టెన్షన్...టెన్షన్...టెన్షన్! | Tention..Tention..Tention! | Sakshi
Sakshi News home page

టెన్షన్...టెన్షన్...టెన్షన్!

Published Thu, May 15 2014 4:36 PM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM

టెన్షన్...టెన్షన్...టెన్షన్! - Sakshi

టెన్షన్...టెన్షన్...టెన్షన్!

టెన్షన్...టెన్షన్..టెన్షన్.. దేశమంతటా ఒకటే ఉత్కంఠ.

టెన్షన్...టెన్షన్..టెన్షన్.. దేశమంతటా ఒకటే ఉత్కంఠ. మన రాష్ట్రంలో మరీను. ఇక గంటలలోనే దేశమంతటా  సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సార్వత్రిక ఎన్నికలకు ఈవీఎంలు ఉపయోగించినందున  ఫలితాలు త్వరితగతిన వెల్లడవుతాయి.  ఉదయం 11 గంటలకే కొందరు విజేతలు తెలిసిపోతారు. అంతేకాకుండా ఎక్కడ ఏ వ్యక్తి లీడింగ్లో ఉన్నారో, దేశంలో, రాష్ట్రంలో ఏ పార్టీ లీడింగ్లో ఉందో కూడా తెలిసిపోతుంది. దాంతో ఉత్కంఠకు తెరపడుతుంది.

దేశవ్యాప్తంగా 9 విడతలలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 543 లోక్‌సభ స్థానాలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఓట్లను రేపు లెక్కిస్తారు. మొదటి విడత ఎన్నికలు ఏప్రిల్ 7న జరుగగా, చివరి విడత పోలింగ్ ఈ నెల 12న జరిగింది. తెలంగాణాలోని 119 శాసనసభ స్థానాలకు,17 లోక్సభ నియోజక వర్గాలకు  ఏప్రిల్ 30న ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లోని 175  శాసనసభ, 25 లోక్సభ నియోజక వర్గాలకు మే 7న ఎన్నికలు జరిగాయి. మన రాష్ట్రంలో తెలంగాణ, ఏపిలలో రెండు విడతలుగా పోలింగ్ జరిగినా, ఓట్ల లెక్కింపు మాత్రం రెండు ప్రాంతాలలోనూ రేపు ఉదయమే మొదలు పెడతారు. ఇప్పటికే వివిధ ఎగ్జిట్ పోల్స్ ద్వారా దేశంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ, తెలంగాణలో టిఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వస్తుందని ఎక్కువ మంది పరిశీలకులు ఒక అంచనాకు వచ్చారు. ఎంత అంచనా ఉన్నా ఫలితాలు తెలిసేవరకు ఆ టెన్షన్ అలా కొనసాగుతూనే ఉంటుంది. బెట్టింగులు కాసినవారి టెన్షన్ అయితే చెప్పడం కష్టం. దేశవ్యాప్తంగానే కాకుండా, విదేశాలలో కూడా ఇక్కడి ఎన్నికల ఫలితాలపై బెట్టింగుల వ్యవహారం నడిచింది. ఇంకా నడుస్తూనే ఉంది.

కొంత మంది అతి తక్కువ ఓట్ల మెజార్టీతోనైనా గట్టెక్కుతామనే ఆశతో ఉండేవారు ఉంటారు. అటువంటి వారు మరీ ఎక్కవ ఉత్కంఠకు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో పరిస్థితి మరీ ఉత్కంఠను రేపుతోంది. వైఎస్ఆర్ సిపి తొలిసారిగా సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసింది. ఇటు తెలంగాణలో కాంగ్రెస్, టిఆర్ఎస్ మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది. నిన్న మొన్న వెల్లడైన స్థానిక సంస్థల ఫలితాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అటు ఆంధ్ర ప్రదేశ్లో వైఎస్ఆర్ సిపి, టిడిపి మధ్య జరిగిన పోరులో  వైఎస్ఆర్ సిపి ముందుందని అందరూ భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో టిడిపి ముందుండటంతో ఆ పార్టీ విజయంపై ఆశలు పెట్టుకుంది. అయితే మునిసిపాలిటీల ఫలితాలతో పోల్చితే మరుసటి రోజు వెల్లడైన జడ్పిటిసి, ఎంపిటిసి ఫలితాలలో వైఎస్ఆర్ సిపి మెరుగైన ఫలితాలను సాధించింది. అలాగే ఓటింగ్ శాతం కూడా ఆ పార్టీకి పెరింగింది. దాంతో ముందు నుంచి మంచి ఊపుమీదున్న టిడిపి డీలా పడిపోయింది. పలు ఎగ్జిట్ పోల్స్ కూడా వైఎస్ఆర్ సిపియే  అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలుపుతున్నాయి. ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని అంచనాలు వేసినా, ఎన్ని లెక్కలు చూపినా, ఎగ్జిట్ పోల్స్ ఏం తెలిపినా అందరి ఉత్కంఠకు రేపు మధ్యాహ్నమే తెరపడేది. అప్పటి వరకు ఈ టెన్షన్ తప్పదు. మొదటి విడత పోలింగ్ జరిగిన వారు నెలా 14 రోజులుగా ఈ టెన్షన్ అనుభవిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement