Taslim
-
German Open 2023: మెయిన్ ‘డ్రా’కు తస్నీమ్
ముల్హీమ్: జర్మన్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్‌లో భారత జోడి సుమీత్ రెడ్డి – అశ్విని పొన్నప్ప ఆట ముగిసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లోనే సుమీత్ – అశ్విని 10–21, 12–21 తేడాతో స్కాట్లాండ్కు చెందిన ఆడమ్ హాల్ – జూలీ మాక్‌ఫెర్సన్ చేతిలో పరాజయంపాలయ్యారు. మరో వైపు మహిళల సింగిల్స్‌లో తస్నీమ్ మీర్ మెయిన్ డ్రాకు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో తస్నీమ్ 24–22, 21–8 స్కోరుతో రాచెల్ దరాగ్ (ఐర్లాండ్)ను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో మాత్రం శంకర్ ముత్తుసామి మెయిన్ డ్రాకు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. చివరి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ముత్తుసామి 21–23, 19–21తో రెస్కీ డ్వికాయో (అజర్బైజాన్) చేతిలో ఓడాడు. -
ఏసీబీ అదుపులో జూనియర్ అసిస్టెంట్
మచిలీపట్నం: కృష్ణాజిల్లా మచిలీపట్నం డీసీహెచ్ఎస్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నతస్లీమ్ బేగ్ శానిటేషన్ కాంట్రాక్టర్‌కు బిల్లు మంజూరు చేయడానికి రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు తస్లీమ్ లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతనిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. -
భార్య ఆత్మహత్యకు కారకుడైన భర్త అరెస్ట్
రొంపిచెర్ల: భార్యను వేధించి, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వ్యక్తిని అరెస్టు చేసి, రివూండ్కు పంపినట్లు ఎస్ఐ రహీవుుల్లా తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. బొవ్ముయ్యుగారిపల్లె పంచాయుతీ ఫజులుపేటకు చెందిన పీ.జిలాని(29) వెల్డింగ్ షాపు నడుపుతుండేవాడు. షాపు నిర్వహణ కోసం అప్పులు చేశాడు. దీనికితోడు వుద్యానికి బానిసయ్యాడు. నిత్యం డబ్బు కోసం భార్య తస్లీమ్(26)ను వేధించేవాడు. ఈనెల 25న సాయుంత్రం భార్యాభర్తలు ఘర్షణపడ్డారు. అదేరోజు తస్లీమ్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి భర్త వేధిస్తున్నాడని ఫోన్లో ఫిర్యాదు చేసింది. రెండు రోజుల్లో తావుు వచ్చి వూట్లాడతావుని, అంతవరకు ఎలాంటి ఘర్షణలూ పడవద్దని తల్లిదండ్రులు ఆమెకు చెప్పారు. భర్త వేధింపులు తాళలేక బెడ్రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య కేసుగా నమోదు చేసి, పోలీసులు కేసు దర్యా ప్తు చేశారు. నిందితుడు గురువారం ఉదయుం తొమ్మిది గంటలకు రొంపిచెర్ల క్రాస్‌లో ఉండగా అరెస్టు చేసి, పీలేరు కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి నిందితుడికి 14 రోజులు రివూండ్ విధిస్తూ ఆదేశించారు. -
భర్త చేతిలో హతం?
రొంపిచెర్ల: భర్త చేతిలో భార్య హతమైంది. ఈ ఘటన రొంపిచెర్ల వుండలం బొవ్ముయ్యుగారిపల్లె పంచాయుతీ ఫజలుపేటలో విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం మేరకు.. అనంతపురం జిల్లా కూలికుంటకు చెందిన తస్లీమ్(25), జిలానీ (29)కి ఆరేళ్ల క్రితం వివాహమైం ది. వీరు రొంపిచెర్ల వుండలం ఫజులుపేటలో నివాసముంటున్నారు. జిలాని వెల్డింగ్ పనిచేసేవాడు. వీరికి అవూల్(5), అల్మాన్(3) పిల్లలు. జిలానీ రోజూ తప్పతాగి తరచూ భార్యతో గొడవపడేవాడు. శుక్రవారం రాత్రి 8 గంటలకు బంధువులు వచ్చి తలుపులు తట్టినా తెరవలేదు. దీంతో ఇంటిపైకి వెళ్లి చూశారు. తస్లీమ్ వుంచంపై పడి ఉంది. ఆమెను కదిలిం చినా కదల్లేదు. ఆమె గొంతుచూట్టు గాయూలు ఉండడంతో భర్త జిలానీ ఉరివేసి చంపి వేసి ఉంటాడని స్థాని కులు అనువూనిస్తున్నారు. ఆపై ఆగ్రహంతో జిలానీకి దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు. తల్లిదండ్రులు దూరమవ్వడంతో పిల్లలు అనాథలయ్యారు. ఎస్ఐ రహీవుుల్లా కేసు దర్యాప్తు చేస్తున్నారు.