![11Militants Killed In Gunfight In Manipur](/styles/webp/s3/article_images/2024/11/11/manipur.jpg.webp?itok=ft9ZidAq)
ఇంఫాల్:మణిపూర్ జిరిబమ్‌లో సోమవారం(నవంబర్ 11) భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 11 మంది అనుమానిత కుకీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా గాయపడ్డట్లు తెలుస్తోంది.
కుకీ మిలిటెంట్లుగా అనుమానిస్తున్న కొందరు సోమవారం జిరిబమ్ పోలీస్‌స్టేషన్‌పై దాడికి ప్రయత్నించినప్పుడు ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు పోలీస్‌స్టేషన్ పక్కనే ఉన్న రిలీఫ్ క్యాంపును టార్గెట్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, మణిపూర్‌లో గతేడాది జరిగిన అల్లర్లలో జిరిబమ్ పోలీస్‌స్టేషన్‌కు ఉగ్రవాదులు పలుమార్లు టార్గెట్ చేసి దాడి చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment