భార్య ఆత్మహత్యకు కారకుడైన భర్త అరెస్ట్
రొంపిచెర్ల: భార్యను వేధించి, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వ్యక్తిని అరెస్టు చేసి, రివూండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ రహీవుుల్లా తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు.. బొవ్ముయ్యుగారిపల్లె పంచాయుతీ ఫజులుపేటకు చెందిన పీ.జిలాని(29) వెల్డింగ్ షాపు నడుపుతుండేవాడు. షాపు నిర్వహణ కోసం అప్పులు చేశాడు. దీనికితోడు వుద్యానికి బానిసయ్యాడు. నిత్యం డబ్బు కోసం భార్య తస్లీమ్(26)ను వేధించేవాడు. ఈనెల 25న సాయుంత్రం భార్యాభర్తలు ఘర్షణపడ్డారు. అదేరోజు తస్లీమ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి భర్త వేధిస్తున్నాడని ఫోన్‌లో ఫిర్యాదు చేసింది.
రెండు రోజుల్లో తావుు వచ్చి వూట్లాడతావుని, అంతవరకు ఎలాంటి ఘర్షణలూ పడవద్దని తల్లిదండ్రులు ఆమెకు చెప్పారు. భర్త వేధింపులు తాళలేక బెడ్‌రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య కేసుగా నమోదు చేసి, పోలీసులు కేసు దర్యా ప్తు చేశారు. నిందితుడు గురువారం ఉదయుం తొమ్మిది గంటలకు రొంపిచెర్ల క్రాస్‌లో ఉండగా అరెస్టు చేసి, పీలేరు కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి నిందితుడికి 14 రోజులు రివూండ్ విధిస్తూ ఆదేశించారు.