ఇంఫాల్: మణిపూర్‌లో జాతుల మధ్య వైరంతో గత కొన్ని నెలలుగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ క్రమంలో మణిపూర్ భద్రతా సలహాదారు కూల్దీప్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశం మయన్మార్ నుంచి మణిపూర్‌కు గెరిల్లా యుద్ధంలో శిక్షణ పొందిన సుమారు 900 కుకీ మిలిటెంట్లు ప్రవేశించారని తెలిపారు. ఆ మిలిటెంట్లు ఆయుధాలతో కూడిన డ్రోన్ల వినియోగించటంలో శిక్షణ పొందినవారనే సమాచారం ఇంటెలిజెన్స్ నివేదిక ద్వారా అందినట్లు నిర్ధారించారు.
ఆయన మీడియాతో మట్లాడుతూ.. ‘‘ఇంటెలిజెన్స్ నివేదిక వెల్లడించిన విషయాలు 100 శాతం నిజం. ఆ నివేదిక తప్పు అని నిరూపించేవరకు మేము నమ్ముతాం. ఎందుకంటే ఇంటెలిజెన్స్ 100 శాతం నిజంగానే ఉంటుంది. ఆ సమాచారం ఆధారంగా మేము సిద్ధంగా ఉంటాం. ఒకవేళ ఆ నివేదిక నిజం కాకపోయినా. అన్ని రకాలుగా మా ప్రయత్నాలు ఆపకుండా ఉంటాం. ఇంటెలిజెన్స్ నివేదికను మేము ఎట్టి పరిస్థితుల్లో తేలికగా తీసుకోము’’ అని అన్నారు.
దక్షిణ మణిపూర్‌లోని ఇండియా-మయన్మార్ సరిహద్దు జిల్లాల్లోని అన్ని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్‌లకు ఇంటెలిజెన్స్ రిపోర్టు అందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గురువారం పంపిన ఈ నివేదికలో.. డ్రోన్ ఆధారిత బాంబులు, క్షిపణులు అమర్చటం, గెలిల్లా యుద్ధంలో కొత్తగా శిక్షణ పొందిన 900 మంది కుకీ మిలిటెంట్లు మయన్మార్ నుండి మణిపూర్‌లోకి ప్రవేశించారు’’ అని స్పష్టం చేసినట్లు మణిపూర్ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు.
కుకి మిలిటెంట్లు 30 మంది సభ్యులతో కూడిన యూనిట్లతో గ్రూప్‌లుగా ఉంటారని, మణిపూర్‌లో పలు ప్రాంతాల్లో విస్తరించిన ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ కుకీ మిలిటెంట్లు సెప్టెంబర్ చివరి వారంలో మైతేయి వర్గానికి చెందిన గ్రామాలపై దాడులకు పాల్పడవచ్చనే హెచ్చరికలు ఇంటెలిజెన్స్ రిపోర్టులో ఉన్నట్లు రాష్ట్ర పోలీసు అధికారులు తెలిపారు.
చదవండి: సినిమా రేంజ్‌లో బీజేపీ మేయర్ ఓవరాక్షన్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్
Comments
Please login to add a commentAdd a comment