
చిత్తూరు అర్బన్: చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు టీడీపీలోకి వస్తే ఆ పార్టీలో ఉండలేమని మేయర్ హేమలత, ఆమె భర్త కటారి ప్రవీణ్ స్పష్టం చేశారు. శుక్రవారం గంగనపల్లెలోని తమ నివాసంలో పలువురు టీడీపీ కార్పొరేటర్లు, కార్యకర్తలతో మేయర్ దంపతులు సమావేశమయ్యారు. ప్రవీణ్ మాట్లాడుతూ తన తల్లిదండ్రులు చివరి నిమిషం వరకు టీడీపీ కోసం పనిచేశారన్నారు. పార్టీ కోసం తీసుకున్న నిర్ణయాలతోనే ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
‘అందరం మనోహరన్న నామినేషన్‌కు వెళదాం.. వాళ్లు పార్టీలో చేరారంటే నడిరోడ్డునుంచే వచ్చేస్తా, నాతో రావడానికి మీరు సిద్దమా..?’ అని ప్రవీణ్ కార్పొరేటర్లను ప్రశ్నించగా సిద్ధమంటూ చేతులెత్తారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు కంద, కిరణ్, వెంకట్, ఆనంద్, రాణి, అన్నపూర్ణ, కృపానందం, తిరుకుమరన్, శేషాద్రినాయుడు, యువరాజులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు సీకే బాబు పార్టీలోకి వస్తే కలుపుకుని పనిచేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్, ఎమ్మెల్సీ దొరబాబు పేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment