హైదరాబాద్: ఎల్బీనగర్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. సుధీర్ రెడ్డిపై రౌడీషీట్ తెరవాలని నియోజకవర్గం మొత్తం రాత్రికి రాత్రే పోస్టర్లు వెలిశాయి. దినపత్రికలలో సైతం పాంప్లెంట్లు పెట్టి ఇంటింటికి పంపించారు గుర్తుతెలియని వ్యక్తులు. పోస్టర్లలో ప్రముఖ వ్యక్తులపై దాడులకు పాల్పడ్డాడని పేర్కొంటూ అగంతకులు కొంతమంది ఫోటోలని కూడా వేశారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చెంపపేట్ డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి పేరుతో ఒక ఫోన్ నెంబర్ వేసి దుండగులు పోస్టర్లు అతికించారు. పోస్టర్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నాయకులు. మరొకసారి మా నాయకునిపై ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
ఇదీ చదవండి: బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి.. క్లారిటీ ఇచ్చిన వివేక్
Comments
Please login to add a commentAdd a comment