దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే ఒక ఆశయం, నమ్మకం, భరోసా అని వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. జిల్లాలోని ఆళ్లగడ్డ ఎన్నికల రోడ్ షో ప్రసంగించిన విజయమ్మకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అక్కడకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. కార్పొరేట్ వైద్యం చేయించుకోవడానికి పేదవాడు భయపడకూడదనే ఉద్దేశంతోనే ఆనాడు ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంగతిని గుర్తు చేశారు. ప్రతీ పేదవాడికి వైద్యం దగ్గరగా ఉండాలని యోచన చేయబట్టే ఆరోగ్యశ్రీ పథకాన్నిరాజశేఖరెడ్డి ఆచరణలో పెట్టి విజయవంతమైయ్యారన్నారు. అంతేకాకుండా అత్యవసర సేవల్లో భాగంగా108ను తీసుకువచ్చారని తెలిపారు. విద్యార్థుల కోసం ఫీజురీయింబర్స్‌మెంట్ ను,రైతుల సౌభాగ్యం కోసం జలయజ్ఞం తలపెట్టారన్నారు. వైఎస్ఆర్ అంటేనే ఒక ఆశయం, నమ్మకం, భరోసా అని విజయమ్మ తెలిపారు. ప్రతి గ్రామంలో బెల్టుషాపులు పుట్టడానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే ప్రధాన కారణమన్నారు. ఇప్పుడు అన్నీ ఆల్ ఫ్రీ అంటున్నచంద్రబాబు తన హయాంలో పేదవాడికి ఏమైనా చేశారాని ఆమె ప్రశ్నించారు. విద్యార్థులు మెస్ ఛార్జీలు పెంచమని అడిగితే లాఠీఛార్జ్ చేయించారన్నారు. ఉద్యోగుల్లో 65 శాతం మంది అవినీతి ఉద్యోగులున్నారని ఆనాడు చంద్రబాబు ఆరోపించారన్నారు. ఆయన పాలన అంతా అవినీతిమయమేనని విజయమ్మ అభివర్ణించారు. రాబోవు ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించి రాజన్న రాజ్యాన్ని తిరిగి తీసుకురావడానికి కృషి చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.