jana bheri
-
'జీహెచ్ఎంసీ జీవోను రద్దు చేసింది చంద్రబాబే'
హైదరాబాద్: చంద్రబాబు ఎంత నియంతో హిట్లర్ కూడా అంతే నియంత అని వైఎస్ షర్మిల అన్నారు. హిట్లర్‌కు ఎంత అధికార దాహమో చంద్రబాబుకూ అంతే అధికారదాహమని పేర్కొన్నారు. ఇద్దరూ ఒకే రోజున పుట్టారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా యూసుఫ్‌గూడలో నిర్వహించిన రోడ్ షోలో షర్మిల ప్రసంగించారు. ఓడిపోతాననే భయంతో చంద్రబాబు గోబెల్స్ ప్రచారానికి తెరలేపారని ఆరోపించారు. హైటెక్ సిటీ ఒక్కటి కట్టి హైదరాబాద్ మొత్తం తానే అభివృద్ధి చేశాడని గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. నాడు జీహెచ్ఎంసీ జీవోను రద్దు చేసింది చంద్రబాబేనని గుర్తు చేశారు. ఐఎంజీకి అప్పనంగా భూములు కట్టబెట్టారని ఆరోపించారు. చంద్రబాబు దృష్టిలో లోకకల్యాణం అంటే లోకేష్ కల్యాణం అని అర్థమని షర్మిల ఎద్దేవా చేశారు. -
మన రాష్రంలో ఎన్నిఇళ్లు ఉన్నయో బాబుకు తెలుసా:జగన్
-
మధిర జనభేరీలో షర్మిళ ప్రసంగం
-
చంద్రబాబు వాగ్ధానాల్లో నిజం లేదు: షర్మిల
-
'ఓటేసే ముందు వైఎస్సార్ ను గుర్తుకు తెచ్చుకోండి'
-
'వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు కొత్త కాదు'
-
'వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు కొత్త కాదు'
గుత్తి: వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు కొత్త కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా గుత్తిలో జరిగిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. ఎన్నికలు రాగానే చంద్రబాబు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారని జగన్ విమర్శించారు. రూ.2కే కిలో బియ్యం పథకాన్ని నిర్వీర్యం చేసి.. కిలో రూ.5.25కి పెంచిన ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు. నీ పాలనలో ప్రజలు అనుభవించిన కష్టాలు మరిచిపోయావా చంద్రబాబూ అని ప్రశ్నించారు. ఆయన అధికారం కోసం ఏ గడ్డి తినడానికైనా సిద్ధంగా ఉన్నారు. రైతు రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ గురించి చంద్రబాబు ఇప్పుడు చాలా హామీలిస్తున్నారు. తాను అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో వాటిని ఎందుకు చేయలేదు? అని నిలదీశారు. వైఎస్ఆర్కు ముందు ఎందరో సీఎంలు వచ్చారు కాని ప్రజలకు గుర్తుండే సీఎం వైఎస్సార్ మాత్రమేనని అన్నారు. తాము అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం తెస్తామని జగన్ హామీయిచ్చారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. -
మణుగూరులో షర్మిళ జనభేరీ
-
సాలూరు జనహోరు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఊళ్లన్నీ రోడ్లపైకొచ్చాయి. చిన్నా- పెద్దా, మహిళా-యువత ఏకమై వచ్చి ఆపూర్వ ఆదరణ చూపించారు. రహదారులన్నీ జనదారులయ్యాయి. రాజన్న తనయుడ్ని చూసేందుకు గ్రామాలు పరితపించాయి. మిద్దెలు, మేడలు ఎక్కాయి. జననేత జగన్ కోసం వచ్చిన జన ప్రభంజనాన్ని చూసి భానుడు సైతం చిన్నబోయాడు. ప్రజాభిమానం పూలవానై కురిసింది. అభిమాన జనం తడిసి ముద్దయ్యింది. జనప్రవాహం మధ్య బొబ్బిలి నియోజకవర్గ రోడ్ షో సాగింది. తరలివచ్చిన అశేష జనంతో సాలూరు జనసంద్రమయ్యింది. జై జగన్ నినాదాలతో సాలూరు పట్టణం హోరెత్తింది. చంద్రబాబుపై సంధించిన విమర్శనాస్త్రాలతో వైఎస్ఆర్ జనభేరి బహిరంగ సభా ప్రాంగణం మార్మోగింది. ప్రజామోదమైన హామీలతో వైఎస్ జగన్ ఇచ్చిన భరోసాకు జన స్పందన వెల్లువెత్తింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా చిన్న పిల్లాడి నుంచి వృద్ధుల వరకూ లెక్కచేయలేదు. అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. హారతులిచ్చి, నుదుట కుంకుం దిద్ది, పూల వర్షం కురిపించి ముందుకు నడిపించారు. ఊరి పొలిమేరలో ఎదురేగి స్వాగతం పలికి సరిహద్దు గ్రామం వరకు వెంట సాగారు. కేరింతలు కొడుతూ వైఎస్సార్ పతాకాలతో ముందుకు సాగారు. జననేత రాకతో అభిమానుల్లో ఆనందం అంబరాన్ని తాకింది. డప్పుల మోతలు, నేల డ్యాన్సులు, బాణసంచా కాల్పులతో తమ అభిమాన నేతకు నీరాజనం పలికారు. గంటల తరబడి వేచి చూసి చివరకు ఆప్యాయతలను అందించారు. వైఎస్ఆర్ జనభేరి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాల్లో వైఎస్ జగన్మోహన్రెడి రోడ్ షో నిర్వహించారు. అభిమాన జనసంద్రం మధ్య ఎక్కడికక్కడ ఆగి ఆత్మీయతలను అందుకున్నారు. గ్రామాల్లో పూలవర్షం కురిపించి, భారీ పూల దండలు వేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు.. అడుగడుగునా పూలను జల్లుతూ, జగన్ నడిచే దారిలో వేస్తూ పండగ వాతావరణాన్ని తలపించారు. ముందుగా బొబ్బిలి కోట నుంచి రోడ్‌షో మొదలైంది. కోట ప్రాంగణానికే వందలాది మంది అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు. అనంతరం గ్రోత్సెంట రు, మెట్టవలస, గొర్లెసీతారాంపురం, పారాది వరకు రోడ్‌షో సాగింది. దారి పొడవునా అభిమాన నేతకు ఘనస్వాగతం పలికారు. జగన్‌ను చూసేందుకు, కలిసేందుకు వచ్చిన వారితో ఆయా ప్రాంతాలన్నీ జాతరను తలపింప జేశా యి. ఇక శిష్టిసీతారాంపురం, రొంపల్లిలోనైతే ఎంత చెప్పినా తక్కువే. గ్రామం పొడవునా ప్రజలు బారులు తీరి చెక్కు చెదరని ఆదరణతో అక్కున చేర్చుకున్నారు. అడుగు కూడా వేయలేని విధంగా జనాలు రోడ్డుపైకొచ్చారు. జగన్‌తో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. హారతులు పట్టేందుకు మహిళలు పోటీ పడ్డారు. ఇక రామభద్రపురమైతే కిక్కిరిసిపోయింది. టీడీపీ ఆవిర్భావం సమయంలో ఎన్టీఆర్‌కు వచ్చిన దానికన్న ఎక్కువ జనం వచ్చారని చర్చించుకోవడం కన్పించింది. విజయనగరం, పార్వతీపురం, సాలూరు రోడ్లన్నీ జనంతో పోటెత్తాయి. ఎక్కడా చూసినా జనమే ఉండడంతో రామభద్రపురం దాటడానికి రెండు గంటల సమయం పట్టేసింది. ఇక బొబ్బిలి నుంచి రామభద్రపురం చేరేలోపు అనేకమంది జగన్‌ను కలిసి తమ అభిమానాన్ని చూపించారు. అలాగే తమ గోడును వెళ్లగక్కారు. బొబ్బిలి కోటలో స్వప్న అనే యువతి జగన్‌కు రాఖీ కట్టి సోదరి ప్రేమను చాటుకున్నారు. ఇదే యువతి బొబ్బిలి గ్రోత్ సెంటర్ వద్ద మరోసారి తన కుమారుడు మోనీష్‌తో పాటు జగన్‌ను కలిశారు. ‘ కాబోయే సీఎం ఎవరు, మన గుర్తు ఏమిటి ’ అని అడిగి జగన్‌కు ఎదురుగా తన కొడుకుతో చెప్పించారు. మెట్టవలస గ్రామం వద్ద వైఎస్ ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా గుండె చికిత్స చేయించుకున్న కృష్ణారావు జగన్‌ను కలిసి కన్నీరు మున్నీరయ్యారు. రొంపల్లి గ్రామంలో పువ్వల వెంకటరమణ భారీ పూలమాలను వేశారు. ఆయా గ్రామల్లో కాబోయే సీఎం జగన్ అంటూ యువత నినాదాలు చేశారు. కొంత మంది క్రైస్తవులు వచ్చి ప్రార్థనలు నిర్వహించారు. పారాది వంతెన దాటాక హైస్కూలు విద్యార్థులు జగన్‌తో కరచాలనం చేయడానికి క్యూ కట్టారు. జగన్ ఆత్మీయ స్పర్శ తగిలిన తరువాత చాలా మంది వృద్ధులు కన్నీరు పెట్టుకుని బయటకు వచ్చారు. ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను సుజయ్, బేబీనాయనలు పరిచయం చేశారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా తిరుగుతున్న జగన్మోహన్రెడ్డి ముఖంపై చెమట పట్టడంతో శిష్టిసీతారాంపురంలో ఓ మహిళ చెంగుతో చెమటను తుడిచింది. ఇక్కడే కొద్ది నెలల క్రితం జరిగిన దాడిలో తీవ్రంగా గాయాలపాలైన వైఎస్సార్ సీపీ కార్యకర్తలను దగ్గరకు తీసుకుని, బాసటగా నిలిచి, మనోధైర్యాన్నిచ్చారు. అలాగే పారాది వద్ద గేదెల సింహాచలం అనే మహిళ జగన్‌ను కలిసి బెల్ట్‌షాపులను తీసేయమని కోరింది. ఆతర్వాత తారాపురం, కొట్టక్కి మీదుగా రోడ్‌షో సాగింది. తామేమీ తక్కువ కాదన్నట్లు ఈ గ్రామాల ప్రజలు కూడా రోడ్డుపైకొచ్చి పెద్ద ఎత్తున స్వాగతం పలికి, అభిమానాన్ని చూపించారు. జనహోరు సాలూరు పదేళ్లకొకసారి జరగనున్న శ్యామలాంబ జాతర ముందే వచ్చిందా అన్నట్టు మంగళవారం జన ప్రభంజనం సాగింది. నేల ఈనిందా అన్నట్టు పోటెత్తిన జనజాతరలో జై జగన్ నినాదాలతో పట్టణమంతా హోరెత్తింది. తరలివచ్చిన అభిమానులతో వీధులన్నీ కిటకిటలాడాయి. రోడ్లన్నీ జనసంద్రమయ్యాయి. జగన్‌ను చూసేందుకు, కలిసేందుకు వచ్చిన వారితో అడుగు కూడా పక్కకు వేయలేని పరిస్థితి ఏర్పడింది. సాలూరులో జగన్ ప్రవేశించిన దగ్గరి నుంచి వైఎస్సార్ జనభేరి సభా ప్రాంగణానికి వెళ్లేందుకు మూడు గంటలు సమయం పట్టిందంటే జనసమ్మర్థం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక జగన్ ప్రసంగం కూడా వాడీవేడిగా సాగింది. చంద్రబాబు తొమ్మిదేళ్ల భయానక పాలనను గుర్తు చేస్తూ,ఆచరణ సాధ్యమైన హామీలు ఇస్తూ ఆకట్టుకున్నారు. మధ్యలో వైఎస్సార్ సేవలను కొనియాడారు. మొత్తానికి ప్రసంగం అద్యంతం కరతాళ ధ్వనులతో సాలూరు హోరెత్తింది. కాగా, సభలో చివరిగా అరుకు పార్లమెంట్ అభ్యర్థిగా కొత్తపల్లి గీతను, సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పీడిక రాజన్నదొరను జగన్ ప్రకటించారు. వైఎస్ జగన్ ప్రచార యాత్రలో పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయకృష్ణ రంగారావు, విజయనగరం, అరుకు పార్లమెంట్ అభ్యర్థులు బేబీనాయన, కొత్తపల్లి గీత, సాలూరు ఎమ్మెల్యే అభ్యర్థి పీడిక రాజన్నదొర, పార్టీ సమన్వయకర్తలు గురాన అయ్యలు, జమ్మాన ప్రసన్నకుమార్, ఉత్తరాంధ్ర ఎస్సీ సెల్ కన్వీనర్ ఆదాడ మోహనరావు, పార్టీ నాయకులు గొర్లె మధుసూదనరావు, జర్జాపు ఈశ్వరరావు, జర్జాపు సూరిబాబు, పక్క జిల్లాల నేతలు వరుదు కళ్యాణి, బల్లాడ హేమమాలినిరెడ్డి, బల్లాడ జనార్దన్‌రెడ్డి, గండి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
చీపురపల్లిలో జగన్ ప్రసంగం
-
వైఎస్సార్ రైతు పక్షపాతి: విజయమ్మ
ఎర్రగుంట: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల పక్షపాతి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. రైతు రుణాలను మాఫీ చేసిన ఘనత వైఎస్సార్‌దే అన్నారు. వైఎస్సార్ హయాంలో ఏ ఒక్క ఛార్జీ కూడా పెరగలేదని గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలో నిర్వహించిన రోడ్ షో లో విజయమ్మ ప్రసంగించారు. పిల్లల చదువు కోసం 'అమ్మఒడి పథకం'పై జగన్‌బాబు మొదటి సంతకం చేస్తారని చెప్పారు. అవ్వా, తాతలకు రూ.700 పింఛన్, వికలాంగులకు రూ.1000 పింఛన్‌పై జగన్‌బాబు రెండో సంతకం చేస్తారని హామీయిచ్చారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా రూ.3వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటుపై మూడోసంతకం చేస్తారన్నారు. డ్వాక్రా రుణాల మాఫీపై నాలుగో సంతకం, పల్లె పాలనపై జగన్‌బాబు ఐదో సంతకం చేస్తారని వైఎస్ విజయమ్మ చెప్పారు. -
తగరపువలసలో వైఎస్ జగన్ ప్రసంగం
-
రాయచోటికి చేరుకున్న విజయమ్మ జనభేరీ
-
తిరువూరు జనభేరీలో షర్మిళ ప్రసంగం
-
'విశ్వసతనీయత అంటేనే వైఎస్సాఆర్'
-
పెడన జనభేరీలో షర్మిళ ప్రసంగం
-
'పేదవాడికి భరోసా కల్పించిన నేత వైఎస్ఆర్'
-
నేడు విజయమ్మ రాక
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షులు వైఎస్ విజయమ్మ మంగళవారం చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని జంగారెడ్డిగూడెంలో ‘వైఎస్సార్ జనభేరి’ కార్యక్రమానికి హాజరవుతారని పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జనభేరి కార్యక్రమాన్ని ముగించుకుని జిల్లాలోకి ప్రవేశిస్తారని, సాయంత్రం 6 గంటలకు జంగారెడ్డిగూడెం వస్తారని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పురపాలక, నగరపాలక, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేం దుకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మోసపూరిత కుట్రలకు బదులు చెప్పేందుకు ఓటర్లు ఉవ్విళ్లూరుతున్నారన్నారు. -
'వచ్చేవి మన తలరాతను మార్చే ఎన్నికలు'
-
బెల్లంకొండకు చేరుకున్న షర్మిళ
-
మధిర జనభేరిలో విజయమ్మ ప్రసంగం
-
చిరంజీవి కాంగ్రెస్ పార్టీ తొత్తు: షర్మిళ
-
జన గోదావరి
-
నంద్యాలకు చేరుకున్న విజయమ్మ
-
వైఎస్సార్ అంటేనే ఒక ఆశయం, నమ్మకం, భరోసా
-
జనభేరి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచార భేరికి తొలిరోజు జనం నీరాజనాలు పలికారు. ప్రచారంలో భాగంగా నాలుగు రోజుల జిల్లా పర్యటనకు వచ్చిన షర్మిలకు తొలి రోజు సోమవారం ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. షర్మిల ఆవేశ పూరిత ప్రసంగానికి జేజేలు కొట్టారు. చంద్రబాబును గెలిపిస్తే రాష్ట్రానికి చంద్రగ్రహణం తప్పదన్న షర్మిల మాటలకు జనం ఈలలు, కేకలతో పెద్ద ఎత్తున స్పందించారు. తెలుగు జాతిని నిలువునా చీల్చిన కిరణ్, చంద్రబాబుకు దిమ్మతిరిగేలా వచ్చే ఎన్నికల్లో తీర్చు చెప్పాలన్న షర్మిల మాటలకు ప్రజలు సానుకూలంగా స్పందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామంటూ ప్రజలు షర్మిలకు హామీ ఇచ్చారు. సాక్షి, నెల్లూరు : వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి బయల్దేరిన షర్మిల సోమవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో నెల్లూరు జిల్లా సరిహద్దు ప్రాంతమైన మర్రిపాడుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమె పార్టీ శ్రేణు లు, కార్యకర్తల సందోహం మధ్య రోడ్‌షో ప్రారంభ మైంది. ఈ రోడ్‌షోలో జనం గ్రామ గ్రామాన ఆమెకు ఘన స్వాగతం పలికారు. షర్మిలను చూసేం దుకు మహిళలు, పిల్లలే కాకుండా పెద్ద ఎత్తున ప్రజలు ఎగబడ్డారు. అందరినీ పలకరిస్తూ షర్మిల రోడ్‌షో ఆత్మకూరు వరకు సాగింది. రాత్రి 7 గంటల ప్రాం తంలో ఆత్మకూరు పట్టణంలోని బస్టాం డు సెంటర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో షర్మిల ప్రసంగించారు. సభకు నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా జనం తరలి వచ్చారు. ముఖ్యంగా మహిళలు, యువత షర్మిలను చూసేందుకు ఎగబడ్డారు. షర్మిల అర్థవంతమైన ఆవేశపూరిత ప్రసంగం జనాన్ని మరింత ఆకట్టుకుంది. చంద్రబాబు తొమ్మిదేళ్ల దుష్టపాలనను షర్మిల ప్రజల కళ్లముందు పెట్టారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదలు ఎదుర్కొన్న కష్టాలను వివరించారు. ఆ తర్వాత దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల పాలనను ఆమె ప్రజలకు వివరించారు. వైఎస్సార్ పాలనలో విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు మొత్తంగా రాష్ట్ర ప్రజలు ఎంత అభివృద్ధి చెందింది వివరించారు. అన్ని వర్గాల వారికి సంక్షేమ, అభివృద్ధి ఫలాలను సంపూర్తిగా అందించినప్పటికీ ఏ ఒక్కరిపై పన్నుల భారం వేయకుండా వైఎస్సార్ పరిపాలించిన తీరును షర్మిల ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించారు. ఇప్పుడు తెలుగు జాతిని ముక్కలు చేసేందుకు చంద్రబాబు, కిరణ్ కుమార్‌రెడ్డిలే కారణమని, ఇందుకు బీజేపీ సహకరించిందని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చిత్తశుద్ధితో పోరాడిందన్న షర్మిల మాటలకు ప్రజలు నిజమే నిజమే అంటూ ఈలలు , కేకలతో ఉత్సాహపరిచారు. వైఎస్సార్ సువర్ణ పాలన రావాలంటే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని షర్మిల కోరారు. కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్లు రాకుండా చేస్తామంటూ జనం షర్మిలను మరింత ఉత్సాహపరిచారు. మున్సిపల్, పంచాయతీ రాజ్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు డిపాజిట్లు రాకుండా చేస్తే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు పోటీ చేసే పరిస్థితి లేకుండా చేయాలన్న షర్మిల మాటలకు అలాగే చేస్తామంటూ జనం కేకలు, ఈలలతో సమాధానమిచ్చారు. జగన్ జనం కోసమే ఉన్నాడని, మీ సుఖ సంతోషాల కోసం ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నాడంటూ షర్మిల ఉద్వేగ భరితంగా చేసిన ప్రసంగానికి మరింత స్పందన లభించింది. ఆద్యంతం సభకు వచ్చిన ప్రజలు ఉత్సాహంతో స్పందించారు. జగనే మా నాయకుడంటూ నినదించారు. రామరాజ్యం రావాల్సిందేనంటూ ఎలుగెత్తిచాటారు. జిల్లాలో తొలి రోజు షర్మిల ఎన్నికల ప్రచార కార్యక్రమం, రోడ్‌షో, సభ పెద్ద ఎత్తున విజయవంతమైంది. ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతమ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జైత్రయాత్ర
నువ్వే గెలుస్తావు నాయనా.. నీకు ఓటు వేసేందుకే ఇన్నాళ్లూ బతికున్నాను’ అని ఓ వృద్ధుడు.. ‘నిండు నూరేళ్లు చల్లగా ఉండు తండ్రీ.. మీ నాన్నలా ప్రజల్ని చల్లగా చూడు’ అంటూ ఓ అవ్వ.. ‘మీ నాన్న పెట్టిన ఆరోగ్య శ్రీ పథకం వల్లే నా మనుమరాలికి ఆపరేషన్ చేయించబోతున్నా. మీ కుటుంబం బాగుండాలి బాబూ’ అంటూ ఓ అమ్మమ్మ.. ‘ధరలు పెరిగిపోయాయి. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా కట్టుకోలేకపోతున్నా.. నువ్వు అధికారంలోకి వచ్చాక పేదోళ్ల గూడు సంగతి చూడు తమ్ముడూ’ అంటూ ఓ మహిళ.. ‘జగనన్నా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాల.. మాలాంటోళ్లను ఆదుకోవాల’ అంటూ ఓ వికలాంగుడు.. ‘అన్నా.. మా స్టూడెంట్స్ అంతా నీకే ఓటేస్తామంటున్నారు. నా ఓటూ నీకే. నువ్వు అధికారంలోకి వస్తేనే మాకు ఫీజులొస్తారుు.పై చదువులకు అవకాశం కుదురుతుంది. బెస్టాఫ్ లక్ జగనన్నా..’ అంటూ విద్యార్థులు.. ఎక్కడికెళ్లినా ఇవే మాటలు.. ఎవరిని కదిపినా ఇవే ఆకాంక్షలు. ‘బాధపడకండి. నాన్న నాకు ఒకటే చెప్పారు. ప్రజల కోసమే బతకమన్నారు. నేను ఆ మాటకే కట్టుబడి ఉన్నాను. కడవరకూ మీ వెంటే ఉంటా. రెండు నెలలు ఓపిక పట్టండి. రామరాజ్యం లాంటి రాజన్న రాజ్యాన్ని త్వరలోనే తెచ్చుకుందాం’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరికీ భరోసా ఇచ్చారు. ఆదివారం తణుకు, తాడేపల్లిగూడెం పట్టణాల్లో వైఎస్ జగన్ జనభేరి రోడ్ షో నిర్వహించారు. అడుగడుగునా అభిమాన ప్రవాహం అడ్డుపడగా.. అందరితోనూ ఆత్మీయంగా మాట్లాడుతూ.. అందరి సమస్యలను సావధానంగా వింటూ జననేత ముందుకు సాగారు. దీంతో రోడ్ షో ప్రతిచోట ప్రకటించిన సమయూనికంటే బాగా ఆలస్యంగా సాగింది. సాక్షి,ఏలూరు: ‘తమ్ముడూ.. అద్దె ఇళ్లల్లో మగ్గిపోతున్నాం’.. ‘బాబూ మాలాంటి వృద్ధులను నువ్వే ఆదుకోవాలి’.. ‘సార్.. మైనార్టీలను మీరే పట్టించుకోవాలి..’ అంటూ తణుకు, తాడేపల్లిగూడెం ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి తమ బాధలు చెప్పుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన జనభేరి రోడ్ షో ఆదివారం తణు కు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల మీదుగా సాగింది. ఎదురొచ్చిన చిన్నారులను ముద్దాడుతూ.. వికలాంగులు, వృద్ధుల వద్దకు తానే వెళ్లి వారి సమస్యల్ని తెలుసుకుంటూ.. పేదల బాధల్ని వింటూ వైఎస్ జగన్ ముందుకు వెళ్లారు. మహిళలు ప్రతిచోట ఆయనకు హారతులు పట్టారు. యువత పూల వర్షం కురిపించింది. మైనార్టీ, వెనుకబడిన వర్గాల ఆశాజ్యోతిలా జననేతను భావించిన ప్రజలు ఆయనకు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ‘మీరు అధికారంలోకి రాగానే మీ తండ్రిలా మమ్మల్ని ఆదుకోవాలయ్యూ’ అని కోరారు. అభిమాన సందోహంతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. వీధుల్లో బారులు తీరిన జనం వైఎస్ జగన్‌తో కరచాలనం కోసం ఎగబడ్డారు. మా నాయకుడు జగన్ అంటూ నినాదాలు చేశారు. పైడిపర్రులో మొదలై... ఉదయం 10 గంటలకు తణుకు పట్టణ పరిధిలోని పైడిపర్రు నుంచి రోడ్ షో మొదలైంది. అంతకుముందు ఏలూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆళ్ల నాని, ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పాతపాటి సర్రాజు తదితరులు జగన్మోహన్రెడ్డిని కలిశారు. కాన్వాయ్ సజ్జాపురం చేరుకోగా, అక్కడి మహిళలు వైఎస్ జగన్‌కు ఎదురెళ్లి తమ బాధలు చెప్పుకున్నారు. అద్దె ఇళ్లలో ఉంటున్నామని, ఇళ్లు నిర్మించాలని కోరారు. ‘మన ప్రభుత్వం వస్తుంది. ఆ వెంటనే మీ అందరికీ ఇళ్లు ఇచ్చే ఏర్పాటు చేస్తాం’ అని జగన్ భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి రైల్వేస్టేషన్ రోడ్‌కు చేరుకున్నారు. అక్కడ వృద్ధులు, మహిళలు ‘నువ్వే ముఖ్యమంత్రి అవుతావు’ అంటూ ఆశీర్వదించారు. నిరుపేద మహిళలు తమ సమస్యలను జననేతకు చెప్పుకున్నారు. అనంతరం రోడ్ షో వేల్పూరు రోడ్డులోని కప్పల వెంకన్న సెంటర్, పాతూరు వంతెన మీదుగా కొమ్మాయి చెరువు చేరుకుంది. ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం వల్ల కాలనీల్లో ఇళ్ల నిర్మా ణాలు మధ్యలోనే నిలిచిపోయాయని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని మహిళలు కోరారు. అక్కడ ఓ అభిమాని ఇచ్చిన కొబ్బరిబొండాం తాగిన జననేత పిల్లలకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. అక్కడి నుంచి ఇరగవరం కాలనీకి చేరుకున్నారు. అప్పటికే మధ్యాహ్నం 3 గంటలు కావచ్చింది. స్థానికులతో మాట్లాడారు. ట్రై సైకిల్‌పై కూర్చుని చూస్తున్న వికలాంగురాలు పాపాయమ్మను గమనించిన జగన్ ఆమె వద్దకు వెళ్లి పలకరించారు. పింఛను వస్తోందా అని ఆరా తీశారు. అక్కడి నుంచి తేతలి, దువ్వ మీదుగా పెంటపాడు మండలం అలంపురం చేరుకున్నారు. రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షుడు తన్నీరు ధర్మరాజు వైఎస్ జగన్‌ను కలిశారు. వడ్డెరలను ఎస్టీ జాబి తాలో చేర్చాలని, రాష్ట్రంలో 70 లక్షలకు పైగా ఉన్న తమ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం, నామినేటెడ్ పదవులు లేవని వివరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా తమకు ఆ అవకాశం కల్పించాలని కోరారు. గుంటూరు జిల్లా బీసీ సెల్ వైసీపీ అధ్యక్షురాలు గేవళ్ల రేవతి వైఎస్ జగన్‌ను కలిశారు. ప్రత్తిపాడులో పెంటపాడు మండల పార్టీ కన్వీనర్ వీర్లగోవిందు స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. జువ్వలపాలెంలో కనకదుర్గ గుడివద్ద పార్టీ నాయకులు గుండుమోగుల బలుసులు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో మహిళలు స్వాగతం పలికారు. సవితృపేటలో మార్నీడి వెంకన్న స్వాగతం పలికారు. అక్కడి నుంచి పోలీస్ ఐలండ్ సెంటర్‌కు జననేత చేరుకోగా, వేలాదిగా తరలివచ్చిన జనంతో ఆ ప్రాంతమంతా నిండిపోరుుంది. అభిమానులు ఆయనపై పూలవర్షం కురిపించారు. అక్కడి నుంచి రైల్వే ఓవర్ బ్రిడ్జి, మునిసిపల్ కార్యాలయం మీదుగా మసీదు సెంటర్‌కు చేరుకున్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజలను పలకరించారు. వైఎస్ జగన్ కొంచెం ముందుకు వెళ్లగా, ముస్లిం మహిళ షేక్ జమీనా బేగం ఆయనను కలిశారు. ‘మీ తండ్రిలా మీరూ ఆయన బాటలో నడవాలి. మా కష్టాలు మీరే తీర్చాలి. సంక్షేమ పథకాలు అమలు చేయూలి’ అని విజ్ఞప్తి చేశారు. ముస్లిం పెద్ద అబ్దుల్‌ఘని ఇస్లాం సంప్రదాయం ప్రకారం వైఎస్ జగన్‌కు టోపీ, శాలువా అలంకరించి స్వాగతం పలికారు. మైనార్టీల అభివృద్ధికి సహకరించాల్సిందిగా కోరారు. 10వ వార్డు వైసీపీ అభ్యర్థి తోట కనకలక్ష్మితోపాటు మహిళలు గులాబీ రేకులు చల్లారు. కర్రి సత్యవతి నగర్లో చెట్ల వీధి వద్ద కర్ణాటకలోని గుల్బర్గాలో వైఎస్‌తో కలసి వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్ దాసం వెంకటేశ్వరరావు జననేతను కలిశారు. వైఎస్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, తణుకు నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య, తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపీ, నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త ముదునూరి ప్రసాదరాజు, ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త కండిబోయిన శ్రీనివాస్, దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త అశోక్‌గౌడ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వెంకట్, తణుకు మండల కన్వీనర్ వీరవల్లి తాలేశ్వరావు, అత్తిలి మండల కన్వీనర్ యలగల అమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నాయకుడికి విశ్వసనీయత ఉండాలి
-
కాంగ్రెస్‌కు, చంద్రబాబుకు ఓటు అడిగే దమ్ముందా?:జగన్
-
కాంగ్రెస్‌కు, చంద్రబాబుకు ఓటు అడిగే దమ్ముందా?:జగన్
ఖమ్మం: ఈ మంచి పనులు చేశాం అని కాంగ్రెస్ పార్టీకి గానీ, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు గానీ ఓటు అడిగే దమ్ముందా? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ప్రశ్నించారు. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో రాత్రి 8 గంటలకు జరిగిన వైఎస్ఆర్సిపి జనభేరి సభలో ఆయన ప్రసంగించారు. సమైక్యాంధ్ర అంటే తనకు అన్ని ప్రాంతాలు, అందరూ కావాలని అర్ధం అని చెప్పారు. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు. తెలంగాణలో కూడా వైఎస్ఆర్ సిపి ఉంటుందని చెప్పారు. ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అభివృద్ధి చేశారు కాబట్టే ప్రతి ఒక్కరి గుండెలోతుల్లో వైఎస్ఆర్ ఉన్నారన్నారు. రాముని రాజ్యం ఐతే చూడలేదు కాని రాజశేఖరుని సువర్ణయుగం చూశానని గర్వంగా చెప్పొచ్చు అన్నారు. చదువు కోసం పేదవాడు అప్పులపాలు కాగూడదని వైఎస్ తపించారు. పేదవాడు అప్పులపాలు కాకూడదని 108 ఏర్పాటు చేశారు. నేడు టార్చిలైట్ వేసి వెతికినా విశ్వసనీయతకు అర్థం తెలీని రోజులు ఇవి. దిగజారి పోయిన రాజకీయవ్యవస్థను చూస్తూంటే గుండెలు తరుక్కుపోతున్నాయి. కరెంట్ బిల్లు ఎంతో, సర్‌ఛార్జి ఎంతో తెలీని పరిస్థితి నెలకొంది. ఎన్నికలకు కేవలం 2 నెలలున్నాయనగా ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని విడగొట్టారు. కాంగ్రెస్ , బీజేపీలు కలిసిపోయి తెలుగుజాతిని వేరు చేశారు. ప్రజల భావోద్వేగాలను సొమ్ము చేసుకునేందుకు రాష్ట్రాన్ని విడదీయడం భావ్యమేనా? అని జగన్ ప్రశ్నించారు. తాను సమైక్యం అన్నాను. నిజమే. దానర్థం మూడు ప్రాంతాల్లో తన సోదరులు, సోదరీమణులు ఉన్నారు. అన్నీ చోట్ల వెలుగులు నింపడమే తన స్వప్నం అని చెప్పారు. భూములైతే వేరు చేశారు కానీ తెలుగువారి మనసులను వేరుచేయలేరు. వారి మధ్య ప్రేమలు, ఆప్యాయతలు వేరుచేయలేరు అని అన్నారు. పార్టీ తరపున తెలంగాణలో తొలి లోక్‌సభ అభ్యర్థిని ప్రకటించారు. ఖమ్మం నుంచి లోక్‌సభ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీనివాసరెడ్డిని సభకు పరిచయం చేశారు. శ్రీనును గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసేందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గెలిపిద్దాం అన్నారు. తెలంగాణలో కూడా మెజార్టీ ఎంపీలను గెలుచుకుంటామని చెప్పారు. రెండు ప్రాంతాల్లో వైఎస్ఆర్ సీపీ రాజన్న రాజ్యం తెస్తుందని జగన్ చెప్పారు. జనం భారీగా తరలివచ్చారు. గ్రౌండ్ అంతా జనం కిక్కిరిసిపోయారు. తెలంగాణలో పార్టీకి ఎంత బలం ఉందో ఆ జనాన్ని చూస్తే అర్ధమవుతుంది. జగన్ రావడం నాలుగు గంటలు ఆలస్యమైనా జనం వేచిఉన్నారు. -
వైరాలో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం
ఖమ్మం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి వైరా చేరుకున్నారు. ఖమ్మంలో జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనభేరీ పాల్గొనేందుకు జగన్ వెళుతున్నారు. మార్గమధ్యలో వైరాలో ఆగారు. జగన్ రాక సందర్భంగా జనం భారీగా తరలి వచ్చారు. వైరాలో రోడ్డు వెంబట ఇరువైపుల జనం బారులు తీరారు. కార్యకర్తలు, అభిమానులు జగన్‌కు ఘనస్వాతం పలికారు. -
చంద్రబాబు పాలన భయానకం
-
జనభేరి మోగింది
వైఎస్ జగన్ ‘పశ్చిమ’ పర్యటనలో పోటెత్తిన జనం దారి పొడవునా ఉప్పొంగిన అభిమాన ప్రవాహం లారీలు, ఆటోల్లో స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు కిక్కిరిసిన సభా ప్రాంగణం ప్రతి ఒక్కరినీ పలకరించి ఆప్యాయత పంచుకున్న జననేత ప్రజల కన్నీళ్లు తుడుస్తూ.. భవిష్యత్‌పై భరోసా ఇస్తూ ముందుకు సాగిన జగన్మోహన్రెడ్డి సాక్షి, ఏలూరు: ‘చెల్లెమ్మా.. ఈ కన్నీరు శాశ్వతం కాదమ్మా.. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుంది. మీ కష్టాలు తీరుతాయి. మీ అందరికీ అండగా.. ఎప్పుడూ మీ వెంటే ఉంటాను’ తనను కలిసి కన్నీరు పెట్టుకున్న విద్యార్థినులకు జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా కల్పించారు. ‘అవ్వా.. మనపార్టీ అధికారంలోకి వస్తుంది. త్వరలోనే నీ కష్టాలు తీరుతారుు’ వృద్ధులకు అని అభయమిచ్చారు. అన్నదాతలకు ఆసరాగా నిలుస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. ‘వైఎస్సార్ జనభేరి’ పేరుతో ఎన్నికల శంఖారావం పూరిం చేందుకు సోమవారం హనుమాన్ జంక్షన్ మీదుగా జిల్లాలోకి ప్రవేశించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో దిగిన వైఎస్ జగన్‌కు వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్లిన వైఎస్ జగన్ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త దుట్టా రామచంద్రరావు నివాసంలో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ‘పశ్చిమ’ పర్యటనకు బయలుదేరారు. జంక్షన్లో ఆంజనేయస్వామిని దర్శిం చుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం రోడ్ షో ప్రారంభించారు. దారి పొడవునా ప్రజలు కాన్వాయ్‌ని ఆపి తమ కష్టాలు చెప్పుకున్నారు. కలపర్రు గ్రామస్తులు జాతీయ రహదారిపై జననేతను కలిశారు. తమ గ్రామంలోకి రావాలని పట్టుబట్టారు. వారి అభిమాన్ని కాదనలేకపోరుున జగన్మోహన్రెడ్డి గ్రామంలోకి వెళ్లారు. అక్కడ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మళ్లొస్తానంటూ వారినుంచి సెలవు తీసుకుని ఏలూరు వైపు సాగారు. దారిలో రామచంద్ర ఇంజినీరింగ్, సీఆర్ఆర్ కళాశాలల విద్యార్థులు ఆయనను చూడటానికి, కరచాలనం చేయడానికి ఎగబడ్డారు. వట్లూరు గేటు దాటి కొత్త బస్టాండ్, ఫైర్‌స్టేషన్ సెంటర్, వసంతమహల్ సెంటర్, పాత బస్టాండ్ మీదుగా అల్లూరి సీతారామరాజు స్టేడియానికి చేరుకోవడానికి దాదాపు 3 గంట ల సమయం పట్టింది. అడుగడుగునా ప్రజలు ‘జై జగన్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. భారీ స్థారుులో తరలివచ్చిన యువకులు బైక్ ర్యాలీ చేస్తూ వైఎస్ జగన్‌ను అనుసరించారు. దారిపొడవునా ఆయనతో కరచాలనం చేసేందుకు ప్రజలు పోటీపడ్డారు. వారందరినీ ఆయన చిరునవ్వుతో పలకరించారు. ఉద్వేగ భరితంగా జననేత ప్రసంగం మోసపూరిత మాటలతో స్వార్థపరుల వంచనతో విసిగి పోయిన జనానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగంలో నిజాయితీ కనిపించింది. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి బాధతో, యువనేత ఉద్వేగ భరితంగా పలికిన ప్రతి మాటా, చేసిన ప్రతి వాగ్దానం జనం గుండెను తాకాయి. రానున్న ఎన్నికల్లో విశ్వసనీయత, నిజాయితీతో కూడిన ప్రభుత్వాన్ని మనమే ఏర్పాటు చేసుకుందామని, ఇతర రాష్ట్రాలు గర్వపడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకుందామని ఆయన ఇచ్చిన పిలుపు జనాన్ని ఉత్సాహపరిచింది. ముఖ్యమంత్రి అయ్యాక నాలుగు సంతకాలు పెడతానని, అవి చరి త్రను మార్చే సంతకాలని దృఢ నిశ్చయంతో జననేత హామీ ఇచ్చిన సందర్భంలో జనం కళ్లలో వెలుగు కనిపించింది. కిక్కిరిసిన సభా ప్రాంగణం జనభేరి సభా ప్రాంగణం ఇసుకవేస్తే రాలనంత జనసందోహంతో కిక్కిరిసిపోరుుంది. దాదాపు 25 నిమిషాలపాటు సాగిన వైఎస్ జగన్ ప్రసంగానికి సభికులు జయజయధ్వానాలు పలికారు. సభాస్థలి పూర్తిగా నిండిపోయి, కనీసం నిలబడటానికి కూడా స్థానం లేకపోవడంతో సుమారు 30వేల మంది స్టేడియం బయట ఉండిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెం టరీ నియోజకవర్గ పరిశీలకులు తోట చంద్రశేఖర్, వైసీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, మాజీ మంత్రులు పిల్లిసుభాష్ చంద్రబోస్, పినిపే విశ్వరూప్, చేగొండి హరిరామజోగయ్య, మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, మద్దాల రాజే ష్, కొడాలి నాని, పాతపాటి సర్రాజు, ఇందుకూరి రామకృష్ణంరాజు, గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, అల్లు వెంకట సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాధరాజు, పేర్ని నాని, ఎమ్మెల్సీలు మేకా ప్రతాప అప్పారావు, మేకా శేషుబాబు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు తోట గోపి, పుప్పాల వాసు, వైసీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, పార్టీ అధికార ప్రతినిధులు ఊదరగొండి చంద్రమౌళి, ఘంటాప్రసాద్, బొద్దాని శ్రీనివాస్, దొడ్డిగర్ల సువర్ణరాజు, ఏలూరు నగర కన్వీనర్ గుడిదేసి శ్రీనివాస్ తదితరులు వైఎస్ జగన్ వెంట ఉన్నారు. జనభేరి సైడ్ లైట్స్ వన్స్‌మోర్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ వంగపండు ఉష బృందం ఆలపించిన పాటలు సభికులను అలరించాయి. వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కట్టిన పాటలను వన్స్‌మోర్ అంటూ అడిగి మళ్లీ మళ్లీ పాడించుకున్నారు. ఆ పాటలకు అభిమానులు నృత్యాలు చేశారు. జగనే మా ముఖ్యమంత్రి : జగనన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారంతా చేతులెత్తాలని వంగపండు ఉష కోరగా, సభాస్థలిలో ఉన్నవారంతా పిడికిలి బిగించి చేతులెత్తి తమ మద్దతు తెలిపారు. జగనే మా ముఖ్యమంత్రి అంటూ ముక్తకంఠంతో నినదించారు. నీకన్నా బాగా పరిపాలిస్తా : వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ప్రసంగంలో ‘చంద్రబాబూ నీకన్నా 25 ఏళ్ళ చిన్నవాణ్ణి అయినా నీకన్నా బాగా పరిపాలిస్తా’ అనగానే సభికులు అవును అవును అంటూ ఒక్కసారిగా నినదించారు. నేడు వైఎస్ జగన్ పర్యటన ఇలా ఏలూరు, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘వైఎస్సార్ జనభేరి’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోడ్డు షో నిర్వహిస్తూ నిడదవోలు చేరు కుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని నల్లజర్ల మండ లం దూబచర్ల నుంచి ప్రారంభమయ్యే రోడ్డు షో నల్లజర్ల, అనంతపల్లి, దేవరపల్లి, పంగిడి, చాగల్లు, బ్రాహ్మణగూడెం మీదుగా నిడదవోలు చేరుతుంది. సాయంత్రం 4 గంటలకు నిడదవోలు గాంధీ చౌక్‌లో ఏర్పాటు చేసిన జనభేరి బహిరంగ సభలో జగన్మోహన్రెడ్డి ప్రసంగిస్తారు.