
నేడు విజయమ్మ రాక
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షులు వైఎస్ విజయమ్మ మంగళవారం చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని జంగారెడ్డిగూడెంలో ‘వైఎస్సార్ జనభేరి’ కార్యక్రమానికి హాజరవుతారని పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఒక ప్రకటనలో తెలిపారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జనభేరి కార్యక్రమాన్ని ముగించుకుని జిల్లాలోకి ప్రవేశిస్తారని, సాయంత్రం 6 గంటలకు జంగారెడ్డిగూడెం వస్తారని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పురపాలక, నగరపాలక, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రజలంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేం దుకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మోసపూరిత కుట్రలకు బదులు చెప్పేందుకు ఓటర్లు ఉవ్విళ్లూరుతున్నారన్నారు.