to teachers
-
శతక నీతి – సుమతిమీ కింకరులం ..
‘‘ఏరకుమీ కసుగాయలు దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మీ...’’ అంటూ బద్దెనగారు ఇంకా ... ‘‘పాఱకుమీ రణమందున మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ!... అని కూడా అంటున్నారు. పాఱకుమీ రణమందున అంటే... యుద్ధరంగంలోకి దిగినవాడు యుద్ధం చేసితీరవలసిందే... శరీరత్యాగానికి సిద్ధపడే పోతాడు. అసలు నిజానికి ఆ ఆలోచన కూడా రాదు వీరుడికి...విజయ సాధనే ఏకైక లక్ష్యం.. దాన్ని సాధించాలన్న ఆలోచన తప్ప మరొకటి ఉండదు, ఉండకూడదు కూడా. ఒకవేళ సగంలో వెనుదిరిగితే... అది అత్యంత హేయమైన చర్య. వీరుడిగా గౌరవం పొందడు. కురుక్షేత్ర సంగ్రామ సమయం లో ‘నేను అర్జునుడిని ఓడిస్తా..’ అని కర్ణుడు మాట్లాడినప్పుడల్లా.. భీష్మాచార్యుడు... ‘‘గతంలో ఎన్నిమార్లు నువ్వు అర్జునుడితో తలపడ్డావు.. ద్రౌపదీ స్వయంవరమప్పుడు అర్జునుడి చేతిలో ఓడిపోయావు, ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు బాణప్రయోగం చేస్తే పారిపోయావు, ఘోష యాత్ర జరుగుతున్నప్పుడు చిత్రసేనుడితో పోరాడలేక నువ్వు పారిపోతే అర్జునుడు వచ్చి చిత్రసేనుణ్ణి ఓడించి అందర్నీ కాపాడాడు... ఇన్నిసార్లు ఓడినవాడివి నీవిప్పుడు అర్జునుడిని ఓడిస్తానని ప్రగల్భాలు ఎందుకు పలకడం...’’ అనేవాడు. అయితే ఇప్పుడు యుద్ధాలు లేవు కానీ అంతకంటే క్లిష్టమైన జీవిత సమస్యలున్నాయి... ఏదయినా పోరాటమే... పోరాటానికి దిగేటప్పుడు దాని అంతు తేలుస్తా... అనే ఉక్కు సంకల్పంతో పోరాడాలి.. ఒకసారి పోరాడడం మొదలయిన తరువాత దాన్ని మధ్యలో వదిలేయకూడదన్నదే బద్దెన సందేశం. ఆయన ఇంకా ఏమంటున్నారు... ‘మీరకుమీ గురువలాజ్ఞ మేదిని సుమతీ’... పూర్తిగా పక్వానికి రాని పండ్లను తినడం, బంధువులను దూషించడం, ఒక పనిని మొదలుపెట్టి మధ్యలో వదిలేయడం ఎంతగా నిషిద్ధమో... అలాగే గురువుగారు చెప్పిన మాటలను పూర్తి శ్రద్ధతో ఆలకించి, ఆచరించడం కూడా అంతే అవసరం. ఆత్మబుద్ధి సుఖంచైవ... కొన్ని సంక్లిష్ట సందర్భాల్లో మనం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. అప్పుడు మన మనసు కు తట్టిన ఆలోచనలు మంచివే, వాటిని ఆచరించడానికే మనసు మొగ్గు చూపుతుంటుంది కానీ... గురుబుద్ధిర్విశేషతః... అటువంటప్పుడు సందర్భాన్నిబట్టి గురువుగారు గతంలో చెప్పిన విషయాలు ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అవి మన ఆలోచనలకంటే మెరుగ్గా ఉంటాయి కనుక వాటిని కూడా శ్రద్ధగా పరిశీలించాలి. అప్పుడు మంచి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంటుంది. అందువల్ల గురువుగారికి ఆయన మాటలకు ఎప్పుడూ ఆ గౌరవం ఇవ్వాలి. తాటక సంహారం తరువాత సుబాహుణ్ణి చంపగా, మారీచుణ్ణి దూరంగా తరిమికొట్టాడు రామచంద్రమూర్తి. రుషులందరూ వచ్చి పిల్లవాడివయినా దేవేంద్రుడిలాగా పోరాడావయ్యా... అంటూ బాగా పొగిడారు. సాధారణంగా పిల్లలను అందరిముందు పొగిడితే కించిత్ గర్వం వస్తుంది. విశ్వామిత్రుడు వారి గురువు. మరుసటిరోజు ఉదయాన రామలక్ష్మణులు చేతులు కట్టుకుని ఆయన ముందు నిలబడి ‘‘ఇమౌ స్మ ముని శార్దూల కింకరౌ సముపస్థితౌ, ఆజ్ఞాపయ మునిశ్రేష్ఠ శాసనం కరవావ కిం..’’ అన్నారు వినయ విధేయతలతో. అంటే–‘‘హే గురువర్యా! దశరథ మహారాజుగారి కుమారులు, కోసల రాజ్యానికి రాకుమారులు..అనే దృష్టితో మమ్మల్ని చూడకండి. మీ కింకరులం..అంటే మీ సేవకులం.. ఇది చేసి పెట్టు .. అని శాసించండి. అది అలా చెయ్యడం మా జీవితానికి అదృష్టంగా భావిస్తాం.. మీరలా ఆజ్ఞాపిస్తే.. మేము మీ అనుగ్రహానికి పాత్రులయినట్టు లెక్క...’’ అన్నారు. అదీ గురువులపట్ల ఉండాల్సిన గౌరవం, విధేయత... బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
తనిఖీ..వణుకు
lరాష్ట్ర పరిశీలకుల రాకతో సర్కారు బడుల్లో అప్రమత్తం lరికార్డులు సర్దుకునే పని ముమ్మరం ఖమ్మం: పాఠశాలల్లో క్షేత్రస్థాయి సమగ్ర వివరాల కోసం రాష్ట్ర బృందం జిల్లాలో తనిఖీలకు సిద్ధం కావడంతో..బాధ్యుల్లో బెంగ మొదలైంది. బడిలో బోధనెలా ఉంది..? అసలు సౌకర్యాలేమున్నాయి..? పిల్లల విద్యా సామర్థ్యమెంత..? ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణ కరువైందా..?ఉపాధ్యాయుల లోపముందా..? ఇలా రకరకాలుగా వివరాలు నమోదు చేయనుండడంతో ఎక్కడేతప్పు దొరుకుతుందోననే భయంతో కొందరు వణుకుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కేజీబీవీల్లో ఇక..ఎక్కడైనా తనిఖీ జరగొచ్చు..వాస్తవాలు వెలుగుచూడొచ్చు. రాష్ట్ర ప్రత్యేక బృందం ప్రస్తుతం జిల్లాకు చేరుకుంది. ఈ అధికారులు ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కేజీబీవీల్లో ముమ్మర తనిఖీలు చేయనున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుశాతం, భౌతిక వనరుల వినియోగం, బోధన పద్ధతులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం మొదలైన అంశాలను పరిశీలించనున్నారు. రికార్డులు సక్రమంగా నిర్వహించని కొందరు ప్రధానోపాధాయులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచడంపై దృష్టి పెట్టారు. తనిఖీలు నిష్పక్షపాతంగా సాగుతాయా..? లేక తూతూమంత్రంగా జరిపి చేతులు దులుపుకుంటారా..? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా టెట్ అర్హత, మౌలిక వసతులు, పాఠశాల నిర్వహణ కమిటీ మొదలైన అంశాలు ప్రస్తావించే అవకాశం ఉన్నందున పలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ఆందోâýæన చెందుతోంది. బోధన..‘భోజనం’పై దృష్టి lఉపాధ్యాయుల సంఖ్య, మంజూరైన పోస్టులు, పనిచేస్తున్నవారు, హాజరైన వారు, గైర్హాజరును పరిగణనలోకి తీసుకుంటారు. lప్రైవేట్ పాఠశాలల్లో టెట్ అర్హత సాధించిన వారు లేకుంటే చర్యలుండే అవకాశాలున్నాయి. lవిద్యార్థుల సంఖ్య, గైర్హాజరు, అందుతున్న మధ్యాహ్న భోజనం నాణ్యతపై తనిఖీలు ఉండనున్నాయి. lవిద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు అందాయా..? పంపిణీ, స్టాక్, రిజిష్టరులో పొందు పరిచారా అనేవి నమోదు చేయనున్నారు. సిలబస్..సామర్థ్యం కచ్ఛితం lపాఠశాల సంచాలకుల నుంచి చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం(3ఆర్) అమలును గుర్తించనున్నారు. lచదవడం, రాయడం, గణితంలో చతుర్విధ ప్రక్రియలు చేయలేని వారి గుర్తింపు, వారికి ఎలా బోధించారనేవి ప్రశ్నించనున్నారు. lప్రణాళిక ప్రకారం సిలబస్ పూర్తి, పరీక్షల నిర్వహణ, సమీక్షలు, మినిట్స్, నిరంతర సమగ్ర మూల్యంకనం(సీసీఈ) అమలు తీరును పరిశీలించనున్నారు. lప్రాజెక్టుల తయారీ, సీసీఈ బోధన, ర్యాచరణ, పాఠ్యప్రణాళిక తయారీ, స్వీయ ప్రతిస్పందన లోపాలను గుర్తిస్తారు. నిధులు..విధులపై గురి lవచ్చిన నిధులెన్ని..? ఖర్చు వివరాలు..? హెచ్ఎం ఉపాధ్యాయులతో సమావేశాలు తెలుసుకుంటారు. lతీర్మానాల వివరాలు, కొనుగోలు చేసిన వస్తువులు, కొనుగోలు సామాగ్రిని పరిశీలిస్తారు. lప్రధానోపాధ్యాయుడి నాయకత్వ లక్షణాల పరిశీలన ఉంటుంది. lసహచర ఉపాధ్యాయులతో సమన్వయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. lప్రహరీలు, అదనపు గదులు, టాయిలెట్లు, తాగునీరు, గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్, దృశ్య, శ్రవణ బోధనపరికరాల కొరతపై వివరాలు సేకరించనున్నారు.