
జనభేరి మోగింది
‘చెల్లెమ్మా.. ఈ కన్నీరు శాశ్వతం కాదమ్మా.. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుంది. మీ కష్టాలు తీరుతాయి. మీ అందరికీ అండగా.. ఎప్పుడూ మీ వెంటే ఉంటాను’ తనను కలిసి కన్నీరు పెట్టుకున్న విద్యార్థినులకు జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా కల్పించారు.
వైఎస్ జగన్ ‘పశ్చిమ’ పర్యటనలో పోటెత్తిన జనం
దారి పొడవునా ఉప్పొంగిన అభిమాన ప్రవాహం
లారీలు, ఆటోల్లో స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు
కిక్కిరిసిన సభా ప్రాంగణం
ప్రతి ఒక్కరినీ పలకరించి ఆప్యాయత పంచుకున్న జననేత
ప్రజల కన్నీళ్లు తుడుస్తూ.. భవిష్యత్‌పై భరోసా ఇస్తూ
ముందుకు సాగిన జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, ఏలూరు:
‘చెల్లెమ్మా.. ఈ కన్నీరు శాశ్వతం కాదమ్మా.. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుంది. మీ కష్టాలు తీరుతాయి. మీ అందరికీ అండగా.. ఎప్పుడూ మీ వెంటే ఉంటాను’ తనను కలిసి కన్నీరు పెట్టుకున్న విద్యార్థినులకు జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా కల్పించారు. ‘అవ్వా.. మనపార్టీ అధికారంలోకి వస్తుంది. త్వరలోనే నీ కష్టాలు తీరుతారుు’ వృద్ధులకు అని అభయమిచ్చారు. అన్నదాతలకు ఆసరాగా నిలుస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. ‘వైఎస్సార్ జనభేరి’ పేరుతో ఎన్నికల శంఖారావం పూరిం చేందుకు సోమవారం హనుమాన్ జంక్షన్ మీదుగా జిల్లాలోకి ప్రవేశించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో దిగిన వైఎస్ జగన్‌కు వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్లిన వైఎస్ జగన్ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త దుట్టా రామచంద్రరావు నివాసంలో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ‘పశ్చిమ’ పర్యటనకు బయలుదేరారు.
జంక్షన్‌లో ఆంజనేయస్వామిని దర్శిం చుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం రోడ్ షో ప్రారంభించారు. దారి పొడవునా ప్రజలు కాన్వాయ్‌ని ఆపి తమ కష్టాలు చెప్పుకున్నారు. కలపర్రు గ్రామస్తులు జాతీయ రహదారిపై జననేతను కలిశారు. తమ గ్రామంలోకి రావాలని పట్టుబట్టారు. వారి అభిమాన్ని కాదనలేకపోరుున జగన్‌మోహన్‌రెడ్డి గ్రామంలోకి వెళ్లారు. అక్కడ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మళ్లొస్తానంటూ వారినుంచి సెలవు తీసుకుని ఏలూరు వైపు సాగారు. దారిలో రామచంద్ర ఇంజినీరింగ్, సీఆర్‌ఆర్ కళాశాలల విద్యార్థులు ఆయనను చూడటానికి, కరచాలనం చేయడానికి ఎగబడ్డారు. వట్లూరు గేటు దాటి కొత్త బస్టాండ్, ఫైర్‌స్టేషన్ సెంటర్, వసంతమహల్ సెంటర్, పాత బస్టాండ్ మీదుగా అల్లూరి సీతారామరాజు స్టేడియానికి చేరుకోవడానికి దాదాపు 3 గంట ల సమయం పట్టింది. అడుగడుగునా ప్రజలు ‘జై జగన్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. భారీ స్థారుులో తరలివచ్చిన యువకులు బైక్ ర్యాలీ చేస్తూ వైఎస్ జగన్‌ను అనుసరించారు. దారిపొడవునా ఆయనతో కరచాలనం చేసేందుకు ప్రజలు పోటీపడ్డారు. వారందరినీ ఆయన చిరునవ్వుతో పలకరించారు.
ఉద్వేగ భరితంగా జననేత ప్రసంగం
మోసపూరిత మాటలతో స్వార్థపరుల వంచనతో విసిగి పోయిన జనానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగంలో నిజాయితీ కనిపించింది. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి బాధతో, యువనేత ఉద్వేగ భరితంగా పలికిన ప్రతి మాటా, చేసిన ప్రతి వాగ్దానం జనం గుండెను తాకాయి. రానున్న ఎన్నికల్లో విశ్వసనీయత, నిజాయితీతో కూడిన ప్రభుత్వాన్ని మనమే ఏర్పాటు చేసుకుందామని, ఇతర రాష్ట్రాలు గర్వపడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకుందామని ఆయన ఇచ్చిన పిలుపు జనాన్ని ఉత్సాహపరిచింది. ముఖ్యమంత్రి అయ్యాక నాలుగు సంతకాలు పెడతానని, అవి చరి త్రను మార్చే సంతకాలని దృఢ నిశ్చయంతో జననేత హామీ ఇచ్చిన సందర్భంలో జనం కళ్లలో వెలుగు కనిపించింది.
కిక్కిరిసిన సభా ప్రాంగణం
జనభేరి సభా ప్రాంగణం ఇసుకవేస్తే రాలనంత జనసందోహంతో కిక్కిరిసిపోరుుంది. దాదాపు 25 నిమిషాలపాటు సాగిన వైఎస్ జగన్ ప్రసంగానికి సభికులు జయజయధ్వానాలు పలికారు. సభాస్థలి పూర్తిగా నిండిపోయి, కనీసం నిలబడటానికి కూడా స్థానం లేకపోవడంతో సుమారు 30వేల మంది స్టేడియం బయట ఉండిపోయారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెం టరీ నియోజకవర్గ పరిశీలకులు తోట చంద్రశేఖర్, వైసీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, మాజీ మంత్రులు పిల్లిసుభాష్ చంద్రబోస్, పినిపే విశ్వరూప్, చేగొండి హరిరామజోగయ్య, మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, మద్దాల రాజే ష్, కొడాలి నాని, పాతపాటి సర్రాజు, ఇందుకూరి రామకృష్ణంరాజు, గ్రంధి శ్రీనివాస్, ముదునూరి ప్రసాదరాజు, అల్లు వెంకట సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాధరాజు, పేర్ని నాని, ఎమ్మెల్సీలు మేకా ప్రతాప అప్పారావు, మేకా శేషుబాబు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు తోట గోపి, పుప్పాల వాసు, వైసీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, పార్టీ అధికార ప్రతినిధులు ఊదరగొండి చంద్రమౌళి, ఘంటాప్రసాద్, బొద్దాని శ్రీనివాస్, దొడ్డిగర్ల సువర్ణరాజు, ఏలూరు నగర కన్వీనర్ గుడిదేసి శ్రీనివాస్ తదితరులు వైఎస్ జగన్ వెంట ఉన్నారు.
జనభేరి సైడ్ లైట్స్
వన్స్‌మోర్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ వంగపండు ఉష బృందం ఆలపించిన పాటలు సభికులను అలరించాయి. వైఎస్సార్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కట్టిన పాటలను వన్స్‌మోర్ అంటూ అడిగి మళ్లీ మళ్లీ పాడించుకున్నారు. ఆ పాటలకు అభిమానులు నృత్యాలు చేశారు.
జగనే మా ముఖ్యమంత్రి : జగనన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారంతా చేతులెత్తాలని వంగపండు ఉష కోరగా, సభాస్థలిలో ఉన్నవారంతా పిడికిలి బిగించి చేతులెత్తి తమ మద్దతు తెలిపారు. జగనే మా ముఖ్యమంత్రి అంటూ ముక్తకంఠంతో నినదించారు.
నీకన్నా బాగా పరిపాలిస్తా : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రసంగంలో ‘చంద్రబాబూ నీకన్నా 25 ఏళ్ళ చిన్నవాణ్ణి అయినా నీకన్నా బాగా పరిపాలిస్తా’ అనగానే సభికులు అవును అవును అంటూ ఒక్కసారిగా నినదించారు.
నేడు వైఎస్ జగన్ పర్యటన ఇలా
ఏలూరు, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘వైఎస్సార్ జనభేరి’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోడ్డు షో నిర్వహిస్తూ నిడదవోలు చేరు కుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని నల్లజర్ల మండ లం దూబచర్ల నుంచి ప్రారంభమయ్యే రోడ్డు షో నల్లజర్ల, అనంతపల్లి, దేవరపల్లి, పంగిడి, చాగల్లు, బ్రాహ్మణగూడెం మీదుగా నిడదవోలు చేరుతుంది. సాయంత్రం 4 గంటలకు నిడదవోలు గాంధీ చౌక్‌లో ఏర్పాటు చేసిన జనభేరి బహిరంగ సభలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తారు.