Yosufguda
-
HYD: సిటీ బస్సు బీభత్సం.. స్పాట్లోనే వ్యక్తి మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలో సిటీ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అధిక వేగంలో ఉన్న సిటీ బస్సు.. ఎక్స్ఎల్ సూపర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎక్స్ఎల్ సూపర్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాల ప్రకారం.. యూసఫ్‌గూడలోని రెహ్మత్‌నగర్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అధిక వేగంలో ఉన్న సిటీ ఆర్టీసీ బస్సు.. ముందు వెళ్తున్న ఎక్స్ఎల్ సూపర్ వాహనాన్ని ఢీకొట్టింది. బస్సు ముందు టైరు.. వాహనంపైకి కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎక్స్ఎల్ వాహనంపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే.. డ్రైవర్, కండక్టర్ బస్సు దిగి పరారయ్యారు. ఇది కూడా చదవండి: హైటెక్ సిటీ: ప్రాణం తీసిన అతివేగం.. స్వీటీ పాండే మృతి -
మరీ ఇంత మోసమా! స్నేహితుడే కదా అని నమ్మి ఇంట్లోకి రమ్మంటే..
బంజారాహిల్స్: స్నేహితుడని నమ్మి ఇంట్లో ఆశ్రయం కల్పిస్తే ఉన్నదంతా ఊడ్చుకెళ్లాడో నమ్మకద్రోహి. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. యూసుఫ్‌గూడ సమీపంలోని రహమ్మత్‌నగర్‌లో నివాసం ఉండే పోతాల కుమార్‌కు తన స్వగ్రామానికి చెందిన స్నేహితుడు తిప్పన షాలేమ్‌రాజ్ ఈ నెల రెండో వారంలో ఫోన్ చేసి తాను వారం రోజుల్లో గది అద్దెకు తీసుకుంటానని... అప్పటి వరకు ఇంట్లో ఉంటానంటూ కోరాడు. (చదవండి: రిజర్వేషన్లు కల్పించాలని చట్టంలో ఎక్కడుంది?) ఇందుకు కుమార్ అంగీకరించి షాలేమ్‌రాజ్‌తో పాటు తన భార్యను తన గదిలో ఉంచుకున్నాడు. ఈ నెల 14వ తేదీన కుమార్ కూకట్‌పల్లికి వెళ్లి తిరిగి వచ్చే సరికి ఇంట్లో ఉండాల్సిన రెండు ల్యాప్‌టాప్‌లతో పాటు బైక్ చోరీకి గురయ్యాయి. స్నేహితుడు షాలేమ్‌రాజ్‌తో పాటు ఆయన భార్య ఇంట్లో నుంచి ఉడాయించారు. కొద్దిసేపట్లోనే ఆయనకు బ్యాంక్ నుంచి రూ. 1.70 లక్షలు డ్రా అయినట్లుగా సమాచారం వచ్చింది. వెంటనే బ్యాంక్‌కు వెళ్లి ఆరా తీయగా తన అకౌంట్ నుంచి షాలేమ్‌రాజ్ బ్యాంక్ అకౌంట్లోకి ఈ డబ్బు బదిలీ అయినట్లుగా తెలిపారు. తన మొబైల్ నంబర్‌కు బ్యాంక్ అకౌంట్ అనుసంధానంగా ఉందని మొబైల్ ఫోన్లోంచి సిమ్ కార్డు దొంగిలించి షాలేమ్‌రాజ్ ఈ డబ్బులు బదిలీ చేయించుకున్నట్లుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసులు షాలేమ్‌రాజ్‌పై ఐపీసీ సెక్షన్ 380 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: వాక్‌వేలో కుక్క పిల్లలను చంపిన బాలుడు) -
'జీహెచ్ఎంసీ జీవోను రద్దు చేసింది చంద్రబాబే'
హైదరాబాద్: చంద్రబాబు ఎంత నియంతో హిట్లర్ కూడా అంతే నియంత అని వైఎస్ షర్మిల అన్నారు. హిట్లర్‌కు ఎంత అధికార దాహమో చంద్రబాబుకూ అంతే అధికారదాహమని పేర్కొన్నారు. ఇద్దరూ ఒకే రోజున పుట్టారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా యూసుఫ్‌గూడలో నిర్వహించిన రోడ్ షోలో షర్మిల ప్రసంగించారు. ఓడిపోతాననే భయంతో చంద్రబాబు గోబెల్స్ ప్రచారానికి తెరలేపారని ఆరోపించారు. హైటెక్ సిటీ ఒక్కటి కట్టి హైదరాబాద్ మొత్తం తానే అభివృద్ధి చేశాడని గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. నాడు జీహెచ్ఎంసీ జీవోను రద్దు చేసింది చంద్రబాబేనని గుర్తు చేశారు. ఐఎంజీకి అప్పనంగా భూములు కట్టబెట్టారని ఆరోపించారు. చంద్రబాబు దృష్టిలో లోకకల్యాణం అంటే లోకేష్ కల్యాణం అని అర్థమని షర్మిల ఎద్దేవా చేశారు.