కాంగ్రెస్ పాలన దురదృష్టకరం: చంద్రబాబు
కేసీఆర్ పిట్టల దొర: చంద్రబాబు
ఖమ్మం : కాంగ్రెస్ పాలన దురదృష్టకరమని, కరెంటు, పెట్రోల్, డీజిల్, ఇంటి పన్ను, నీటి తీరువ వంటి అన్నిరకాల చార్జీలు పెరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. గురువారం ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, కొత్తగూడెం, మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలలో నిర్వహించిన ఆయా ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. దేశంలో ఎన్డీఏ కూటమి 300ఎంపీ స్థానాలు గెలుచుకుం టుందని, నరేంద్రమోడీ ప్రధాని కావడం ఖాయమ న్నారు. కేసీఆర్ పిట్టల దొర, వసూళ్ల రాజా అని చంద్రబాబు విమర్శించారు.
తన బిడ్డ, కొడుకు, అల్లుడుకు సీట్లు ఇచ్చారని రాజకీయం అంటే ఇదేనా..? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీ ఖాళీ అవుతుందని కేసీఆర్ అంటున్నాడు.. ‘ఇది బ్రాండీ సీసా కాదు.. ఖాళీ కావడానికి’ అని ఎద్దేవా చేశారు. ‘ సైకిల్ స్పీడ్ పెరిగింది.. గేరు మారుస్తా, బుల్లెట్‌లా దూసుకుకెళ్తా.. అడ్డం వస్తే తొక్కేసుకుంటా వెళ్తా’అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కేసీఆర్‌కు తానే రాజకీయ గురువునని, తాతలకు దగ్గులు నేర్పితే ఖబడ్దార్ జాగ్రత్త అని ఆయన హెచ్చరించారు.