
జైత్రయాత్ర
నువ్వే గెలుస్తావు నాయనా.. నీకు ఓటు వేసేందుకే ఇన్నాళ్లూ బతికున్నాను’ అని ఓ వృద్ధుడు.. ‘నిండు నూరేళ్లు చల్లగా ఉండు తండ్రీ.. మీ నాన్నలా ప్రజల్ని చల్లగా చూడు’ అంటూ ఓ అవ్వ..
నువ్వే గెలుస్తావు నాయనా.. నీకు ఓటు వేసేందుకే ఇన్నాళ్లూ బతికున్నాను’ అని ఓ వృద్ధుడు.. ‘నిండు నూరేళ్లు చల్లగా ఉండు తండ్రీ.. మీ నాన్నలా ప్రజల్ని చల్లగా చూడు’ అంటూ ఓ అవ్వ..
‘మీ నాన్న పెట్టిన ఆరోగ్య శ్రీ పథకం వల్లే నా మనుమరాలికి ఆపరేషన్ చేయించబోతున్నా.
మీ కుటుంబం బాగుండాలి బాబూ’ అంటూ ఓ అమ్మమ్మ.. ‘ధరలు పెరిగిపోయాయి. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా కట్టుకోలేకపోతున్నా.. నువ్వు అధికారంలోకి వచ్చాక పేదోళ్ల గూడు సంగతి చూడు తమ్ముడూ’ అంటూ ఓ మహిళ.. ‘జగనన్నా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాల.. మాలాంటోళ్లను ఆదుకోవాల’ అంటూ ఓ వికలాంగుడు.. ‘అన్నా.. మా స్టూడెంట్స్ అంతా నీకే ఓటేస్తామంటున్నారు. నా ఓటూ నీకే. నువ్వు అధికారంలోకి వస్తేనే మాకు ఫీజులొస్తారుు.పై చదువులకు అవకాశం కుదురుతుంది. బెస్టాఫ్ లక్ జగనన్నా..’ అంటూ విద్యార్థులు..
ఎక్కడికెళ్లినా ఇవే మాటలు.. ఎవరిని కదిపినా ఇవే ఆకాంక్షలు. ‘బాధపడకండి. నాన్న నాకు ఒకటే చెప్పారు. ప్రజల కోసమే బతకమన్నారు. నేను ఆ మాటకే కట్టుబడి ఉన్నాను. కడవరకూ మీ వెంటే ఉంటా. రెండు నెలలు ఓపిక పట్టండి. రామరాజ్యం లాంటి రాజన్న రాజ్యాన్ని త్వరలోనే తెచ్చుకుందాం’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందరికీ భరోసా ఇచ్చారు.
ఆదివారం తణుకు, తాడేపల్లిగూడెం పట్టణాల్లో వైఎస్ జగన్ జనభేరి రోడ్ షో నిర్వహించారు. అడుగడుగునా అభిమాన ప్రవాహం అడ్డుపడగా.. అందరితోనూ ఆత్మీయంగా మాట్లాడుతూ.. అందరి సమస్యలను సావధానంగా వింటూ జననేత ముందుకు సాగారు.
దీంతో రోడ్ షో ప్రతిచోట ప్రకటించిన సమయూనికంటే బాగా ఆలస్యంగా సాగింది.
సాక్షి,ఏలూరు:
‘తమ్ముడూ.. అద్దె ఇళ్లల్లో మగ్గిపోతున్నాం’.. ‘బాబూ మాలాంటి వృద్ధులను నువ్వే ఆదుకోవాలి’.. ‘సార్.. మైనార్టీలను మీరే పట్టించుకోవాలి..’ అంటూ తణుకు, తాడేపల్లిగూడెం ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తమ బాధలు చెప్పుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన జనభేరి రోడ్ షో ఆదివారం తణు కు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల మీదుగా సాగింది.
ఎదురొచ్చిన చిన్నారులను ముద్దాడుతూ.. వికలాంగులు, వృద్ధుల వద్దకు తానే వెళ్లి వారి సమస్యల్ని తెలుసుకుంటూ.. పేదల బాధల్ని వింటూ వైఎస్ జగన్ ముందుకు వెళ్లారు. మహిళలు ప్రతిచోట ఆయనకు హారతులు పట్టారు. యువత పూల వర్షం కురిపించింది. మైనార్టీ, వెనుకబడిన వర్గాల ఆశాజ్యోతిలా జననేతను భావించిన ప్రజలు ఆయనకు తమ గోడును వెళ్లబోసుకున్నారు.
‘మీరు అధికారంలోకి రాగానే మీ తండ్రిలా మమ్మల్ని ఆదుకోవాలయ్యూ’ అని కోరారు. అభిమాన సందోహంతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. వీధుల్లో బారులు తీరిన జనం వైఎస్ జగన్‌తో కరచాలనం కోసం ఎగబడ్డారు. మా నాయకుడు జగన్ అంటూ నినాదాలు చేశారు.
పైడిపర్రులో మొదలై...
ఉదయం 10 గంటలకు తణుకు పట్టణ పరిధిలోని పైడిపర్రు నుంచి రోడ్ షో మొదలైంది. అంతకుముందు ఏలూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఆళ్ల నాని, ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పాతపాటి సర్రాజు తదితరులు జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. కాన్వాయ్ సజ్జాపురం చేరుకోగా, అక్కడి మహిళలు వైఎస్ జగన్‌కు ఎదురెళ్లి తమ బాధలు చెప్పుకున్నారు. అద్దె ఇళ్లలో ఉంటున్నామని, ఇళ్లు నిర్మించాలని కోరారు. ‘మన ప్రభుత్వం వస్తుంది. ఆ వెంటనే మీ అందరికీ ఇళ్లు ఇచ్చే ఏర్పాటు చేస్తాం’ అని జగన్ భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి రైల్వేస్టేషన్ రోడ్‌కు చేరుకున్నారు. అక్కడ వృద్ధులు, మహిళలు ‘నువ్వే ముఖ్యమంత్రి అవుతావు’ అంటూ ఆశీర్వదించారు. నిరుపేద మహిళలు తమ సమస్యలను జననేతకు చెప్పుకున్నారు. అనంతరం రోడ్ షో వేల్పూరు రోడ్డులోని కప్పల వెంకన్న సెంటర్, పాతూరు వంతెన మీదుగా కొమ్మాయి చెరువు చేరుకుంది.
ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం వల్ల కాలనీల్లో ఇళ్ల నిర్మా ణాలు మధ్యలోనే నిలిచిపోయాయని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని మహిళలు కోరారు. అక్కడ ఓ అభిమాని ఇచ్చిన కొబ్బరిబొండాం తాగిన జననేత పిల్లలకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. అక్కడి నుంచి ఇరగవరం కాలనీకి చేరుకున్నారు. అప్పటికే మధ్యాహ్నం 3 గంటలు కావచ్చింది. స్థానికులతో మాట్లాడారు. ట్రై సైకిల్‌పై కూర్చుని చూస్తున్న వికలాంగురాలు పాపాయమ్మను గమనించిన జగన్ ఆమె వద్దకు వెళ్లి పలకరించారు.
పింఛను వస్తోందా అని ఆరా తీశారు. అక్కడి నుంచి తేతలి, దువ్వ మీదుగా పెంటపాడు మండలం అలంపురం చేరుకున్నారు. రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షుడు తన్నీరు ధర్మరాజు వైఎస్ జగన్‌ను కలిశారు. వడ్డెరలను ఎస్టీ జాబి తాలో చేర్చాలని, రాష్ట్రంలో 70 లక్షలకు పైగా ఉన్న తమ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం, నామినేటెడ్ పదవులు లేవని వివరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా తమకు ఆ అవకాశం కల్పించాలని కోరారు.
గుంటూరు జిల్లా బీసీ సెల్ వైసీపీ అధ్యక్షురాలు గేవళ్ల రేవతి వైఎస్ జగన్‌ను కలిశారు. ప్రత్తిపాడులో పెంటపాడు మండల పార్టీ కన్వీనర్ వీర్లగోవిందు స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. జువ్వలపాలెంలో కనకదుర్గ గుడివద్ద పార్టీ నాయకులు గుండుమోగుల బలుసులు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో మహిళలు స్వాగతం పలికారు. సవితృపేటలో మార్నీడి వెంకన్న స్వాగతం పలికారు. అక్కడి నుంచి పోలీస్ ఐలండ్ సెంటర్‌కు జననేత చేరుకోగా, వేలాదిగా తరలివచ్చిన జనంతో ఆ ప్రాంతమంతా నిండిపోరుుంది. అభిమానులు ఆయనపై పూలవర్షం కురిపించారు. అక్కడి నుంచి రైల్వే ఓవర్ బ్రిడ్జి, మునిసిపల్ కార్యాలయం మీదుగా మసీదు సెంటర్‌కు చేరుకున్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజలను పలకరించారు. వైఎస్ జగన్ కొంచెం ముందుకు వెళ్లగా, ముస్లిం మహిళ షేక్ జమీనా బేగం ఆయనను కలిశారు.
‘మీ తండ్రిలా మీరూ ఆయన బాటలో నడవాలి. మా కష్టాలు మీరే తీర్చాలి. సంక్షేమ పథకాలు అమలు చేయూలి’ అని విజ్ఞప్తి చేశారు. ముస్లిం పెద్ద అబ్దుల్‌ఘని ఇస్లాం సంప్రదాయం ప్రకారం వైఎస్ జగన్‌కు టోపీ, శాలువా అలంకరించి స్వాగతం పలికారు. మైనార్టీల అభివృద్ధికి సహకరించాల్సిందిగా కోరారు. 10వ వార్డు వైసీపీ అభ్యర్థి తోట కనకలక్ష్మితోపాటు మహిళలు గులాబీ రేకులు చల్లారు.
కర్రి సత్యవతి నగర్‌లో చెట్ల వీధి వద్ద కర్ణాటకలోని గుల్బర్గాలో వైఎస్‌తో కలసి వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్ దాసం వెంకటేశ్వరరావు జననేతను కలిశారు. వైఎస్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, తణుకు నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య, తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపీ, నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త ముదునూరి ప్రసాదరాజు, ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త కండిబోయిన శ్రీనివాస్, దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త అశోక్‌గౌడ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వెంకట్, తణుకు మండల కన్వీనర్ వీరవల్లి తాలేశ్వరావు, అత్తిలి మండల కన్వీనర్ యలగల అమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.