సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు త్వరలో అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తాడనే ఊహాగానాలతో రాష్ట్రంలో రాజకీయవేడి రాజుకుంది. సెప్టెంబర్ 2 న జరిగిన ప్రగతి నివేదన సభలో కేసీఆర్ ముందస్తుపై ప్రకటన చేస్తారని అంతా భావించారు. కానీ, ఆయన ఎటువంటి ప్రకటనా చేయలేదు. కాగా, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో బుధవారం జరిగిన అఖిలపక్ష సమావేశం ముందస్తుపై జరుగుతున్న ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. అయితే, అది సాధారణ సమావేశమేననీ, ముందస్తుపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని సీఈసీ రజత్‌కుమార్ స్పష్టం చేశారు.
మరోవైపు.. ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. ముందస్తు ఎన్నికలపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందని తెలుసుకునేందుకు ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం నెలకొందని ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు వెల్లడించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గ్రౌండ్ లెవల్‌లో పనులు ప్రారంభించాలని కేసీఆర్ సూచించినట్టు ప్రచారం ఊపందుకుంది. కాగా, మరో రెండురోజుల్లో ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం ఉంటుందని కేసీఆర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment