కాంగ్రెస్కు, చంద్రబాబుకు ఓటు అడిగే దమ్ముందా?:జగన్ | can ask vote Congress or Chandrababu ? : YS Jagan | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్కు, చంద్రబాబుకు ఓటు అడిగే దమ్ముందా?:జగన్

Published Wed, Mar 5 2014 8:28 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్కు, చంద్రబాబుకు ఓటు అడిగే దమ్ముందా?:జగన్ - Sakshi

కాంగ్రెస్కు, చంద్రబాబుకు ఓటు అడిగే దమ్ముందా?:జగన్

ఈ మంచి పనులు చేశాం అని కాంగ్రెస్ పార్టీకి గానీ, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు గానీ ఓటు అడిగే దమ్ముందా? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ప్రశ్నించారు.

ఖమ్మం: ఈ మంచి పనులు చేశాం అని కాంగ్రెస్ పార్టీకి గానీ, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు గానీ ఓటు అడిగే దమ్ముందా? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ప్రశ్నించారు. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో రాత్రి 8 గంటలకు జరిగిన వైఎస్ఆర్సిపి జనభేరి సభలో ఆయన ప్రసంగించారు. సమైక్యాంధ్ర అంటే తనకు అన్ని ప్రాంతాలు, అందరూ కావాలని అర్ధం అని చెప్పారు. తెలంగాణ, రాయలసీమ,  ఆంధ్రా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు. తెలంగాణలో కూడా వైఎస్ఆర్ సిపి ఉంటుందని చెప్పారు.

ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అభివృద్ధి చేశారు కాబట్టే ప్రతి ఒక్కరి గుండెలోతుల్లో వైఎస్ఆర్ ఉన్నారన్నారు. రాముని రాజ్యం ఐతే చూడలేదు కాని రాజశేఖరుని సువర్ణయుగం చూశానని గర్వంగా చెప్పొచ్చు అన్నారు. చదువు కోసం పేదవాడు అప్పులపాలు కాగూడదని వైఎస్ తపించారు. పేదవాడు అప్పులపాలు కాకూడదని 108 ఏర్పాటు చేశారు. నేడు టార్చిలైట్ వేసి వెతికినా  విశ్వసనీయతకు అర్థం తెలీని రోజులు ఇవి.  దిగజారి పోయిన రాజకీయవ్యవస్థను చూస్తూంటే గుండెలు తరుక్కుపోతున్నాయి. కరెంట్ బిల్లు ఎంతో, సర్ఛార్జి ఎంతో తెలీని పరిస్థితి నెలకొంది. ఎన్నికలకు కేవలం 2 నెలలున్నాయనగా ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని విడగొట్టారు. కాంగ్రెస్ , బీజేపీలు కలిసిపోయి తెలుగుజాతిని వేరు చేశారు. ప్రజల భావోద్వేగాలను సొమ్ము చేసుకునేందుకు రాష్ట్రాన్ని విడదీయడం  భావ్యమేనా? అని జగన్ ప్రశ్నించారు.

తాను సమైక్యం అన్నాను. నిజమే. దానర్థం మూడు ప్రాంతాల్లో తన సోదరులు, సోదరీమణులు ఉన్నారు. అన్నీ చోట్ల వెలుగులు నింపడమే తన  స్వప్నం అని చెప్పారు. భూములైతే వేరు చేశారు కానీ తెలుగువారి మనసులను వేరుచేయలేరు.  వారి మధ్య ప్రేమలు, ఆప్యాయతలు వేరుచేయలేరు అని అన్నారు.

పార్టీ తరపున తెలంగాణలో తొలి లోక్సభ అభ్యర్థిని ప్రకటించారు. ఖమ్మం నుంచి లోక్సభ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీనివాసరెడ్డిని సభకు పరిచయం చేశారు. శ్రీనును గెలిపిస్తే  కేంద్ర మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసేందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గెలిపిద్దాం అన్నారు. తెలంగాణలో కూడా మెజార్టీ ఎంపీలను గెలుచుకుంటామని చెప్పారు. రెండు ప్రాంతాల్లో వైఎస్ఆర్ సీపీ రాజన్న రాజ్యం తెస్తుందని జగన్ చెప్పారు.

జనం భారీగా తరలివచ్చారు. గ్రౌండ్ అంతా జనం కిక్కిరిసిపోయారు. తెలంగాణలో పార్టీకి ఎంత బలం ఉందో ఆ జనాన్ని చూస్తే అర్ధమవుతుంది. జగన్ రావడం నాలుగు గంటలు ఆలస్యమైనా జనం వేచిఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement