Geelani
-
గోడలపై 'గో ఇండియా గో బ్యాక్' నినాదం!
శ్రీనగర్ః భద్రతా దళాల కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వాని మృతిపై కశ్మీర్ లో కల్లోలం ఇంకా ఆగలేదు. బుర్హానీ మరణంపై అప్పట్నుంచీ ఏదో రకంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా స్థానికుల ఇళ్ళు, గోడలపై హురియత్ నాయకుడి రాతలు మరోసారి అగ్నికి అజ్యం పోశాయి. కరడుగట్టిన హురియత్ నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ 'గో ఇండియా గో' నినాదాలు ఇప్పుడు కశ్మీర్ లో మరోసారి కలకలం రేపుతున్నాయి. స్థానికుల ఇళ్ళు, గోడలపై ఆయన రాసిన రాతలు ఆందోళనకారులను మరింత రెచ్చగొడుతున్నాయి. భారతదేశానికి వ్యతిరేకంగా, పాకిస్తాన్ కు అనుకూలంగా తన మనోభావాలను గిలానీ ఎంతోకాలంగా వ్యక్త పరుస్తూనే ఉన్నాడు. గతంలో అనేక సందర్భాల్లో గిలానీ బహిరంగంగా శత్రు.. పొరుగు దేశం కశ్మీర్ అనుసంధానంపై సూచిస్తూనే ఉన్నాడు. బుర్హాన్ వాని ఎన్ కౌంటర్ అనంతరం ప్రజల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేయడంతోపాటు... లోయలో బంద్ కొనసాగేందుకు తనవంతు సాయం అందించాడు. అటువంటి ఘటనలతో సుమారు 25 రోజులపాటు కశ్మీర్ లోయలో కర్ఫ్యూ, కొనసాగింది. ఇప్పుడు తాజాగా గోడలపై 'గో ఇండియా గో' నినాదాలు రాస్తూ మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో జమ్మూ, కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పందించారు. కశ్మీర్ లోయలో ఉద్రిక్తతను సృష్టిస్తున్న వేర్పాటువాదులను తీవ్రంగా మందలించారు. వేర్పాటు వాదులు కశ్మీర్ ను సిరియాగా మార్చాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు, యువతకు విద్య అవసరాన్ని తెలియజేయాల్సింది పోయి.. పీపుల్స్ డెమొక్రెటిక్ పార్టీ విస్మరిస్తోందని ఆరోపించారు. సోమవారం ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ప్రజలను పలకరించిన ఆమె.. సమస్యను అధిగమించాలంటే ప్రజల సామూహిక కృషి ఎంతో అవసరమన్నారు. బుర్హాన్ వాని మరణించిన అనంతరం జూలై 9 నుంచీ అధికారికంగా విధించిన కర్ఫ్యూ కు తోడు.. వేర్పాటువాదుల ఆందోళనలతో స్థానిక జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. -
భార్య ఆత్మహత్యకు కారకుడైన భర్త అరెస్ట్
రొంపిచెర్ల: భార్యను వేధించి, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వ్యక్తిని అరెస్టు చేసి, రివూండ్కు పంపినట్లు ఎస్ఐ రహీవుుల్లా తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. బొవ్ముయ్యుగారిపల్లె పంచాయుతీ ఫజులుపేటకు చెందిన పీ.జిలాని(29) వెల్డింగ్ షాపు నడుపుతుండేవాడు. షాపు నిర్వహణ కోసం అప్పులు చేశాడు. దీనికితోడు వుద్యానికి బానిసయ్యాడు. నిత్యం డబ్బు కోసం భార్య తస్లీమ్(26)ను వేధించేవాడు. ఈనెల 25న సాయుంత్రం భార్యాభర్తలు ఘర్షణపడ్డారు. అదేరోజు తస్లీమ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి భర్త వేధిస్తున్నాడని ఫోన్లో ఫిర్యాదు చేసింది. రెండు రోజుల్లో తావుు వచ్చి వూట్లాడతావుని, అంతవరకు ఎలాంటి ఘర్షణలూ పడవద్దని తల్లిదండ్రులు ఆమెకు చెప్పారు. భర్త వేధింపులు తాళలేక బెడ్రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య కేసుగా నమోదు చేసి, పోలీసులు కేసు దర్యా ప్తు చేశారు. నిందితుడు గురువారం ఉదయుం తొమ్మిది గంటలకు రొంపిచెర్ల క్రాస్‌లో ఉండగా అరెస్టు చేసి, పీలేరు కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి నిందితుడికి 14 రోజులు రివూండ్ విధిస్తూ ఆదేశించారు. -
భర్త చేతిలో హతం?
రొంపిచెర్ల: భర్త చేతిలో భార్య హతమైంది. ఈ ఘటన రొంపిచెర్ల వుండలం బొవ్ముయ్యుగారిపల్లె పంచాయుతీ ఫజలుపేటలో విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం మేరకు.. అనంతపురం జిల్లా కూలికుంటకు చెందిన తస్లీమ్(25), జిలానీ (29)కి ఆరేళ్ల క్రితం వివాహమైం ది. వీరు రొంపిచెర్ల వుండలం ఫజులుపేటలో నివాసముంటున్నారు. జిలాని వెల్డింగ్ పనిచేసేవాడు. వీరికి అవూల్(5), అల్మాన్(3) పిల్లలు. జిలానీ రోజూ తప్పతాగి తరచూ భార్యతో గొడవపడేవాడు. శుక్రవారం రాత్రి 8 గంటలకు బంధువులు వచ్చి తలుపులు తట్టినా తెరవలేదు. దీంతో ఇంటిపైకి వెళ్లి చూశారు. తస్లీమ్ వుంచంపై పడి ఉంది. ఆమెను కదిలిం చినా కదల్లేదు. ఆమె గొంతుచూట్టు గాయూలు ఉండడంతో భర్త జిలానీ ఉరివేసి చంపి వేసి ఉంటాడని స్థాని కులు అనువూనిస్తున్నారు. ఆపై ఆగ్రహంతో జిలానీకి దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు. తల్లిదండ్రులు దూరమవ్వడంతో పిల్లలు అనాథలయ్యారు. ఎస్ఐ రహీవుుల్లా కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
'యోగాతో కశ్మీర్ సమస్యకు పరిష్కారం'
జమ్ము: యోగా సాధన ద్వారా సరైన నిర్ణయాలు తీసుకోగలమని, తద్వారా జఠిలమైన కశ్మీర్ సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని జమ్ముకశ్మీర్ మంత్రి చౌదరీ లాల్ సింగ్ అన్నారు. శనివారం జమ్ములో మీడియాతో మాట్లాడిన ఆయన వేర్పాటువాద నేత, హురియత్ కాన్ఫరెన్స్ చీఫ్ సయ్యద్ అలీషా గిలానీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. 'గిలానీకి నా సలహా ఏమంటే ప్రతి రోజు యోగా చేయమని. యోగా సాధన ద్వారా ఏది సరైన నిర్ణయమో, ఏది తప్పుడు నిర్ణయమో తెలుసుకోగలిగే జ్ఞానం సిద్ధిస్తుంది. అప్పుడు కశ్మీర్ సమస్యకు పరిష్కారం దానంతట అదే దొరుకుతుంది' అని లాలా సింగ్ అన్నారు. యోగాను వ్యతిరేకించేవారికి అసలు ఇస్లాం గురించే తెలియదని, అలాంటి వాళ్లందరూ మూర్ఖులేనని వ్యాఖ్యానించారు. కశ్మీర్ లోని అన్ని జిల్లాలు, గ్రామ స్థాయిల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తామని, జమ్ములోని గుల్షన్ గ్రౌండ్స్ లో జరిగే ప్రధాన వేడుకకు 5వేల మందికిపైగా హాజరయ్యే అవకాశం ఉదని చెప్పారు. ఉధంపూర్ జిల్లాలోని మంతలాయి ప్రాంతాన్ని అంతర్జాతీయ యోగా కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. -
గిలానీని కలిసేందుకు మోడీ ఎవరినీ పంపలేదు
న్యూఢిల్లీ : బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ తరపున రాయబారులు కాశ్మీర్ వేర్పాటువాద హురియత్ కాన్ఫరెన్స్ చైర్మెన్ సయ్యద్ అలీషా గిలానీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారనే మీడియా కథనాలను బీజేపీ ఖండించింది. గిలానీని కలిసేందుకు మోడీ ఎవరినీ పంపలేదని ఆ పార్టీ శనివారం స్పష్టం చేసింది. భారత్‌లో కాశ్మీర్ అంతర్బాగమేనని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే గిలానీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ విమర్శించింది. ఇటువంటి ప్రయత్నాలు మానుకుని గిలానీ ప్రజలకు క్షమాపక్ష చెప్పాలని డిమాండ్ చేసింది. మరోవైపు మోడీ తరపున ఇద్దరు కాశ్మీరీ పండిట్లు తనను కలిశారని గిలానీ తెలిపారు. మార్చి 22న ఢిల్లీలో తనతో కాశ్మీర్ సమస్యపై మాట్లాడేందుకు మోడీ తరపున వచ్చినట్లు వారు చెప్పారని ఆయన వెల్లడించారు. అయితే కాశ్మీరీ పండిట్లుగా దీనిపై ఎవరితోనైనా మాట్లాడే హక్కు వారికుందని చెప్పానన్నారు. మోడీకి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉండటంతో తాను వారి విజ్ఞప్తిని తిరస్కరించానని గిలానీ వెల్లడించారు. అయితే దీనిపై బిజెపి మండిపడింది. గిలానీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. దీనిపై రాజకీయ పక్షాలు బిజెపిపై ఆరోపణల వర్షం కురిపిస్తున్నాయి.