AP CM YS Jagan To Hold Key Meeting With YSRCP MLAs, Live Updates - Sakshi
Sakshi News home page

CM Jagan: రెట్టించిన స్పీడ్‌తో పనిచేయాలి

Published Mon, Apr 3 2023 9:16 AM | Last Updated on Mon, Apr 3 2023 2:59 PM

AP CM YS Jagan to Hold Key Meeting With YSRCP MLAs Live Updates - Sakshi

సాక్షి, తాడేపల్లి: గడప గడపకు మన ప్రభుత్వం సమీక్షలో భాగంగా.. నేడు(సోమవారం) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ ఇన్‌ఛార్జిలు హాజరయ్యారు. గడపగడపకూ మన ప్రభుత్వంతో పాటు గృహసారథుల అంశాలపై ఈ సమావేశంలో సీఎం జగన్‌, పార్టీ శ్రేణులతో చర్చించారు.

ఈ సమావేశంలో సీఎం జగన్‌ ఏమన్నారంటే.. 

  • ఫిబ్రవరి 13న గడపగడపకూ కార్యక్రమం మీద రివ్యూ చేశాం
  • దాని తర్వాత కార్యక్రమానికి కాస్త గ్యాప్‌ వచ్చింది
  • ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా గ్యాప్‌ వచ్చింది
  • మార్చి 16వరకూ కోడ్‌  కొనసాగింది
  • తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగాయి
  • తర్వాత ఆసరా కార్యక్రమాలు మొదలయ్యాయి
  • దీనివల్ల గడపగడపకూ కాస్త గ్యాప్‌ వచ్చిందిమళ్లీ గడపగడపకూ కార్యక్రమానికి ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లాలి

  • గేర్‌ మార్చి రెట్టించిన స్పీడ్‌తో కార్యక్రమం చేయాలి
  • రాష్ట్ర చరిత్రే కాదు… దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా నాలుగు సంవత్సరాలు గడవక ముందే.. రూ.2లక్షల కోట్ల పైచిలుకు ఎలాంటి వివక్ష, లంచాలకు తావులేకుండా మన అక్క చెల్లెమ్మల కుటుంబాల అక్కౌంట్లో పడింది
  • అర్బన్‌ ప్రాంతంలో 84శాతం, రూరల్‌ ప్రాంతంలో 92 శాతం కుటుంబాలు, యావరేజీన 87శాతం కుటుంబాలకు మంచి చేయగలిగాం
  • ఇలా అండగా నిలబడ్డ పరిస్థితి ఎప్పుడూ జరగలేదు
  • 87శాతం కుటుంబాలను గమనించినట్టైతే… అర్హులుగా ఉన్నవారిని చాలా పారదర్శకంగా గుర్తించి అమలు చేశాం
  • పేదవాడు మిస్‌కాకుండా వెరిఫికేషన్‌ చేసిన మరీ… వారికి పథకాలు అందిస్తున్నాం
  • గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేల లోపు ఉన్న కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేల లోపు ఉన్న కుటుంబాల్లో వారిని అర్హులుగా గుర్తించి పథకాలు ఇచ్చాం:
  • బీపీఎల్‌ నిర్వచనాన్ని మారుస్తూ… గ్రామీణ ప్రాంతాల్లో పరిమితిని రూ.10వేలకు, అర్బన్‌ ప్రాంతాల్లో రూ.12వేలకు పెంచి పథకాలు. ఇచ్చాం

  • ఇలా చేస్తే 87శాతం ఇళ్లకు నేరుగా డీబీటీ ద్వారా బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తున్నాం
  • ఈ మధ్యకాలంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-౫, చంద్రబాబును చూసినా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్పగా గెలిచామని ఏదో మాటలు చెప్తున్నారు
  • 21 స్థానాల్లో ఎన్నికలు గెలిస్తే.. 17 స్థానాల్లో మనం గెలిచాం
  • మనం మారీచులతో యుద్ధంచేస్తున్నాం
  • ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే ప్రచారం చేస్తున్నారు
  • కొన్ని వాస్తవాలు అందరికీ తెలియాలి:
  • ఒక్క ఎమ్మెల్సీ స్థానం అంటే 34 నుంచి 39 నియోజకవర్గాల పరిధి
  • ఒక్కో అసెంబ్లీ సెగ్మెంటులో కనీసం 2.5 లక్షల మంది ఉంటారు
  • అంటే ఎమ్మెల్సీ స్థానం పరిధి.. దాదాపు 80 లక్షల ఓట్ల పరిధి ఉంటుంది
  • ఆ పరిధిలో 87శాతం అంటే.. అక్క చెల్లెమ్మల కుటుంబాలు, మన కుటుంబాలు ఉన్నాయి
  • అలాంటి 80 లక్షల కుటుంబాల్లో, కేవలం రెండున్నర లక్షలు మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదుచేసుకున్నారు
  • వీళ్లంతా రకరకాల యూనియన్లకు చెందినవారు

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లైన ఈ రెండున్నర లక్షల మంది ఓటర్లలో దాదాపు చాలా శాతం మంది డీబీటీలో లేనివారు
  • కేవలం 20శాతం మంది మాత్రమే డీబీటీలో ఉన్నవారు
  • ఇది ఏరకంగా రిప్రజెంటేటివ్‌ శాంపిల్‌ అవుతుంది
  • రాష్ట్రంలో ఎలక్టోరల్‌ రిప్రజెంటేటివ్‌ శాంపిల్‌ ఏదైతే.. ఉందో.. అది ఇది కాదు
  • ఒకటో ప్రాధాన్యం.. రెండో ప్రాధాన్యం… మూడో ప్రాధాన్యాలు ఉన్నాయి
  • మిగిలిన పార్టీ అందరూ కలిశారు.. మనం ఒక్కరిమే
  • అయినప్పటికీ కూడా… తెలుగుదేశం పార్టీ మొదటి ప్రాధాన్యతతో గెలిచింది లేదు
  • ఇంతమంది ఏకం కావడంవల్ల, రెండో ప్రాధాన్యత ఓటు వారికి ఉందికాబట్టి.. జరిగింది
  • అయినా కూడా ఒక వాపును చూపించి.. అది బలం అని చూపిస్తున్నారు
  • దానికితోడు ఈనాడు రాయడం, ఆంధ్రజ్యోతి రాయడం, టీవీ-౫ చూపడం
  • రాబోయే రోజుల్లో ఇంకా రూమర్లు ప్రచారం చేస్తారు 
  • 60 మందికి టిక్కెట్లు ఇవ్వని లిస్టు కూడా తయారుచేస్తున్నారని చెప్తారు

  • ఇదే పనిగా పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు 
  • ఇంతకంటే.. దుర్మార్గమైన ఎమ్మెల్యేలు ఉండరని కూడా ప్రచారం చేస్తున్నారు
  • ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్‌ చేసి మరీ విష ప్రచారంచేస్తున్నారు
  • రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటాయి
  • అందుకే అంటున్నా.. మనం మారీచులతో యుద్ధంచేస్తున్నాం
  • వారంతా గజ దొంగల ముఠా 
  • దోచుకో.. పంచుకో.. తినుకో.. కార్యక్రమానికి మనం వచ్చాక గండిపడింది
  • అందుకే గజదొంగల ముఠా ఇవన్నీ చేస్తున్నాయి
  • రూమర్లు వస్తున్నాయనే మాట మనకు తెలిసి ఉండాలి
  • వాటిని తిప్పికొట్టాలి
  • సంవత్సరంలో మనం ఎన్నికలకు వెళ్తున్నాం
  • కేడర్‌ అత్యంత క్రియాశీలకంగా ఉండాలి
  • సోషల్‌ మీడియాను బాగా వినియోగించుకోవాలి
  • సోషల్ మీడియాలో క్యాంపెయిన్‌ను ఉద్ధృతం చేసుకోవాలి
  • గృహసారథులను, సచివాలయ కన్వీనర్లు.. వ్యవస్థను పూర్తిచేసుకోవాలి
  • ప్రతి లబ్ధిదారును మన ప్రచారకర్తగా తయారుచేసుకోవాలి
  • వాలంటీర్లను, గృహసారథులను మమేకం చేయాలి
  • వీళ్లంతా ఒక్కటై.. ప్రతి ఇంటికీ మన ప్రభుత్వంచేస్తున్నమంచిని ప్రతికుటుంబానికీ తీసుకెళ్లాలి
  • దాదాపుగా ఇప్పటికి సగం సచివాలయాల్లో గడపగడపకూ పూర్తిచేశాం
  • ఈ సగం వచ్చే 5 నెలల్లో, అంటే ఆగస్టు నాటికి పూర్తిచేయాలి
  • నెలకు 9 సచివాలయాలను పూర్తిచేయాలి
  • నెలకు 25 రోజుల చొప్పున సచివాలయాల్లో తిరగాలి
  • సెప్టెంబరు నుంచి వేరే కార్యక్రమాలకు శ్రీకారంచుడదాం
  • ఒకవైపున గడపగడపకూ జరుగుతుంది… రెండోవైపున సచివాలయ కన్వీనర్లు, గృహసారధులతో మమేకం చేసే కార్యక్రమాలు ఉంటాయి
  • వీటికి పార్టీ పరంగా కార్యాచరణ చేస్తున్నాం

  • రాజకీయాల్లో నేను నాన్న దగ్గరనుంచి నేర్చుకున్న అంశం ఏంటంటే.. రాజకీయం అంటే.. మానవ సంబంధాలు
  • ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోవాలని నేను అనుకోను
  • ఒక్క కార్యకర్తనూ కూడా పోగొట్టుకోవాలని అనుకోను
  • మీతో పనిచేయించి.. మిమ్మల్ని మళ్లీ గెలిపించాలనే.. ఈ కార్యక్రమాలు
  • ఈ అడుగులన్నీ కూడా దానికోసమే 
  • కొన్ని కోట్లమంది మన మీద ఆధారపడి ఉన్నాకు
  • ప్రతి నియోజకవర్గంలో లక్షలమంది మనపై ఆధారపడి ఉన్నారు
  • ప్రజల్లో మీ గ్రాఫ్‌ సరిగ్గాలేకపోతే పార్టీకి, కేడర్‌కు నష్టం
  • మన అధికారంలో లేకపోతే కోట్ల మంది ప్రజలు నష్టపోతారు
  • అందుకే మన గ్రాఫ్‌ పెంచుకోవాలి
  • ఎన్నికలు సంవత్సరంలో ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి
  • అందుకే గడపగడపకూ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోండి
  • ఈ కార్యక్రమం జరిగితే.. కచ్చితంగా గ్రాఫ్‌ పెరుగుతుంది
  • నేను చేయాల్సింది.. నేను చేయాలి
  • మీరు చేయాల్సిది మీరు చేయాలి
  • ఈరెండూ సంయుక్తంగా, సమర్థవంతంగా జరిగితే… అప్పుడు కచ్చితంగా 175కి 175 గెలుస్తాం

ఇదీ చదవండి: బోధనాస్పత్రుల బలోపేతం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement