గోడలపై 'గో ఇండియా గో బ్యాక్' నినాదం! | As tension continues in Kashmir, Syed Ali Shah Geelani writes 'Go India Go Back' on walls | Sakshi
Sakshi News home page

గోడలపై 'గో ఇండియా గో బ్యాక్' నినాదం!

Published Tue, Aug 2 2016 4:55 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM

గోడలపై  'గో ఇండియా గో బ్యాక్' నినాదం!

గోడలపై 'గో ఇండియా గో బ్యాక్' నినాదం!

శ్రీనగర్ః భద్రతా దళాల కాల్పుల్లో  హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వాని మృతిపై కశ్మీర్ లో కల్లోలం ఇంకా ఆగలేదు. బుర్హానీ మరణంపై  అప్పట్నుంచీ ఏదో రకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా స్థానికుల ఇళ్ళు, గోడలపై హురియత్ నాయకుడి రాతలు మరోసారి అగ్నికి అజ్యం పోశాయి.

కరడుగట్టిన హురియత్ నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ 'గో ఇండియా గో' నినాదాలు ఇప్పుడు కశ్మీర్ లో మరోసారి కలకలం రేపుతున్నాయి. స్థానికుల ఇళ్ళు, గోడలపై ఆయన రాసిన రాతలు ఆందోళనకారులను మరింత రెచ్చగొడుతున్నాయి. భారతదేశానికి వ్యతిరేకంగా, పాకిస్తాన్ కు అనుకూలంగా తన మనోభావాలను గిలానీ ఎంతోకాలంగా వ్యక్త పరుస్తూనే ఉన్నాడు. గతంలో అనేక సందర్భాల్లో గిలానీ బహిరంగంగా శత్రు.. పొరుగు దేశం కశ్మీర్ అనుసంధానంపై సూచిస్తూనే ఉన్నాడు. బుర్హాన్ వాని ఎన్ కౌంటర్ అనంతరం ప్రజల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేయడంతోపాటు... లోయలో బంద్ కొనసాగేందుకు తనవంతు సాయం అందించాడు. అటువంటి ఘటనలతో సుమారు 25 రోజులపాటు కశ్మీర్ లోయలో కర్ఫ్యూ, కొనసాగింది. ఇప్పుడు తాజాగా గోడలపై  'గో ఇండియా గో' నినాదాలు రాస్తూ మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.

ఈ నేపథ్యంలో  జమ్మూ, కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పందించారు.   కశ్మీర్ లోయలో ఉద్రిక్తతను సృష్టిస్తున్న వేర్పాటువాదులను తీవ్రంగా మందలించారు. వేర్పాటు వాదులు కశ్మీర్ ను సిరియాగా మార్చాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు, యువతకు విద్య అవసరాన్ని తెలియజేయాల్సింది పోయి..  పీపుల్స్ డెమొక్రెటిక్ పార్టీ విస్మరిస్తోందని ఆరోపించారు. సోమవారం ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా జిల్లా ప్రజలను పలకరించిన ఆమె.. సమస్యను అధిగమించాలంటే ప్రజల సామూహిక కృషి ఎంతో అవసరమన్నారు. బుర్హాన్ వాని మరణించిన అనంతరం జూలై 9 నుంచీ అధికారికంగా విధించిన కర్ఫ్యూ కు తోడు.. వేర్పాటువాదుల ఆందోళనలతో  స్థానిక జనజీవనం అస్తవ్యస్థంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement