మణిపూర్‌లో మళ్లీ కాల్పులు.. పోలీసు హెడ్‌క్వార్టర్‌పై మూకదాడి | Fresh Mob Violence In Manipur, 3 Border Force Personnel Injured - Sakshi
Sakshi News home page

మణిపూర్‌లో మళ్లీ కాల్పులు.. పోలీసు హెడ్‌క్వార్టర్‌పై మూకదాడి

Published Thu, Jan 18 2024 11:09 AM | Last Updated on Thu, Jan 18 2024 12:16 PM

Fresh Mob Violence In Manipur Border Force Personnel Injured - Sakshi

ఇంఫాల్: మణిపూర్‌లో దుండగులు రెచ్చిపోతున్నారు. గంటల వ్యవధిలోనే వేర్వేరు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మోరే జిల్లాలో పోలీసు పోస్టుపై దుండగులు కాల్పులు జరిపిన కొన్ని గంటల్లోనే తౌబాల్ జిల్లాలో పోలీసు హెడ్‌క్వార్టర్‌పై దాడి చేశారు. ఇక్కడ జరిగిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. 

తౌబల్ ఖంగాబోక్ ప్రాంతంలోని 3వ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ కాంప్లెక్స్‌ను దుండగులు మొదట లక్ష్యంగా చేసుకున్నారు. తెల్లవారు జామున పోలీసు కేంద్రంపై ఒక్కసారిగా మూకదాడికి దిగారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు దాడిని తిప్పికొట్టారు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.  

మణిపూర్‌లో మెయితీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు ప్రారంభమైన నాటి నుంచి హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో దాదాపు 175 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘర్ణణ వాతావరణం కాస్త సద్దుమణిగినప్పటికీ కాల్పుల ఘటనలు చెదురుమదురుగా జరుగుతూనే ఉన్నాయి. నిన్న మోరేలో జరిగిన దాడి నేపథ్యంలో సీఎం బీరేన్ సింగ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement