ముల్హీమ్: జర్మన్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 టోర్నమెంట్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడి సుమీత్ రెడ్డి – అశ్విని పొన్నప్ప ఆట ముగిసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లోనే సుమీత్ – అశ్విని 10–21, 12–21 తేడాతో స్కాట్లాండ్‌కు చెందిన ఆడమ్ హాల్ – జూలీ మాక్‌ఫెర్సన్ చేతిలో పరాజయంపాలయ్యారు.
మరో వైపు మహిళల సింగిల్స్‌లో తస్నీమ్ మీర్ మెయిన్ డ్రాకు అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో తస్నీమ్ 24–22, 21–8 స్కోరుతో రాచెల్ దరాగ్ (ఐర్లాండ్)ను ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో మాత్రం శంకర్ ముత్తుసామి మెయిన్ డ్రాకు అర్హత సాధించడంలో విఫలమయ్యాడు. చివరి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ముత్తుసామి 21–23, 19–21తో రెస్కీ డ్వికాయో (అజర్‌బైజాన్) చేతిలో ఓడాడు.
Comments
Please login to add a commentAdd a comment