‘పుర’ పాలకవర్గాల ఎన్నిక నేడే | 'Pura' ruling the seven | Sakshi
Sakshi News home page

‘పుర’ పాలకవర్గాల ఎన్నిక నేడే

Published Thu, Jul 3 2014 3:05 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

'Pura' ruling the seven

  •     పుంగనూరు, పలమనేరు, మదనపల్లె ‘పుర’పీఠాలు వైఎస్సార్‌సీపీకే
  •      చిత్తూరు, శ్రీకాళహస్తి, పుత్తూరు టీడీపీకి
  •      ఉత్కంఠ రేపుతున్న నగరి ఎన్నిక
  •      కీలకం కానున్న స్వతంత్రులు,ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు
  •      మదనపల్లెలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులనుప్రలోభాలకు గురిచేస్తున్న టీడీపీ
  •      చిత్తూరు కార్పొరేషన్‌లో నేటి ప్రమాణస్వీకారానికి వైఎస్సార్‌సీపీ గైర్హాజరు
  • సాక్షి, చిత్తూరు: జిల్లాలోని చిత్తూరు కార్పొరేషన్‌తోపాటు ఆరు మున్సిపాలిటీలకు గురువారం పాలకవర్గాలను ఏర్పాటు చేయనున్నారు. నగరిలో పాలకవర్గం ఏర్పాటు ఉత్కంఠ రేపుతోంది. మదనపల్లెలో ఇద్దరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను టీడీపీ ప్రలోభాలకులోను చేసి తమ క్యాంపునకు తరలించింది. ఈ స్థానంపైనా ఉత్కంఠ కొనసాగుతోంది. క్యాంపునకు వెళ్లిన వారు కచ్చితంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థికే మద్దతు ప్రకటిస్తారని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి పడనున్నాయి. తద్వారా మదనపల్లె పీఠంపై కచ్చితంగా తమ పార్టీ అభ్యర్థినే అధ్యక్షునిగా కూర్చోబెడతామని ఆ పార్టీ నేతలు గట్టిగా చెబుతున్నారు.
     
    చిత్తూరు తొలి మేయర్‌గా కఠారి అనురాధ
     
    చిత్తూరు కార్పొరేషన్ బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ 50 డివిజన్‌లు ఉన్నాయి. టీడీపీ 33 స్థానాల్లో గెలుపొందింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 4 స్థానాల్లో విజయం సాధించారు. 13 మంది స్వతంత్రులు గెలుపొందారు. వీరిలో 8 మంది మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు సంబంధించిన వారు. దీంతో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల సంఖ్య 12కు చేరింది. తక్కిన ఐదుగురు స్వతంత్రులు టీడీపీ రెబల్‌గా బరిలోకి దిగారు. వీరి మద్దతు టీడీపీకే! దీంతో 38 మంది కార్పొరేటర్లు టీడీపీ తరఫున ఉండడంతో కఠారి అనురాధాను చిత్తూరు తొలిమేయర్‌గా ఎన్నుకోనున్నారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు నేటి ప్రమాణస్వీకార కార్యక్రమానికి గైర్హాజరవుతున్నట్లు తెలిసింది. మరో రోజు వీరు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
     
    పుంగనూరు వైఎస్సార్‌సీపీ వశం
     
    పుంగనూరులో 24 వార్డులు ఉన్నాయి. 17వార్డుల్లో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు గెలుపొందారు. 7చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన మెజారిటీ రావడంతో ఆ పార్టీ తరఫున షమీమ్ చైర్‌పర్సన్‌గా ఎన్నిక కానున్నారు.
     
    మదనపల్లెలో ఉత్కంఠ
     
    ఈ మున్సిపాలిటీ బీసీ జనరల్‌కు రిజర్వ్ అయింది. ఇక్కడ 35 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ 17, టీడీపీ 15 స్థానాలు దక్కించుకున్నాయి. ముగ్గురు స్వతంత్రులు గెలుపొందారు. ఎమ్మె ల్యే, ఎంపీ ఓట్లు వైఎస్సార్‌సీపీకి మరింత మె జార్టీని కట్టబెట్టనున్నాయి. టీడీపీ నాయకులు ఇద్దరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేసి తమ క్యాంపునకు తరలించారు. ముగ్గురు స్వతంత్రులు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ప్రకారం ఎన్నిక జరిగితే 20 మంది కౌన్సిలర్లతో టీడీపీ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశముంది.

    టీడీపీ తరఫున కొడవలి శివప్రసాద్ చైర్మన్  అభ్యర్థి. టీడీపీ క్యాంపులోని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కచ్చితంగా తాము ఎన్నికైన పార్టీకే అండగా నిలవాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వీరు వైఎస్సార్‌పీపీ వైపు నిలిస్తే ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు ఆ పార్టీకి ఉన్నాయి. ఈ లెక్కన 19 మంది కౌన్సిలర్లతో వైఎస్సార్‌సీపీ పురపీఠాన్ని కైవసం చేసుకునే అవకాశముంది. షమీమ్ అస్లం చైర్‌పర్సన్‌గా ఎన్నికకానున్నారు.
     
    తమ్ముళ్లకే శ్రీకాళహస్తి ..

    శ్రీకాళహస్తి ఓసీ జనరల్‌కు రిజర్వ్ అయింది. ఇక్కడ 35 వార్డుల్లో 18 టీడీపీ, 11 వైఎస్సార్‌సీపీ దక్కించుకున్నాయి. ఇద్దరు స్వతంత్రులు గెలుపొందారు. నలుగురు కాంగ్రెస్ తరఫున గెలిచారు. అధిక స్థానాలు దక్కించుకున్న టీడీపీ తరఫున పేట రాధారెడ్డి(బీసీ) చైర్మన్‌గా ఎన్నికకానున్నారు.
     
    నగరిలో నువ్వానేనా
     
    నగరి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ 27 వార్డులుంటే 11 వైఎస్సార్‌సీపీ, 13 టీడీపీ కి దక్కాయి. ముగ్గురు స్వతంత్రులు గెలుపొం దారు. వీరిలో ఒకరు టీడీపీ గూటికి చేరితే త క్కిన ఇద్దరు వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచా రు. ఇక్కడ ఎంపీ ఓటు టీడీపీకి, ఎమ్మెల్యే ఓటు వైఎస్సార్‌సీపీకి ఉన్నాయి. దీంతో వైఎస్సార్‌సీపీ బలం 14కు చేరితే, టీడీపీ 15కు చేరనుంది. ఈ లెక్కన చైర్మన్ పీఠం టీడీపీ వశం అవుతుంది. చైర్మన్ గిరి కోసం ఇక్కడ చెండామరై, రేవతి నువ్వానే నా అని పోటీపడుతున్నారు.

    చెండామరైకి అనుకూలంగా ‘గాలి’ నిర్ణయం తీసుకోన్నుట్లు తెలిసింది. ఇదే జరిగితే రేవతి వర్గంలోని ఒకరిద్దరు కౌన్సిలర్లు టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే చైర్మన్ స్థానాన్ని తాము దక్కించుకుంటామని వైఎస్సార్‌సీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక్కడ వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి శాంతి.
     
    పుత్తూరు పీఠం టీడీపీకే
     
    పుత్తూరులో 24 వార్డులకు టీడీపీ 13, వైఎస్సార్‌సీపీ 11 స్థానాలు దక్కించుకున్నాయి. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న టీడీపీ చైర్మన్ స్థానాన్ని దక్కించుంది. యుగంధర్, కరుణాకర్  చైర్మన్ కోసం పోటీపడుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement