంగు పులిమి అవాస్తవాలతో కుట్రలకు తెరలేపుతున్నారని విమర్శించారు. సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ, గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలాలని ఎమ్మెల్యేలను రెచ్చగొట్టడం ఆయన అహంకార ధోరణికి నిదర్శనమని అన్నారు. చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను, తన పార్టీ నూరు శాతం సహకరిస్తామని తెలిపారు. ఏపీకి సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకుందామని బీజేపీ నేత, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. జగన్ ఇదే ధోరణి కొనసాగిస్తే భంగపాటు తప్పదన్నారు. కూటమిలోని మూడు పారీ్టల మధ్య సమన్వయం అవసరమని అన్నారు. -
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో జగన్ భేటీ
-
బిహార్‌లో ఆసక్తికరంగా మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్
పట్నా: ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహా కూటమి నుంచి వైదొలిగి బీజేపీలో చేరి.. మళ్లీ సీఎం అవుతారని ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి బిహార్‌లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా జేడీ(యూ), ఆర్జేడీ పార్టీల్లో జరగుతున్న చర్చలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పక్క పార్టీ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకునేందుకు నితీష కుమార్ పార్టీ జేడీ(యూ) తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 10 మందితో జేడీయూ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు జేడీ(యూ) ఎమ్మెల్యేల్లో 13 మందిని లాగేందుకు ఆర్జేడీ అధినేత లాలూ సైతం వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలంతా పట్నాలో అందుబాటులో ఉండాలని లాలూ ఆదేశించారు. నితీష్ కుమార్ మహా కూటమిని మారే సమయంలో బిహార్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. శనివారం రాత్రి 7 గంటలకు పార్టీ ఎమ్మెల్యేలతో నితీష్ చర్చలు జరపనున్నారు. అయితే ఈ రాత్రికి నితీష్ సీఎంగా రాజీనామా చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ మద్దతుతో రేపు(ఆదివారం) మరోసారి బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఆదివారం తెలంగాణలో పర్యటన రద్దు చేసుకున్న కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు బిహార్ వెళ్లనున్నారు. ఆదివారం పట్నాలో బీజేపీ ఎమ్మెల్యేలతో వారు సమావేశం కానున్నారు. చదవండి: ‘ఇండియా కూటమి ఎక్కడ? అందరూ వెళ్లిపోతున్నారు’ -
అసెంబ్లీని బహిష్కరించాలని బీజేపీ నిర్ణయం
-
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం
-
బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు శనివారం ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ తరపున శాసనసభకు ఎన్నికైన 38 మంది ఎమ్మెల్యేలు తెలంగాణభవన్‌లో భేటీ అవుతున్నారు. తుంటి ఎముక చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన కేసీఆర్ ఈ భేటీకి హాజరయ్యే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేల భేటీకి అధ్యక్షత వహిస్తారు. కేసీఆర్‌ను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వీలుగా ఈ భేటీలో ప్రవేశపెట్టే తీర్మానాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆమోదిస్తారు. శాసనసభాపక్ష నేత ఎన్నిక అనంతరం పార్టీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ ఆల్పాహారం చేస్తారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రత్యేక వాహనంలో అసెంబ్లీ ప్రాంగణం ఎదుట ఉన్న గన్‌పార్కుకు చేరుకొని తెలంగాణ అమరుల స్తూపానికి నివాళి అర్పిస్తారు. ఉదయం 11 గంటలకు ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన ప్రారంభమయ్యే తెలంగాణ మూడో శాసనసభ తొలి విడత సమావేశాలకు బీఆర్ఎస్ సభ్యులు హాజరవుతారు. ప్రొటెం స్పీకర్ సమక్షంలో నిబంధనలకు అనుగుణంగా ఎమ్మెల్యేలుగా బీఆర్ఎస్ తరపున ఎన్నికైన నేతలు ప్రమాణ స్వీకారం చేస్తారు. విపక్ష నేతగా ఉండేందుకు కేసీఆర్ మొగ్గు శాసనసభలో 119 మంది సభ్యులకుగాను బీఆర్ఎస్ తర పున 39 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ అవతరించిన నేపథ్యంలో పార్టీ శాసనసభాపక్ష నేతకు కేబినెట్ హోదా దక్కుతుంది. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో విపక్ష నేతగా ఉండేందుకు మొగ్గు చూపినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే కేటీఆర్ లేదా మాజీ మంత్రి హరీశ్‌రావు బీఆర్ఎస్ శాసనసభా పక్షనేతగా వ్యవహరిస్తారనే ప్రచారం జరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్, శాసనసభా పక్ష నేతగా హరీశ్‌రావుకు చెరో పదవి అప్పగిస్తారని బీఆర్ఎస్లో చర్చ కూడా జరిగింది. తాము నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని ప్రకటించిన బీఆర్ఎస్ తరపున కేసీఆర్ శాసనసభా పక్ష నేతగా వ్యవహరిస్తే అటు పారీ్టకి, ఇటు ప్రజలకు మేలు జరుగుతుందనే భావన వ్యక్తమైనట్టు సమాచారం. -
లిక్కర్ కేసులో ఈడీ నోటీసులు.. పార్టీ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ భేటీ
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గతవారం సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందూ. ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ ఆప్ ఎమ్మెల్యేలతో సమావేశం అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. లిక్కర్ కేసులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై వివరాలు రాబట్టేందుకు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్టోబర్ 30న నోటీసులు జారీ చేసింది. నవంబర్ 2న విచారణకు హాజరు కావాలని కోరగా.. ఆయన గైర్హాజరయ్యారు. ఈడీ ఆఫీస్‌కు రాకుండా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ మేరకు ఈడీ నోటీసులపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. తనకు పంపిన ఈ సమన్లు పూర్తిగా చట్టవిరుద్దమని ఆరోపించారు. కక్షపూరితం, రాజకీయ ప్రేరేపితమని మండిపడ్డారు. బీజేపీ చేస్తున్న తీవ్ర ఒత్తిళ్లతో ఈడీ నోటీసులు పంపించిందని విమర్శించారు. నోటీసులను ఈవీ వెనక్కి తీసుకోవాలని అన్నారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నన్ను అడ్డుకునేందుకు ఇప్పుడీ సమన్లు పంపిందని దుయ్యబట్టారు. ఇక ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌లను ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో కేజ్రీవాల్‌ను సీబీఐ దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించింది. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల ముందు విపక్ష ‘ఇండియా కూటమి’ నాయకులను బీజేపీ లక్ష్యంగా చేసుకుందని, ఈ క్రమంలోనే ముందుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆప్ నేతలు ఇటీవల కాషాయ పార్టీపై విమర్శలు గుప్పించారు. చదవండి: ప్రమాదస్థాయిలో వాయు కాలుష్యం.. ఢిల్లీలో మళ్లీ సరి-బేసి విధానం -
పార్టీ నేతలకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం
-
ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ షాక్..?.. అవే కొంప ముంచాయా?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గులాబి పార్టీ ఎమ్మెల్యేలకు టికెట్ల దడ మొదలైంది. కొందిరికి టికెట్లపై పెట్టుకున్న ఆశలు అవిరవుతున్నాయి. జనంలో పలుకుబడి లేమి, అవినీతి ఆరోపణలున్న ఎమ్మెల్యేలకు బైబై చెబుతోంది గులాబీ దళం. అవినీతి ఆరోపణలే ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖనాయక్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కొంపలు ముంచాయా? లైంగిక వేధింపులు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు టిక్కెట్ ను దూరం చేసిందా? లాస్ట్ ఛాన్స్ ఇవ్వండని ఎమ్మెల్యేలు పార్టీ పెద్దలు కోరుతున్నా కరుణించడం లేదా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలకు టికెట్ల గుబులుపై ప్రత్యేక కథనం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడి ఎమ్మెల్యేలపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి . అదేవిధంగా ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు బీఅర్ఎస్ షాక్ ఇస్తోంది. రాబోయే ఎన్నికలలో గెలిచే సత్తా ఉన్న ఎమ్మెల్యేల జాబితాను పార్టీ ఇప్పటికే సిద్దం చేసింది. ఈ జాబితా లో ఉన్న పేర్లను త్వరలో ప్రకటించనున్నారు. జాబితాలో నిర్మల్ నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాద్ నుండి ఎమ్మెల్యే జోగురామన్న, సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప, అసిపాబాద్ అత్రం సక్కు, చెన్నూర్ నుంచి విప్ సుమన్, మంచిర్యాల నుంచి దివాకర్ రావు, ముథోల్ నుంచి విఠల్ రెడ్డి పేర్లున్నట్లు తెలుస్తోంది. కాని జాబితాలో ఎమ్మెల్యే రేఖనాయక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పేర్లు లేవని సమాచారం. జిల్లాలో ఈ ముగ్గురికి సీఎం కేసీఆర్ షాక్ ఇస్తున్నారని సమాచారం. దాంతో ఎమ్మెల్యే రేఖ నాయక్, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, దుర్గం చిన్నయ్య టిక్కెట్ రాదని కలవరపాటుకు గురవుతున్నారు. వీరి స్థానంలో ఖానాపూర్ లో జాన్సన్ నాయక్ , బోథ్ నుంచి మాజీ ఎంపీ నగేష్ టిక్కెట్ ఖారారైందని పార్టీలో ప్రచారం ఉంది. అదేవిధంగా బెల్లంపల్లిని సీటుని పోత్తులో సీపీఐకి కేటాయిస్తారని పార్టీలో చర్చజరుగుతోంది. ఒకవేళ పోత్తు లేకుంటే ఎంపీ నేతకాని వెంకటేష్ , మంచిర్యాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేనుగుంట ప్రవీణ్ పేరు ఖారారు చేస్తుందని సమాచారం. ఎమ్మెల్యే రేఖా నాయక్ పై తీవ్రమైన అవినీతి అరోపణలు ఉన్నాయి. ప్రధానంగా డబుల్ బెడ్ రూమ్, దళిత బందు, సర్కార్ పనుల కేటాయింపులలో వాటాలు వసూలు చేశారని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పై అంతులేని ఆరోపణలు ఉన్నాయి. బిఆర్ ఎస్ పార్టీ నాయకులే ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు దళితబందు, దళిత బస్తీ, డబుల్ బెడ్ రూమ్ పథకాలలో వాటాలు వసూలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ కు ఫిర్యాదులు అందాయి. వీటికితోడు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని అపవాదు ఉంది. దీనితో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వ్యతిరేకతతోపాటు పార్టీలో అసంతృప్తి ఉంది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇలాంటి అంశాలతో టిక్కెట్ ఇచ్చినా గెలిచే అవకాశాలు లేవని సర్వేలలో తెలిందట. ఎమ్మెల్యే రేఖనాయక్ పై కూడా ఇదేవిధమైన వ్యతిరేకత ఉంది. టిక్కెట్ గెలిచే పరిస్థితి లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై అవినీతి ఆరోపణలు , శేజల్ పై లైంగిక వేధింపులతో ప్రజల్లో పరువు కోల్పోయారు. అందుకే టికెట్టు ఇవ్వడంలేదట. ముచ్చట మూడోసారి పోటీ చేయాలని ముగ్గురు ఎమ్మెల్యేలు భావించారు. కానీ ఆశలు ఆవిరి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, హరీష్ రావు ద్వారా టిక్కెట్ దక్కించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. లాస్ట్ ఒక్కసారి చివరి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. ఈ ఎమ్మెల్యేల ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి. ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు హ్యాండిచ్చారా?.. కారు దిగాలనుకున్న ఆ నేతలు రూట్ మార్చారా? -
105 సీట్లు మనవే! చెప్పినట్టు పనిచేస్తే గెలుస్తం..
-
మధ్యాహ్నం బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం
-
మిమ్మల్ని మళ్లీ గెలిపించాలనే ఈ కార్యక్రమాలన్నీ: సీఎం జగన్
రాజకీయాలంటే.. మానవ సంబంధాలు నేను నాన్న దగ్గర నుంచి నేర్చుకున్న అంశం ఏమిటంటే.. రాజకీయాలంటే మానవ సంబంధాలు! ఏ ఒక్క ఎమ్మెల్యేనూ పోగొట్టుకోవాలని నేను అనుకోను. ఏ ఒక్క కార్యకర్తనూ పోగొట్టుకోవాలని కూడా అనుకోను. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 మాటలను నమ్మవద్దు. మీతో పని చేయించి.. మిమ్మల్ని మళ్లీ గెలిపించాలనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ అడుగులన్నీ అందుకోసమే. మీరంతా మళ్లీ గెలిచి రావాలనే ఇవన్నీ చేస్తున్నాం. మనం సరైన పద్ధతుల్లో పనిచేయకపోతే, ప్రజల్లో మీ గ్రాఫ్ సరిగా లేకపోతే పార్టీకి, కేడర్‌కు నష్టం. మనం అధికారంలో లేకపోతే కోట్ల మంది ప్రజలు నష్టపోతారు. అందుకే మన గ్రాఫ్ పెంచుకోవాలి. గ్రాఫ్ పెరగాలంటే ఎన్నికలు సంవత్సరంలో ఉన్నాయని గుర్తు పెట్టుకోవాలి. అందుకే గడప గడపకూ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోండి. అది సక్రమంగా నిర్వహిస్తే కచ్చితంగా గ్రాఫ్ పెరుగుతుంది. – సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: ‘మనం మారీచులతో యుద్ధం చేస్తున్నాం. చంద్రబాబు అనే వ్యక్తి ఒక ముసుగులో గజదొంగల ముఠా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, పవన్‌కళ్యాణ్ కలసి చేస్తున్న దోచుకో.. పంచుకో.. తినుకో.. కార్యక్రమానికి మనం అధికారంలోకి వచ్చాక తెరపడింది. మళ్లీ చంద్రబాబును అధికార పీఠంపై కూర్చోబెట్టి దోపిడీని కొనసాగించేందుకు ప్రభుత్వంపై ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భ్రమ కల్పించేలా గజదొంగల ముఠా దుష్ఫ్రచారం చేస్తోంది. రానున్న రోజుల్లో ఇది మరింత ఎక్కువ చేస్తారు. దాన్ని ఎక్కడికక్కడ సమర్థంగా తిప్పి కొట్టాలి’ అని మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ప్రాంతీయ సమన్వయకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గడప గడపకూ కార్యక్రమం సగం సచివాలయాల పరిధిలో ఇప్పటికే పూర్తైందని, మిగతా సగం సచివాలయాల పరిధిలో ఆగస్టులోగా పూర్తి చేయాలని నిర్దేశించారు. నెలకు 25 రోజుల చొప్పున సచివాలయాల్లో పర్యటించాలన్నారు. ఇది పూర్తయితే సెప్టెంబరు నుంచి ఇతర కార్యక్రమాలకు శ్రీకారం చుడదామని తెలిపారు. సంక్షేమ క్యాలెండర్ ప్రకారం వివిధ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో బటన్ నొక్కి డబ్బులు జమ చేసే బాధ్యతను తాను నిర్వర్తిస్తానని, గడప గడపకూ వెళ్లి చేసిన మంచిని వివరిస్తూ ప్రజలతో మమేకమై ఆశీర్వాదాలు పొందే బాధ్యతను నేతలు సక్రమంగా నెరవేర్చాలని సూచించారు. నేను, మీరూ ఏకమై సమన్వయంతో, సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తే 175కు 175 శాసనసభ స్థానాల్లోనూ విజయం సాధించడం ఖాయమని నేతల్లో ఉత్సాహాన్ని ఉరకలెత్తించారు. సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే... రెట్టించిన వేగంతో గడప గడపకూ.. ఫిబ్రవరి 13న గడప గడపకూ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ మార్చి 16 వరకూ కొనసాగింది. ఆ తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఆసరా కార్యక్రమాలు మొదలయ్యాయి. దీనివల్ల గడప గడపకూ కార్యక్రమానికి కాస్త గ్యాప్ వచ్చింది. మళ్లీ ఆ కార్యక్రమాన్ని ఉద్ధృతంగా చేపట్టాలి. గేర్ మార్చి రెట్టించిన వేగంతో చేయాలి. అందుకే ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నేరుగా రూ.2 లక్షల కోట్లు జమ.. దేవుడి దయ వల్ల రాష్ట్ర చరిత్రే కాదు.. దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా నాలుగేళ్లు గడవక ముందే రూ.2 లక్షల కోట్ల పైచిలుకు సొమ్మును ఎలాంటి వివక్షకు తావులేకుండా, లంచాలకు అవకాశం లేకుండా అక్కచెల్లెమ్మల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశాం. పట్టణ ప్రాంతాల్లో 84 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 92 శాతం కుటుంబాలకు సగటున 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా మంచి చేయగలిగాం. ఆ ఇళ్లల్లో అక్కచెల్లెమ్మలకు మేలు జరిగింది. ఇలా అండగా నిలబడ్డ పరిస్థితి గతంలో ఎప్పుడూ జరగలేదు. అర్హులను పారదర్శకంగా గుర్తించి ప్రయోజనం చేకూర్చాం. పేదలు మిస్‌కాకుండా వెరిఫికేషన్ చేసి మరీ సంతృప్త స్థాయిలో పథకాలు అందిస్తున్నాం. పరిమితి పెంపుతో మరింత ప్రయోజనం మనం అధికారంలోకి రాక ముందు గ్రామీణ ప్రాంతాల్లో రూ.5 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.6 వేలు మాత్రమే నెలకు ఆదాయ పరిమితిగా ఉన్న బీపీఎల్ నిర్వచనాన్ని మారుస్తూ గ్రామీణ ప్రాంతాల్లో పరిమితిని రూ.10 వేలకు, అర్బన్ ప్రాంతాల్లో రూ.12 వేలకు పెంచి పథకాలు అందిస్తున్నాం. తద్వారా 87 శాతం ఇళ్లకు డీబీటీ ద్వారా బటన్ నొక్కి నేరుగా మేలు చేస్తున్నాం. ఇది ఏ రకంగా రిప్రజెంటేటివ్ శాంపిల్? ఈమధ్య కాలంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, చంద్రబాబును చూసి కొన్ని మాటలు మాట్లాడుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్పగా గెలిచామని మాటలు చెబుతున్నారు. వాస్తవాలు అందరికీ తెలియాలి. 21 స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే 17 స్థానాల్లో మనం గెలిచాం. ఒక ఎమ్మెల్సీ స్థానం అంటే 34 – 39 నియోజకవర్గాల పరిధి ఉంటుంది. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో కనీసం 2.5 లక్షల మంది ఓటర్లు ఉంటారు. అంటే 80 లక్షలకుపైగా ఓట్ల పరిధిలో ఎమ్మెల్సీ స్థానం ఉంటుంది. ఆ పరిధిలో 87 శాతం అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా బటన్ నొక్కి సంక్షేమ పథకాలతో మంచి చేస్తున్నాం. 80 లక్షల కుటుంబాల్లో కేవలం రెండున్నర లక్షల మంది మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదు చేసుకున్నారు. మనం మంచి చేసిన 87 శాతం మందిలో ఎమ్మెల్సీ ఓటర్లు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. దాదాపు రెండున్నర లక్షల మంది ఎమ్మెల్సీ ఓటర్లలో 80 శాతం మంది డీబీటీలో లేనివారే ఉన్నారు. కేవలం 20 శాతం మంది మాత్రమే డీబీటీలో ఉన్నవారు కనిపిస్తున్నారు. మరి అలాంటప్పుడు ఇది ఏ రకంగా రిప్రజెంటేటివ్ శాంపిల్ అవుతుంది? అంతా ఏకమైనా మొదటి ప్రాధాన్యతతో నెగ్గలేకపోయారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరొక అంశం.. ఒకటో ప్రాధాన్యం, రెండో ప్రాధాన్యం, మూడో ప్రాధాన్యతలకు సంబంధించినది. మిగిలిన పార్టీలంతా కలిశాయి. మనం ఒంటరిగా పోటీ చేశాం. అయినప్పటికీ కూడా టీడీపీ మొదటి ప్రాధాన్యతతో గెలవలేకపోయింది. రెండో ప్రాధాన్యత ఓటు బదిలీ కావడం, ఇంతమంది ఏకం కావడం వల్ల జరిగిన అంశం ఏ రకంగానూ ప్రభావం చూపలేదు. ఒక వాపును చూపించి.. అది బలం అన్నట్లుగా చంద్రబాబు ప్రొజెక్ట్ చేసుకోవడం, దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంత పాడటాన్ని చూస్తున్నాం. లిస్టు కూడా తయారు చేస్తున్నారంటూ... రాబోయే రోజుల్లో ఇంకా రూమర్లు ప్రచారం చేస్తారు. టికెట్లు ఇవ్వని 50 – 60 మంది ఎమ్మెల్యేల లిస్టు కూడా తయారు చేస్తున్నారని చెబుతారు. ఆ జాబితాలో ఇంతమంది వెళ్లిపోతున్నారంటూ ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఈనాడు అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకంటే దారుణమైన ఎమ్మెల్యే ఉండరని మన పార్టీకి చెందిన ప్రతి ఎమ్మెల్యేపైనా ప్రచారం చేస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్ చేసి మరీ విష ప్రచారం చేస్తున్నారు. వాటిని మనం తిప్పికొట్టే కార్యక్రమం చేయాలి. ప్రతి ఊరులో, ప్రతి నియోజకవర్గంలోనూ దీన్ని గట్టిగా చెప్పాలి. లబ్ధిదారులే మన ప్రచారకర్తలు.. సంవత్సరంలో ఎన్నికలు జరగనున్నాయి. మన క్యాడర్ అత్యంత క్రియాశీలకంగా ఉండాలి. సోషల్ మీడియాను బాగా వినియోగించుకోవాలి. క్యాంపెయిన్‌ను ఉద్ధృతం చేసుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో గృహ సారథులు, సచివాలయ కన్వీనర్ల నియామక వ్యవస్థను పూర్తి చేసుకోవాలి. ప్రతి లబ్ధిదారుడిని మన ప్రచారకర్తగా తయారు చేసుకోవాలి. ప్రతి లబ్ధిదారుడు వారికి జరిగిన మంచిని నలుగురితో పంచుకునేలా ప్రోత్సహించాలి. సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులను మమేకం చేయాలి. వారంతా కలసి ప్రతి ఇంటికీ మన ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతి కుటుంబానికీ తీసుకెళ్లాలి. ఇది మీరు కచ్చితంగా చేయాలి. నెలకు 25 రోజులు గడప గడపకూ.. దాదాపు 15 వేల సచివాలయాలు ఉండగా సగం సచివాలయాల పరిధిలో గడప గడపకూ కార్యక్రమం పూర్తయింది. మిగిలిన సగం కూడా వచ్చే 5 నెలల్లో అంటే ఆగస్టు నాటికి పూర్తి చేయాలి. నెలకు 9 సచివాలయాలను పూర్తి చేయాలి. నెలకు 25 రోజుల చొప్పున సచివాలయాల్లో తిరగాలి. ఇది పూర్తయితే సెప్టెంబరు నుంచి ఇతర కార్యక్రమాలకు శ్రీకారం చుడదాం. 7న ‘జగనన్నే మన భవిష్యత్తు’ ప్రారంభం.. ‘జగనన్నే మన భవిష్యత్తు’ కార్యక్రమాన్ని ఏప్రిల్ 7వతేదీన ప్రారంభిస్తున్నాం. ఇది ఏప్రిల్ 20 వరకు జరుగుతుంది. సచివాలయాల కన్వీనర్, గృహ సారథులను ఏకం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. గ్రామ స్థాయిలో మన వ్యవస్ధను ఏకం చేసి ప్రతి ఇంటికి పంపుతున్నాం. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లేలా ఇది పక్కాగా జరగాలి. 13న ‘జగనన్నకు చెబుదాం’... వ్యక్తిగత సమస్యలను పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డు స్ప్లిట్ కాకపోవడం లాంటి సమస్యలు గ్రామాల్లో ఒకటి అరా ఉంటే వాటిని కూడా మిస్ కాకూడదని ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ నెల 13న దీన్ని చేపడుతున్నాం. ఎవరికి సమస్య ఉన్నా నేరుగా నాకే ఫోన్ చేయవచ్చు. వాటిని పరిష్కరిస్తాం. -
ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు
-
సీఎం జగన్ కీలక సమావేశం..ప్రధాన లక్ష్యం అదేనా ?
-
CM Jagan: రెట్టించిన స్పీడ్‌తో పనిచేయాలి
సాక్షి, తాడేపల్లి: గడప గడపకు మన ప్రభుత్వం సమీక్షలో భాగంగా.. నేడు(సోమవారం) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ ఇన్‌ఛార్జిలు హాజరయ్యారు. గడపగడపకూ మన ప్రభుత్వంతో పాటు గృహసారథుల అంశాలపై ఈ సమావేశంలో సీఎం జగన్, పార్టీ శ్రేణులతో చర్చించారు. ఈ సమావేశంలో సీఎం జగన్ ఏమన్నారంటే.. ఫిబ్రవరి 13న గడపగడపకూ కార్యక్రమం మీద రివ్యూ చేశాం దాని తర్వాత కార్యక్రమానికి కాస్త గ్యాప్ వచ్చింది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా గ్యాప్ వచ్చింది మార్చి 16వరకూ కోడ్ కొనసాగింది తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగాయి తర్వాత ఆసరా కార్యక్రమాలు మొదలయ్యాయి దీనివల్ల గడపగడపకూ కాస్త గ్యాప్ వచ్చిందిమళ్లీ గడపగడపకూ కార్యక్రమానికి ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లాలి గేర్ మార్చి రెట్టించిన స్పీడ్‌తో కార్యక్రమం చేయాలి రాష్ట్ర చరిత్రే కాదు… దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా నాలుగు సంవత్సరాలు గడవక ముందే.. రూ.2లక్షల కోట్ల పైచిలుకు ఎలాంటి వివక్ష, లంచాలకు తావులేకుండా మన అక్క చెల్లెమ్మల కుటుంబాల అక్కౌంట్లో పడింది అర్బన్ ప్రాంతంలో 84శాతం, రూరల్ ప్రాంతంలో 92 శాతం కుటుంబాలు, యావరేజీన 87శాతం కుటుంబాలకు మంచి చేయగలిగాం ఇలా అండగా నిలబడ్డ పరిస్థితి ఎప్పుడూ జరగలేదు 87శాతం కుటుంబాలను గమనించినట్టైతే… అర్హులుగా ఉన్నవారిని చాలా పారదర్శకంగా గుర్తించి అమలు చేశాం పేదవాడు మిస్‌కాకుండా వెరిఫికేషన్ చేసిన మరీ… వారికి పథకాలు అందిస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేల లోపు ఉన్న కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేల లోపు ఉన్న కుటుంబాల్లో వారిని అర్హులుగా గుర్తించి పథకాలు ఇచ్చాం: బీపీఎల్ నిర్వచనాన్ని మారుస్తూ… గ్రామీణ ప్రాంతాల్లో పరిమితిని రూ.10వేలకు, అర్బన్ ప్రాంతాల్లో రూ.12వేలకు పెంచి పథకాలు. ఇచ్చాం ఇలా చేస్తే 87శాతం ఇళ్లకు నేరుగా డీబీటీ ద్వారా బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తున్నాం ఈ మధ్యకాలంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-౫, చంద్రబాబును చూసినా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్పగా గెలిచామని ఏదో మాటలు చెప్తున్నారు 21 స్థానాల్లో ఎన్నికలు గెలిస్తే.. 17 స్థానాల్లో మనం గెలిచాం మనం మారీచులతో యుద్ధంచేస్తున్నాం ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే ప్రచారం చేస్తున్నారు కొన్ని వాస్తవాలు అందరికీ తెలియాలి: ఒక్క ఎమ్మెల్సీ స్థానం అంటే 34 నుంచి 39 నియోజకవర్గాల పరిధి ఒక్కో అసెంబ్లీ సెగ్మెంటులో కనీసం 2.5 లక్షల మంది ఉంటారు అంటే ఎమ్మెల్సీ స్థానం పరిధి.. దాదాపు 80 లక్షల ఓట్ల పరిధి ఉంటుంది ఆ పరిధిలో 87శాతం అంటే.. అక్క చెల్లెమ్మల కుటుంబాలు, మన కుటుంబాలు ఉన్నాయి అలాంటి 80 లక్షల కుటుంబాల్లో, కేవలం రెండున్నర లక్షలు మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదుచేసుకున్నారు వీళ్లంతా రకరకాల యూనియన్లకు చెందినవారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లైన ఈ రెండున్నర లక్షల మంది ఓటర్లలో దాదాపు చాలా శాతం మంది డీబీటీలో లేనివారు కేవలం 20శాతం మంది మాత్రమే డీబీటీలో ఉన్నవారు ఇది ఏరకంగా రిప్రజెంటేటివ్ శాంపిల్ అవుతుంది రాష్ట్రంలో ఎలక్టోరల్ రిప్రజెంటేటివ్ శాంపిల్ ఏదైతే.. ఉందో.. అది ఇది కాదు ఒకటో ప్రాధాన్యం.. రెండో ప్రాధాన్యం… మూడో ప్రాధాన్యాలు ఉన్నాయి మిగిలిన పార్టీ అందరూ కలిశారు.. మనం ఒక్కరిమే అయినప్పటికీ కూడా… తెలుగుదేశం పార్టీ మొదటి ప్రాధాన్యతతో గెలిచింది లేదు ఇంతమంది ఏకం కావడంవల్ల, రెండో ప్రాధాన్యత ఓటు వారికి ఉందికాబట్టి.. జరిగింది అయినా కూడా ఒక వాపును చూపించి.. అది బలం అని చూపిస్తున్నారు దానికితోడు ఈనాడు రాయడం, ఆంధ్రజ్యోతి రాయడం, టీవీ-౫ చూపడం రాబోయే రోజుల్లో ఇంకా రూమర్లు ప్రచారం చేస్తారు 60 మందికి టిక్కెట్లు ఇవ్వని లిస్టు కూడా తయారుచేస్తున్నారని చెప్తారు ఇదే పనిగా పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు ఇంతకంటే.. దుర్మార్గమైన ఎమ్మెల్యేలు ఉండరని కూడా ప్రచారం చేస్తున్నారు ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్ చేసి మరీ విష ప్రచారంచేస్తున్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటాయి అందుకే అంటున్నా.. మనం మారీచులతో యుద్ధంచేస్తున్నాం వారంతా గజ దొంగల ముఠా దోచుకో.. పంచుకో.. తినుకో.. కార్యక్రమానికి మనం వచ్చాక గండిపడింది అందుకే గజదొంగల ముఠా ఇవన్నీ చేస్తున్నాయి రూమర్లు వస్తున్నాయనే మాట మనకు తెలిసి ఉండాలి వాటిని తిప్పికొట్టాలి సంవత్సరంలో మనం ఎన్నికలకు వెళ్తున్నాం కేడర్ అత్యంత క్రియాశీలకంగా ఉండాలి సోషల్ మీడియాను బాగా వినియోగించుకోవాలి సోషల్ మీడియాలో క్యాంపెయిన్‌ను ఉద్ధృతం చేసుకోవాలి గృహసారథులను, సచివాలయ కన్వీనర్లు.. వ్యవస్థను పూర్తిచేసుకోవాలి ప్రతి లబ్ధిదారును మన ప్రచారకర్తగా తయారుచేసుకోవాలి వాలంటీర్లను, గృహసారథులను మమేకం చేయాలి వీళ్లంతా ఒక్కటై.. ప్రతి ఇంటికీ మన ప్రభుత్వంచేస్తున్నమంచిని ప్రతికుటుంబానికీ తీసుకెళ్లాలి దాదాపుగా ఇప్పటికి సగం సచివాలయాల్లో గడపగడపకూ పూర్తిచేశాం ఈ సగం వచ్చే 5 నెలల్లో, అంటే ఆగస్టు నాటికి పూర్తిచేయాలి నెలకు 9 సచివాలయాలను పూర్తిచేయాలి నెలకు 25 రోజుల చొప్పున సచివాలయాల్లో తిరగాలి సెప్టెంబరు నుంచి వేరే కార్యక్రమాలకు శ్రీకారంచుడదాం ఒకవైపున గడపగడపకూ జరుగుతుంది… రెండోవైపున సచివాలయ కన్వీనర్లు, గృహసారధులతో మమేకం చేసే కార్యక్రమాలు ఉంటాయి వీటికి పార్టీ పరంగా కార్యాచరణ చేస్తున్నాం రాజకీయాల్లో నేను నాన్న దగ్గరనుంచి నేర్చుకున్న అంశం ఏంటంటే.. రాజకీయం అంటే.. మానవ సంబంధాలు ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోవాలని నేను అనుకోను ఒక్క కార్యకర్తనూ కూడా పోగొట్టుకోవాలని అనుకోను మీతో పనిచేయించి.. మిమ్మల్ని మళ్లీ గెలిపించాలనే.. ఈ కార్యక్రమాలు ఈ అడుగులన్నీ కూడా దానికోసమే కొన్ని కోట్లమంది మన మీద ఆధారపడి ఉన్నాకు ప్రతి నియోజకవర్గంలో లక్షలమంది మనపై ఆధారపడి ఉన్నారు ప్రజల్లో మీ గ్రాఫ్ సరిగ్గాలేకపోతే పార్టీకి, కేడర్‌కు నష్టం మన అధికారంలో లేకపోతే కోట్ల మంది ప్రజలు నష్టపోతారు అందుకే మన గ్రాఫ్ పెంచుకోవాలి ఎన్నికలు సంవత్సరంలో ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి అందుకే గడపగడపకూ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోండి ఈ కార్యక్రమం జరిగితే.. కచ్చితంగా గ్రాఫ్ పెరుగుతుంది నేను చేయాల్సింది.. నేను చేయాలి మీరు చేయాల్సిది మీరు చేయాలి ఈరెండూ సంయుక్తంగా, సమర్థవంతంగా జరిగితే… అప్పుడు కచ్చితంగా 175కి 175 గెలుస్తాం ఇదీ చదవండి: బోధనాస్పత్రుల బలోపేతం -
పార్టీ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేసిన సీఎం వైఎస్ జగన్
-
ఎమ్మెల్యే మైనంపల్లి ఇంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం
-
మంత్రి మల్లారెడ్డిపై మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం
-
మంత్రి మల్లారెడ్డిపై ఆ నలుగురి ఆగ్రహం!
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ ఎమ్మెల్యే, తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని నలుగురు ఎమ్మెల్యేలు ఈ మేరకు సోమవారం భేటీ అయినట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి వైఖరిపై రగిలిపోతున్నారు ఆ నలుగురు.. విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని యత్నిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, జిల్లా పదవులన్నీ తీసుకెళ్లిపోయారని ఆ నలుగురు మండిపడుతున్నారు. ఈ మేరకు ఉప్పల్, కూకట్పల్లి, శేరిలింగం పల్లి ఎమ్మెల్యేలు.. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో భేటీ అయ్యారు. మల్లారెడ్డిపై అసమ్మతితోనే ఈ భేటీ నిర్వహించినట్లు స్పష్టమవుతోంది. నామినేటెడ్ పోస్టులు మల్లారెడ్డికి సంబంధించిన అనుచరణ గణానికే ఇప్పించుకుంటున్నారని, మేడ్చల్ మార్కెటింగ్ కమిటీ పోస్టుపై విషయంలో వాళ్లంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని పోస్టులు ఒకే నియోజకవర్గానికి వెళ్లిపోయాయి. జిల్లా పదవులన్నీ మంత్రి తీసుకెళ్లారు. మంత్రి మల్లారెడ్డి మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు ఆరోపించారు. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని ఈ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ప్రభుత్వం, పార్టీ తీరుపై కాకుండా.. కేవలం మంత్రి మల్లారెడ్డి అంశంలోనే వాళ్లంతా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రి మల్లారెడ్డి జోగులాంబ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సొంత పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తిపై ఆయన స్పందించాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో మల్లారెడ్డి అంశంపై పంచాయితీని మంత్రి కేటీఆర్ దగ్గరకు తీసుకెళ్లాలని ఆ నలుగురు భావిస్తున్నారు. -
కేజ్రీవాల్‌కు షాక్.. అజ్ఞాతంలోకి పలువురు ఆప్ ఎమ్మెల్యేలు?
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలదొసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణల మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లారన్న వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశానికి ముందు పలువురు ఎమ్మెల్యేల ఫోన్లు కలవటం లేదని, వారితో మాట్లాడలేకపోయినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో మొత్తం మంది ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరవుతారని ధీమా వ్యక్తం చేశారు ఆప్ నేత దిలీప్ పాండే. అయితే, 40 మంది ఎమ్మెల్యేలను లాగేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ‘ఎమ్మెల్యేలందరితో టచ్‌లో ఉన్నాం. బుధవారమే అందరికి సందేశాలు పంపించాం. ఫోన్లు కలవని వారికి సైతం సందేశాలు చేరుతాయి. మీటింగ్‌కు ఎమ్మెల్యేలంతా హాజరవుతారు. 40 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేపట్టింది’ అని పేర్కొన్నారు దిలీప్ పాండే. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, పలువురు ఎమ్మెల్యేల ఆచూకీ లభించకపోవటంతో ఆప్ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. మరోవైపు.. బీజేపీలో చేరే ఎమ్మెల్యేలకు రూ.20 కోట్లు ఇచ్చేందుకు కాషాయపార్టీ ఆఫర్ చేసిందని బుధవారం ఆరోపించారు సౌరభ్ భరద్వాజ్. అంతకు ముందు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సైతం బీజేపీపై ఆరోపణలు చేశారు. తనపై ఉన్న కేసులను ఎత్తివేయాలంటే బీజేపీలో చేరాలంటూ ఆఫర్ ఇచ్చారని, అందుకు తాను అంగీకరించలేదని పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పలు వేదికల మీదుగా ఆరోపణలు చేశారు. ఇదీ చదవండి: మా ప్రభుత్వాన్ని కూల్చే యత్నం -
ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల్లోనే ఉండాలని ఆదేశం
-
రాజకీయ ప్రక్షాళన చేద్దాం
సాక్షి, అమరావతి : రాష్ట్ర రాజకీయాలను ఎప్పుడూ ఎవరూ చూడని విధంగా ప్రక్షాళన చేద్దామని, ఇందుకు మీ అందరి సహాయ సహకారాలు, తోడు కావాలని కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్తగా ఎన్నికైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు. మనపై నమ్మకం, విశ్వాసంతో ప్రజలు గెలిపించారని.. ఇంత గొప్ప బాధ్యతను మన భుజస్కందాలపై మోపిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. శనివారం విజయవాడ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన వైఎస్సార్ ఎల్పీ (శాసనసభాపక్షం) సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడారు. ప్రతి గ్రామంలో, ప్రతి కార్యకర్తతో సహా నాయకులంతా తోడుగా ఉండటం వల్లే మన పార్టీకి ఇంత గొప్ప గెలుపు సాధ్యమైందని అన్నారు. ఆరు నెలలు తిరిగే సరికి మంచి ముఖ్యమంత్రి అనిపించుకునేలా పరిపాలన సాగిస్తానని పునరుద్ఘాటించారు. శాసనసభాపక్షం నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పార్టీ ఎమ్మెల్యేలందరికీ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు విశ్వసనీయతకు ఓట్లేశారు ప్రజలు వైఎస్సార్సీపీపై నమ్మకం, విశ్వాసం పెట్టుకున్నారని.. విశ్వసనీయత అనే పదానికి ఓట్లేశారని జగన్ అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలను ఒకేసారి చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఐదేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య ఓట్ల తేడా ఒక్క శాతం మాత్రమేనని, ఆ ఒక్క శాతం తేడా మనల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిందన్నారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అరాచకాలు, అన్యాయాలు చాలా చూశామని.. వీటికి వ్యతిరేకంగా ధర్నాలు, నిరాహార దీక్షలు చేశామని, ఎన్నో కేసులు పెట్టించుకున్నామని జగన్ గుర్తు చేశారు. ప్రజల కష్టాలు తెలుసుకుని, వారికి భరోసా ఇచ్చేందుకు రాష్ట్రంలో తాను 3,646 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశానని చెప్పారు. గడచిన తొమ్మిదేళ్ల కాలంలో ప్రజలకు ప్రతి అడుగులో, ప్రతి నిమిషంలో ఎప్పుడు, ఎక్కడ ఏ కష్టం వచ్చినా.. అక్కడ వైఎస్సార్సీపీ కనిపించిందన్నారు. ఏ సమస్య వచ్చినా జగన్ అక్కడకు వెళ్లి పోరాటం చేశారన్నారు. మనం చేసిన ప్రతి కార్యక్రమం ప్రజల అభిమానాన్ని, వారి విశ్వాసాన్ని చూరగొందన్నారు. తత్ఫలితంగా ఈ రోజు అధికారంలోకి వచ్చామని చెప్పారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 151 స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు గాను 22 చోట్ల స్వీప్ చేయగలగడం, 50 శాతం ఓటింగ్ వైఎస్సార్సీపీకి రావడం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమన్నారు. అందరం మరింత బాధ్యతగా పని చేసి 2024లో ఇంతకంటే గొప్ప ఫలితం వచ్చేలా కృషి చేద్దామని, త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్ని చోట్లా స్వీప్ చేసేలా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా మన ప్రాధాన్యత వైఎస్సార్ఎల్పీ సమావేశం అనంతరం కొత్తగా ఎన్నికైన 22 మంది లోక్‌సభ ఎంపీలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ప్రత్యేక హోదా సాధనే మన ప్రాధాన్యత అని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం వద్ద గట్టి ప్రయత్నాలు చేయాలని ఆయన వారికి సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు మరో మాట చెప్పరాదన్నారు. రాజకీయ విధానాల్లో విశ్వసనీయత, స్థిరత్వం ఉండాలని సూచించారు. గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలందరికీ జగన్ అభినందనలు తెలిపారు. వైఎస్సార్ఎల్పీ నేతగా జగన్ వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం నేతగా ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉదయం 11.15 గంటలకు శాసనసభాపక్షం సమావేశం జరిగింది. కొత్తగా ఎన్నికైన 151 మంది పార్టీ ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. జగన్ సమావేశం హాలులోకి ప్రవేశించగానే ఎమ్మెల్యేలంతా లేచి నిలబడి జయహో జగన్ అంటూ నినాదాలు చేశారు. ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తొలుత పరిచయ వాక్యాలు చెబుతూ శాసనసభాపక్షం తీరును వివరించారు. పార్టీని గొప్ప మెజారిటీతో గెలిపించినందుకు ఆయన జగన్‌కు అభినందనలు తెలిపారు. చీపురుపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును శాసనసభాపక్షం నేతగా ప్రతిపాదిస్తూ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. మరో సీనియర్ నేత శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ధర్మాన ప్రసాదరావు దాన్ని బల పరిచారు. ఆ తర్వాత సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ట వీరభద్ర స్వామి, నర్సాపురం ఎమ్మెల్యే ఎం.ప్రసాదరాజు, అమలాపురం ఎమ్మెల్యే పినిపె విశ్వరూప్, నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా జగన్‌ను బల పరిచారు. సింహం సింగిల్‌గా వచ్చి గెలిచిందంటూ రోజా వ్యాఖ్యానించడంతో కరతాళ ధ్వనులు మారుమోగాయి. -
వైఎస్సార్ఎల్పీ సమావేశంలో వైఎస్ జగన్
-
ఎమ్మెల్యేలతో భేటీ.. ముందస్తుపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు త్వరలో అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తాడనే ఊహాగానాలతో రాష్ట్రంలో రాజకీయవేడి రాజుకుంది. సెప్టెంబర్ 2 న జరిగిన ప్రగతి నివేదన సభలో కేసీఆర్ ముందస్తుపై ప్రకటన చేస్తారని అంతా భావించారు. కానీ, ఆయన ఎటువంటి ప్రకటనా చేయలేదు. కాగా, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశం ముందస్తుపై జరుగుతున్న ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. అయితే, అది సాధారణ సమావేశమేననీ, ముందస్తుపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని సీఈసీ రజత్‌కుమార్ స్పష్టం చేశారు. మరోవైపు.. ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. ముందస్తు ఎన్నికలపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందని తెలుసుకునేందుకు ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం నెలకొందని ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు వెల్లడించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గ్రౌండ్ లెవల్లో పనులు ప్రారంభించాలని కేసీఆర్ సూచించినట్టు ప్రచారం ఊపందుకుంది. కాగా, మరో రెండురోజుల్లో ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం ఉంటుందని కేసీఆర్ తెలిపారు. -
అమ్మకోసం..
జయ సీఎం కాబోతున్నట్లు వార్తలు రావడంతో అన్నాడీఎంకే త్యాగాలమయంగా మారింది. పార్టీ అధినేత్రి జయలలిత పోటీ చేసేందుకు తమ అసెంబ్లీ స్థానాలను త్యాగం చేసేందుకు ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారు. చెన్నై ఆర్కేనగర్ ఎమ్మెల్యే వెట్రివేల్ ఆదివారం ఉదయం రాజీనామా చేశారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆస్తుల కేసు నుంచి జయ నిర్దోషిగా బైటపడడంతో సంబరాలు చేసుకున్న పార్టీనేతలు ఇక సీఎంగా చూడాలని తహతహలాడుతున్నారు. తాజా తీర్పుపై అప్పీలు ప్రచారంతో అన్నాడీఎంకేలో నిరాశానిస్పృహలు నెలకొన్నా ఈనెల 22వ తేదీన ఎమ్మెల్యేల సమావేశం వారిలో మళ్లీ ఉత్సాహాన్ని నింపింది. అయితే ఎమ్మెల్యేల సమావేశం వరకేనా, అదేరోజు అమ్మ సీఎం అవుతారా అనే విషయంలో పార్టీలో స్పష్టత లేదు. జయ సీఎం కావడం ఖాయమని ఎమ్మెల్యేలు గట్టి నమ్మకంతో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. జయ దోషిగా నిర్ధారణైనందున శ్రీరంగంలో ఉపఎన్నిక నిర్వహించినట్లు అసెంబ్లీ కార్యదర్శి అందులో పేర్కొన్నారు. తాజా తీర్పు వెలువడిన నేపథ్యంలో జయ నిర్దోషి అనే అంశాన్ని పొందుపరిచారు. రాజీనామాల పోటీలో ‘వెట్రి’ సీఎం అయిన ఆరునెలల్లోగా ఉప ఎన్నిక ఎదుర్కొని జయ ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. జయ కోసం నియోజకవర్గ స్థానాన్ని ఖాళీ చేసేందుకు పార్టీలో పోటీ మొదలైంది. జయ కేసులో తీర్పు వల్ల ఖాళీ అయిన స్థానంలో గెలుపొందిన వలర్మతి తాను తప్పుకుంటానని ప్రకటించారు. తిరుచందూరు డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ సైతం అమ్మకోసం రాజీనామా చేస్తానని ప్రకటించి సొంతపార్టీ బహిష్కరణకు గుైరయ్యారు. విజయకాంత్‌ను కాదని అమ్మ పంచన చేరిన ఎనిమిది మంది డీఎండీకే రెబల్ ఎమ్మెల్యేలకు తోడు మరో ఐదుగురు అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అమ్మకోసం రాజీనామాకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, చెన్నై ఆర్కేనగర్ నియోజకవర్గానికి (అన్నాడీఎంకే) ప్రాతినిథ్యం వహిస్తున్న వెట్రివేల్ ఆదివారం రాజీనామా చేశారు. అయితే ఈ విషయాన్ని సాయంత్రం వరకు గోప్యంగా ఉంచారు. వెట్రివేల్ తన రాజీనామాను స్పీకర్ ధనపాల్కు సమర్పించగా ఆయన ఆమోదించిన సమాచారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఎమ్మెల్యే రాజీనామా నిజమో విషయం వెల్లడికాక మునుపే స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ తదితరులు సచివాలయంలో ఆదివారం హడావిడిగా సమావేశం కావడంతో ఊహాగానాలు మొదలయ్యాయి. సుమారు 45 నిమిషాల పాటు చర్చలు జరిపారు. చర్చల సారాంశాన్ని సైతం వారు స్పష్టం చేయలేదు. ఈనెల 22 లేదా 23వ తేదీలో జయ సీఎం అయిన పక్షంలో జూన్ మొదటివారంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు వారు కసరత్తు చేశారని సచివాలయ సిబ్బంది సైతం దాటవేశారు. అయితే వెట్రివేల్ రాజీనామా వల్ల జయ చెన్నై నుంచే ఉప ఎన్నికల ఎదుర్కొంటారని భావించాల్సి వస్తోంది. ఆత్మాహుతి- పాదయాత్ర జయ నిర్దోషిగా విడుదల కావాలని కోరుతూ ఆరు నెలలపాటు సాగిన పూజలు, హోమాలను ఆమె సీఎం కావాలని కోరుతూ కొనసాగిస్తున్నారు. మదురై మీనాక్షి అమ్మన్ కోవిల్ నుంచి తిరుప్పరంగకున్రం వరకు ఆదివారం నాడు 8 కిలోమీటర్ల దూరం మంత్రి సెల్లూర్రాజా పాదయాత్రను నిర్వహించారు. తంజావూరు జిల్లా కుడందై సమీపం తిల్లయంపూర్లో రవిచంద్రన్ (55) ఆత్మాహుతికి పాల్పడ్డాడు. అన్నాడీఎంకే పంచాయితీ కార్యదర్శి, సహకారం సంఘం ఉపాధ్యక్షులుగా ఉన్న రవిచంద్రన్ అమ్మకు వీరాభిమాని. నిర్దోషిగా తీర్పురాగానే పెద్ద ఎత్తున సంబరం జరుపుకున్నాడు. సీఎం కావడంలో విపక్షాలు అప్పీలు పేరుతో అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేయడంతో కృంగిపోయాడు. అదే దిగాలుతో శనివారం అర్ధరాత్రి ఇంటిలోనే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. బాధతో వేసిన కేకలకు భార్యాపిల్లలు లేచి మంటలు ఆర్పి ఆసుపత్రిలో చేర్పించారు. తమిళనాడుకు అమ్మ శాశ్వత సీఎం కావాలి, తన ఇద్దరు కూతుళ్లను అమ్మ ఆశీర్వదించాలి, నా శవంపై అన్నాడీఎంకే పార్టీ పతాకాన్ని కప్పి అంత్యక్రియలు నిర్వహించాలని కోరుతూ ఆత్మాహుతికి ముందు రవిచంద్రన్ రాసిన ఉత్తరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.