'జీహెచ్ఎంసీ జీవోను రద్దు చేసింది చంద్రబాబే'
హైదరాబాద్: చంద్రబాబు ఎంత నియంతో హిట్లర్ కూడా అంతే నియంత అని వైఎస్ షర్మిల అన్నారు. హిట్లర్‌కు ఎంత అధికార దాహమో చంద్రబాబుకూ అంతే అధికారదాహమని పేర్కొన్నారు. ఇద్దరూ ఒకే రోజున పుట్టారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా యూసుఫ్‌గూడలో నిర్వహించిన రోడ్ షోలో షర్మిల ప్రసంగించారు.
ఓడిపోతాననే భయంతో చంద్రబాబు గోబెల్స్ ప్రచారానికి తెరలేపారని ఆరోపించారు. హైటెక్ సిటీ ఒక్కటి కట్టి హైదరాబాద్ మొత్తం తానే అభివృద్ధి చేశాడని గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. నాడు జీహెచ్ఎంసీ జీవోను రద్దు చేసింది చంద్రబాబేనని గుర్తు చేశారు. ఐఎంజీకి అప్పనంగా భూములు కట్టబెట్టారని ఆరోపించారు. చంద్రబాబు దృష్టిలో లోకకల్యాణం అంటే లోకేష్ కల్యాణం అని అర్థమని షర్మిల ఎద్దేవా చేశారు.