సాక్షి, రాజమండ్రి : జిల్లాలో రాజమండ్రి నగర పాలక సంస్థతో పాటు ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ జరుగనుంది. 5,47,649 మంది (2,69,971 మంది పురుషులు, 2,77,674 మం ది మహిళలు, నలుగురు ఇతరులు) ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
జిల్లాలో మొత్తం 314 వార్డులుండగా అమలాపురం లో నాలుగు, ముమ్మిడివరంలో మూడు, మండపేట, గొ ల్లప్రోలుల్లో ఒక్కొక్కటి చొప్పున 9 వార్డుల్లో ఎన్నిక ఏకగీవ్రమైంది. పోలింగ్ జరుగుతున్న 305 వార్డుల్లో 1082 మంది పోటీలో ఉండగా వారిలో 294 మంది వైఎస్సార్ కాంగ్రెస్, 303 మంది తెలుగుదేశం, 119 మంది కాం గ్రెస్ వారు. ఇండిపెండెంట్లు 278 మంది, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఇతర గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన 88 మంది ఉన్నారు. రాజమండ్రి సహా మిగిలిన అన్ని పట్టణాల్లో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీల మధ్య ముఖాముఖి పోటీ జరుగుతుండగా ఒక్క తునిలో మాత్రమే వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్‌ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.
భారీ బందోబస్తు..
ప్రతి మున్సిపాలిటీలో పోలింగ్ సందర్భంగా ఒక ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారి బందోబస్తు పర్యవేక్షిస్తారు. ప్రతి పది పోలింగ్ కేంద్రాలకు ఒక సీఐ, ఆరు నుంచి 8 కేంద్రాలకు ఒక ఎస్సై బాధ్యులుగా ఉండి పర్యవేక్షిస్తారు. ప్రతి కేంద్రం వద్దా కనీసం ఒక్క ఏఎస్‌ఐ లేదా హెడ్ కానిస్టేబుల్‌తో పాటు నలుగురి నుంచి ఆరుగురు కానిస్టేబుళ్లు విధుల్లోఉంటారు.
కేంద్రాల వద్ద విధులకు 2,994 మందిని నియోగించగా.. బయట శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేక బలగాలను, స్ట్రైకింగ్ ఫోర్స్‌లను వినియోగిస్తున్నారు. అవసరమైతే వినియోగించేందుకు రిజర్వ్ బలగాలను కూడా సిద్ధంగా ఉంచుతున్నారు. రాజమండ్రిలో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుకు 1300 మందిని నియోగిస్తుండగా, మరో 200 మంది సంచార బృందాలుగా నగరంలో శాంతిభద్రతలు పరిరక్షిస్తారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు మరింత పెంచారు.
పోలింగ్ విధుల్లో 2,941 మంది
కాగా..జిల్లాలో 2,941 మంది పోలింగ్ విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక పోలింగ్ అధికారి, ఇద్దరు సహాయ పోలింగ్ అధికారులు ఉంటారు. ఇంకా వీఆర్‌ఓలు, రూట్ ఆఫీసర్లు పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తారు. రూట్ ఆఫీసర్ల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
శనివారం రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో, అమలాపురం మున్సిపాలిటీ కార్యాలయం వద్ద, తునిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, సామర్లకోట మున్సిపల్ కార్యాలయం వద్ద, రామచంద్రపురం ఇందిరాగాంధీ మున్సిపల్ ైహైస్కూల్‌లో, పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, మండపేట మున్సిపల్ కార్యాలయం వద్ద, పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద, గొల్లప్రోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో, ముమ్మిడివరం ఏఐఎంఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో, ఏలేశ్వరం ఎంపీడీఓ కార్యాలయంలో పోలింగ్ సిబ్బందికి.. ఈవీఎంలతో పాటు అవసరమైన సామగ్రిని అందజేశారు. సిబ్బంది వాటిని తీసుకుని శనివారం సాయంత్రం తమతమ పోలింగ్ కేంద్రాలకు బయలు దేరారు.
యుద్ధానికి సిద్ధం
Published Sun, Mar 30 2014 12:16 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement