సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో అలజడి నెలకొన్నట్టు తెలుస్తోంది. తాజాగా పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హైదరాబాద్ సమీపంలోని ఓ హోటల్‌లో వీరంతా సమావేశం అయ్యారు. అయితే, ఓ కేబినెట్ మంత్రి వ్యవహరిస్తున్న తీరుపై వీరు అసంతృప్తిగా ఉన్నారనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్యేలు సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యేల సమావేశంపై కాంగ్రెస్‌లో చర్చ మొదలైంది.
ఇక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మంత్రులతో సమావేశం కానున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులతో సీఎం భేటీ అవనున్నారు. అయితే, అధికారులు లేకుండా కేవలం మంత్రులతో సీఎం భేటీ కొనసాగే అవకాశముంది. దీంతో రాజకీయపరమైన చర్చ జరుగుతుందని టాక్ వినిపిసస్తోంది. ఈ నేపథ్యంలో మేజర్ పొలిటికల్ డెసిషన్ వస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు.. సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతలు పెట్టిన పోల్ అంశం కూడా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పెట్టిన పోల్.. ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. 70 శాతం బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా, 30 శాతం కాంగ్రెస్‌కు ఫేవర్‌గా ఓట్లు పడ్డాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోల్ రావడం హస్తం నేతలకు మింగుడు పడటం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో కొందరు కాంగ్రెస్ నేతలు దిక్కులు చూస్తున్నారనే చర్చ సైతం నడుస్తోంది.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై నిన్ననే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విరుచుకుపడిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను నేను గంభీరంగా, మౌనంగా చూస్తున్నా.. నాకు కొడితే వట్టిగా కొట్టుడు అలవాటు లేదు. నాలుగు రోజులు కానీయ్ అన్నట్లు చూస్తున్నా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. కాంగ్రెస్ మెడలు వంచి భవిష్యత్తు కోసం కొట్లాడాలి. అలాగే, ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులం మనమే. తెలంగాణ హక్కుల కోసం తెగించి కొట్లాడాల్సిందే అని కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దీంతో, హస్తం నేతలు బీఆర్‌ఎస్ పంచన చేరే అవకాశాలు సైతం ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment