
ఏపి భవన్ వద్ద ఉద్రిక్తత
ఏపి భవన్ వద్ద తెలంగాణ, సీమాంధ్రవాదులు పోటీపోటీగా ఆందోళనలు, ధర్నాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
న్యూఢిల్లీ: ఏపి భవన్ వద్ద తెలంగాణ, సీమాంధ్రవాదులు పోటీపోటీగా ఆందోళనలు, ధర్నాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ సమైక్యవాదులు ఆందోళన చేస్తున్నారు. బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని తెలంగాణవాదులు ధర్నా చేస్తున్నారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
విభజన వ్యవహారం చివరి దశకు చేరుకోవడంతో అటు పార్లమెంటులోనూ, ఇటు బయట ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లును రేపు లోక్సభలో ప్రవేశపెడుతున్న నేపధ్యంలో ఈ ఆందోళనకు ఇంకా ఉధృతమయ్యే అవకాశం ఉంది.